AP Govt: ఉచిత గ్యాస్ సిలిండర్లపై మరో కీలక నిర్ణయం .. నిధుల విడుదలకు పరిపాలన అనుమతులు
ABN , Publish Date - Oct 28 , 2024 | 07:15 PM
ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఇప్ప టికే ప్రభుత్వం జీవో జారీ చేసింది.ఈ నెల 29 నుంచి బుకింగ్స్ ప్రారంభించనున్నారు. దీపావళి (31) రోజున రాష్ట్ర స్థాయిలో సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించిన వెంటనే మొదటి ఉచిత సిలిండర్‌ని ఇళ్లకు డెలివరీ చేస్తారు.
అమరావతి: సార్వత్రిక ఎన్నికలకు ముందు కూటమి పార్టీల ఉమ్మడి మేనిఫెస్టోలో భాగంగా ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలెండర్లు ఇస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ హమీ మేరకు దీపావళి నుంచి పథకం అమలు కోరుతూ రూ. 894.92కోట్లకు పరిపాలనా అనుమతులు జారీ చేసింది. ఇదే సమయంలో ఏడాదికి మూడు గ్యాస్ సిలెండర్లు ఉచితంగా ఇచ్చేందుకు రూ.2684.75 కోట్లు ఖర్చవుతుందని ఉత్తర్వుల్లో వెల్లడించింది. ఈమేరకు జీవో ఆర్టీ నెంబర్ 38ని ప్రభుత్వ ఎక్స్ అఫీషియె కార్యదర్శి జి వీరపాండ్యన్ జారీ చేశారు.
దీపావళి ద్వారా పండుగకు ఇళ్లల్లో వెలుగులు: సీఎం చంద్రబాబు
దీపం పథకం ద్వారా దీపావళి పండుగకు ఇళ్లల్లో వెలుగులు తెస్తుందని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ‘‘మహిళల ఇంటి ఖర్చులు తగ్గించడానికి ఉమ్మడి రాష్ట్రంలో ‘దీపం’ పథకం ఆనాడు అమల్లోకి తెచ్చాం. ఇప్పుడు ఉచిత గ్యాస్ సిలిండర్ల ద్వారా వారికి ఎంతో మేలు జరుగుతుంది. వంట గ్యాస్ కోసం ఖర్చు చేసే డబ్బులను గృహిణులు ఇతర అవసరాలకు వాడుకోవచ్చు. అందుకే ఆర్థిక సమస్యలు ఉన్నా ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి శ్రీకారం చుట్టాం’’ అని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు..
ఉచితం సిలిండర్ వస్తుందా? రాదా.. వస్తే ఎవరికి..చాలా కాలంగా మహిళల్లో ఒక్కటే టెన్షన్.. ఆ టెన్షన్‌కు కూటమి ప్రభుత్వం పులిస్టాప్ పెట్టింది.. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా ఒక్కొక్క పథకానికి దీపం వెలిగిస్తున్నారు.. రేపటి నుంచి ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అందుబాటులోకి రానుంది.. సీఎం చంద్రబాబు వంటింటికి ఆర్థిక భరోసా ఇచ్చారని మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల హామీల అమలు విషయంలో కూట మి ప్రభుత్వం స్పష్టతతో అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఒక్కొక్కటిగా సూపర్ సిక్స్‌ని అమల్లోకి తీసుకొస్తోంది.ఈ క్రమంలో సూపర్ సిక్స్‌లో మహిళలకు ఇచ్చిన తొలి హామీని దీపావళి నుంచి అమల్లోకి తీసుకొస్తోంది.ప్రతి నాలుగు నెలలకు ఒకటి చొప్పున ఉచిత సిలిండర్ తీసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తోంది.ప్రస్తుతం గ్యాస్ బండ ధర రూ.876లో కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ రూ.25 పోను రూ.851 పూర్తిరాయితీ ఉంటుంది. ఏడాదికి 3 సిలిండర్లు తీసుకోవచ్చు.వాస్తవానికి దీపం పథ కాన్ని గత టీడీపీ హయాం లో అమల్లోకి తెచ్చా రు.ఇప్పుడు మళ్లీ ఉచిత సిలిండర్లను ఇవ్వనుండ డంతో గృహిణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. జిల్లాలో లక్ష మంది లబ్ధిపొందనున్నారు.
రేపటి నుంచి బుకింగ్స్
ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఇప్ప టికే ప్రభుత్వం జీవో జారీ చేసింది.ఈ నెల 29 నుంచి బుకింగ్స్ ప్రారంభించనున్నారు. దీపావళి (31) రోజున రాష్ట్ర స్థాయిలో సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించిన వెంటనే మొదటి ఉచిత సిలిండర్‌ని ఇళ్లకు డెలివరీ చేస్తారు. ఉచిత సిలిండర్ బుక్ చేసుకోగానే ఒక ఎస్ఎంఎస్ లబ్ధిదారుడి ఫోన్ నెంబరుకు వెళుతుంది. ఆన్లైన్లో గ్యాస్ సిలిండర్ ధర చెల్లించాలి. పట్టణాల్లో 24 గంటల్లో, గ్రామాల్లో 48 గంటల్లోపు ఆ సొమ్ము డీబీటీ విధానంలో లబ్ధిదారుడి ఖాతాలో జమవుతుంది. విధివిధా నాలపై ఇప్పటికే ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శ కాలకు అనుగుణంగా పౌర సరఫరాల శాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ ఉచిత సిలిండర్లలో మొదటి బండను మార్చి 31వ తేదీ లోపు, రెండోది జూలై 31, మూడోది నవంబరు 31వ తేదీలోపు ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి లబ్ధిదారులకు ఏదైనా సమస్య ఎదురైతే ఇబ్బంది పడకుండా ప్రభుత్వం టోల్ ఫ్రీ నెం.1967ని ఏర్పాటు చేసింది. లబ్ధిదారులు ఆ నెంబరులో సంప్రదించవచ్చు
ఈ-కేవైసీ అయితేనే ఉచితం..
ఉచిత గ్యాస్ సిలిండర్లు పొందడానికి లబ్ధిదారులు వారికి సిలిండర్ సరఫరా చేస్తున్న గ్యాస్ డీలర్ వద్ద ఈ-కేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది.జిల్లాలో సుమారు 5,53,000 తెల్లకార్డు దారులు ఉన్నారు. ప్రస్తుతం ఏపీ స్టేట్ సివిల్ సప్లయిస్ కార్పొ రేషన్‌తో కలిపి మొత్తం 41 డిస్ట్రిబ్యూషన్ కంపెనీల్లో దీపం పథకం కింద సింగిల్ సిలిండర్లు 162702, డబుల్ సిలిండర్లు 23506 ఉన్నాయి. ఈ లెక్కన చూస్తే పెద్ద సంఖ్యలో ఈ-కేవైసీ కావాల్సి ఉంది. మంగళవారం నుంచి బుకింగ్ ప్రారంభమవు తుంది. అంటే సోమవారం ఒకరోజే ఈ-కేవైసీకి సమయం ఉంటుంది. దీంతో పౌర సరఫరాల అధికారుల్లో హైరా నా మొద లైంది.ఎల్పీజీ కనెక్షను ఉన్న తెల్లరేషను కార్డుదారులకు ఈ-కే వైసీ పూర్తిచేయాలని ఆయా డీలర్లకు సూచించారు. ఈ-కేవైసీ చేయించుకోవాల్సిన వినియోగదారులు లక్షల్లో ఉండడంతో ఇబ్బందులు పడకుండా యంత్రాంగం చర్యలు తీసుకోకపోతే సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది.పౌర సరఫరాల జిల్లా అధికారి జిల్లాలో మొత్తం గ్యాస్ కనెక్షన్లు 1,06,772 మా త్రమేనని చెప్పారు. డబుల్ సిలిండర్లు 12 వేలు, ఉజ్వల కనెక్షన్లు 23 వేలు ఉన్నాయన్నారు.ఈ లెక్క ప్రకారం చూస్తే తెల్లరేషను కార్డుదారులకు ఆయన చెప్పిన గ్యాస్ కనెక్షన్ల సం ఖ్యకు పొంతన కుదరకపోవడం గమనార్హం. అధికారులు పూర్తిగా సమాయత్తం కాకపోతే మహిళల నుంచి ప్రభు త్వంపై విమర్శలు వచ్చే అవకాశం ఉంది.అందువల్ల ప్రజా ప్రతినిధులు తమ బాధ్యత నిర్వర్తించాల్సిన అవసరం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
Gold And Silver Price: మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధర
Yanamala: ఇక జగన్ జీవితం పాతాళమే
Read Latest AP News And Telugu News