Share News

YCP: పోలీసుల అదుపులో బోరుగడ్డ అనిల్‌

ABN , Publish Date - Oct 17 , 2024 | 05:23 AM

టీడీపీ ఆఫీసుపై దాడి కేసు, చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో పోలీసులు వ్యవహరిస్తున్న తీరును పసిగట్టిన అనిల్‌.. ఇక, తాను సేఫ్‌ అనుకున్నారు. ఈ క్రమంలో గుంటూరులోని అమరావతి రోడ్డులో ఉన్న తన ఇంటికి ఇటీవల వచ్చేశారు. దీంతో పట్టాభిపురం పోలీసులు బుధవారం ఆయనను ఇంట్లోనే అదుపులోకి తీసుకున్నారు. పోలింగ్‌ తర్వాత కౌంటింగ్‌కు ముందు అనిల్‌ సోషల్‌ మీడియాలో చేసిన దూషణ లు, బెదిరింపులపై జూన్‌ 1న నమోదైన కేసులో అదుపులోకి ..

YCP: పోలీసుల అదుపులో బోరుగడ్డ అనిల్‌
Borugadda Anil Kumar

గుంటూరు ఇంట్లోనే అదుపులోకి

జగన్‌ హయాంలో లెక్కలేనన్ని అరాచకాలు

సభ్య సమాజం తలదించుకునేలా పోస్టులు

జగన్‌ ఆదేశిస్తే అరగంటలో చంద్రబాబును

లేపేస్తానంటూ తీవ్రస్థాయిలో హెచ్చరికలు

15 కేసులు.. 3 కేసుల్లో అరెస్టు పెండింగ్‌

ప్రభుత్వం మారిన వెంటనే అజ్ఞాతంలోకి


గుంటూరు, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరించి, హేయమైన భాషలో సోషల్‌ మీడియాలో చెలరేగిన రౌడీషీటర్‌ బోరుగడ్డ అనిల్‌ను పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. మాజీ సీఎం జగన్‌కు బంధువునని చెప్పుకొంటూ ఆయనపై ఎవరు విమర్శలు చేసినా వెంటనే సోషల్‌ మీడియాలో అనిల్‌ చెలరేగిపోయారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావడంతో అనిల్‌ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కొంతకాలం హైదరాబాద్‌, బెంగుళూరు ప్రాంతాల్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మొదట్లో అనిల్‌ను పట్టుకున్నందుకు పోలీసులు ప్రయత్నించినా ఓ ఉన్నతాధికారి కారణంగా సైలెంట్‌ అయిపోయారు.


Ycplo.gif

ఇంతలో టీడీపీ ఆఫీసుపై దాడి కేసు, చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో పోలీసులు వ్యవహరిస్తున్న తీరును పసిగట్టిన అనిల్‌.. ఇక, తాను సేఫ్‌ అనుకున్నారు. ఈ క్రమంలో గుంటూరులోని అమరావతి రోడ్డులో ఉన్న తన ఇంటికి ఇటీవల వచ్చేశారు. దీంతో పట్టాభిపురం పోలీసులు బుధవారం ఆయనను ఇంట్లోనే అదుపులోకి తీసుకున్నారు. పోలింగ్‌ తర్వాత కౌంటింగ్‌కు ముందు అనిల్‌ సోషల్‌ మీడియాలో చేసిన దూషణ లు, బెదిరింపులపై జూన్‌ 1న నమోదైన కేసులో అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.


ఎన్నెన్ని అరాచకాలో..

అనిల్‌ చేసిన అరాచకాలకు లెక్కే లేదు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, నారా లోకేశ్‌ మొదలు నాటి వైసీపీ అసమ్మతి నేతలైన రఘురామకృష్ణరాజు, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వంటి నేతలను హెచ్చరికలతో హడలెత్తించారు. అప్పటి ప్రతిపక్ష నేతలపై వ్యక్తిగత దూషణలు, వారి కుటుంబంలోని మహిళల పట్ల అసభ్యకరమైన వ్యాఖ్యలతో సభ్య సమాజం తలదించుకునేలా వ్యవహరించారు. జగన్‌ కనుసైగ చేేస్త అరగంటలో చంద్రబాబును లేపేస్తానని తీవ్ర వ్యాఖ్యలతో రెచ్చిపోయారు. అప్పట్లో ఆయన వాహనం నుంచి పోలీసులు మారణాయుధాలు సైతం స్వాధీనం చేసుకున్నారు. కాగా.. రాష్ట్రవ్యాప్తంగా బోరుగడ్డ అనిల్‌పై సుమారు 15 వరకు క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. అరండల్‌ పేట పోలీస్‌ స్టేషన్‌లో రౌడీషీట్‌ తెరిచారు.


ఇది కూడా చదవండి:

నా కష్టం... వేరొకరికి రాకూడదని...

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం

Updated Date - Oct 17 , 2024 | 11:42 AM