AP News: PMAY అర్బన్ పథకం అమలులో జగన్ ప్రభుత్వ ఘోర వైఫల్యం
ABN , Publish Date - Aug 05 , 2024 | 06:06 PM
ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకం అమల్లో జగన్ ప్రభుత్వ ఘోర వైఫల్యం చెందింది. జగన్ ప్రభుత్వ వైఫల్యాన్ని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేశాయి. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ సహా రాష్ట్రాలు ,కేంద్ర పాలిత ప్రాంతాల్లోని పట్టణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణానికి కేంద్రం శ్రీకారం చుట్టింది.
అమరావతి: ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకం అమల్లో జగన్ ప్రభుత్వ ఘోర వైఫల్యం చెందింది. జగన్ ప్రభుత్వ వైఫల్యాన్ని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేశాయి. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ సహా రాష్ట్రాలు ,కేంద్ర పాలిత ప్రాంతాల్లోని పట్టణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. దేశంలోనే అత్యధికంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆవాస్ యోజన అర్బన్ పథకం కింద ఇళ్లు కేటాయించినట్లు చెప్పింది. ఏపీకి కేటాయించిన ఇళ్లలో అసంపూర్తిగా సుమారు పది లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాలు ఉన్నాయని స్పష్టం చేసింది.
ఏపీకి ఇప్పటివరకు 21,37,028 ఇల్లు కేటాయించగా కేవలం 9,79,620 ఇళ్ల నిర్మాణం మాత్రమే పూర్తి చేసినట్లు తెలిపింది. ఇళ్ల నిర్మాణానికి ఏపీకి రూ.32,568 కోట్లు కేటాయించగా రూ.23,800 కోట్లు విడుదల చేసినట్లు పేర్కొంది. ఏపీకి భిన్నంగా గుజరాత్, తెలంగాణ, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, సహా చాలా రాష్ట్రాల్లో కేటాయించిన ఇళ్ల నిర్మాణాలు దాదాపు పూర్తి అయినట్లు తెలిపింది. తెలంగాణకు ఇప్పటివరకు 2,50,084 ఇళ్లు కేటాయించగా 2,24,679 ఇళ్ల నిర్మాణాలు పూర్తి అయ్యాయని చెప్పింది. రాజ్యసభలో బీజేపీ ఎంపీ కే. లక్ష్మణ్ సహా పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వివరాలు వెల్లడించింది.