Share News

YSRCP: వైసీపీ నేత మోసం చేశాడు.. రియల్ఎస్టేట్ వ్యాపారి ఫిర్యాదు

ABN , Publish Date - Jul 01 , 2024 | 06:42 PM

ఏపీలో ప్రభుత్వం మారడంతో వైసీపీ ప్రభుత్వ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. జగన్ పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా అక్రమాలకు పాల్పడినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.

YSRCP: వైసీపీ నేత మోసం చేశాడు.. రియల్ఎస్టేట్ వ్యాపారి ఫిర్యాదు
Gopireddy Srinivasa Reddy

పల్నాడు జిల్లా: ఏపీలో ప్రభుత్వం మారడంతో వైసీపీ (YSRCP) ప్రభుత్వ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. జగన్ పార్టీ నేతలు ఇష్టారాజ్యంగా అక్రమాలకు పాల్పడినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. తాజాగా నరసరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై (Gopireddy Srinivasa Reddy) పెద్దఎత్తులో ఆరోపణలు వచ్చాయి. ఈరోజు(సోమవారం) గోపిరెడ్డిపై పల్నాడు ఎస్పీ మల్లికా‌గార్గ్‌కి ఫిర్యాదు చేశారు. ఈపూరు మండలo ఊడిచెర్లకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి లక్ష్మణ్ నాయక్ ఫిర్యాదు చేశారు.


కాకాని వద్ద తన వెంచర్ రహదారి కోసం రూ. 50 లక్షలు మాజీ ఎమ్మెల్యే వసూలు చేశారని ఆరోపించారు. మధ్యవర్తి దండా శివ రామకృష్ణకి రూ. 30 లక్షలు ఇచ్చానని బాధితుడు చెప్పాడు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి మరో రూ. 25 లక్షలు ఇచ్చానని అన్నారు. వెంచర్ అనుమతుల కోసం వివిధ దశల్లో వైసీపీ నేత ఇప్పల ధానారెడ్డి తన దగ్గర మొత్తం రెండున్నర కోట్ల రూపాయలు తీసుకున్నారని తెలిపారు. డబ్బులైన ఇవ్వాలని లేదా తనకు రహదారి అయినా చూపించాలని అడిగితే తనను చంపేస్తామని బెదిరించారని అన్నారు. ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని బాధితుడు లక్ష్మణ్ నాయక్ వేడుకున్నాడు.


ఈ వార్తలు కూడా చదవండి

Minister Ram Prasad : త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

CM Chandrababu: మంత్రి రాం ప్రసాద్ రెడ్డి భార్య తీరుపై ముఖ్యమంత్రి అసంతృప్తి

Read Latest AP News AND Telugu News

Updated Date - Jul 01 , 2024 | 09:42 PM