Share News

Pawan Kalyan: పార్టీ బలోపేతంపై జనసేనాని ఫోకస్‌..

ABN , Publish Date - Jul 19 , 2024 | 01:35 PM

రాష్ట్రప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూనే.. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై జనసేన అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ ఫోకస్ పెట్టారు. ఎన్నికల ముందు వరకు జనసేనను చులకనగా చూసినవారంతా.. ఎన్నికల ఫలితాల తర్వాత జనసేన పార్టీని ఏపీలో బలమైన రాజకీయ శక్తిగా చూస్తున్నారు.

Pawan Kalyan: పార్టీ బలోపేతంపై జనసేనాని ఫోకస్‌..
Pawan Kalyan

రాష్ట్రప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూనే.. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై జనసేన అధ్యక్షులు పవన్‌ కళ్యాణ్‌ (Pawan Kalyan) ఫోకస్ పెట్టారు. ఎన్నికల ముందు వరకు జనసేనను చులకనగా చూసినవారంతా.. ఎన్నికల ఫలితాల తర్వాత జనసేన (Janasena) పార్టీని ఏపీలో బలమైన రాజకీయ శక్తిగా చూస్తున్నారు. ముఖ్యంగా యువత మద్దతు జనసేనకు ఎక్కువుగా ఉంది. మరోవైపు మహిళల ఓటు బ్యాంకు పవన్‌ కళ్యాణ్‌ పార్టీకి అధికంగానే ఉంది. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన కీలక భూమిక పోషించింది. ఈ ఎన్నికల్లో వంద శాతం స్ట్రైక్‌ రేట్‌ సాధించిన జనసేన పార్టీ వచ్చే ఎన్నికల నాటికి తన బలాన్ని రెట్టింపు చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. దీర్ఘకాలిక లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చిన పవన్‌ కళ్యాణ్‌.. తన పార్టీకి చట్టసభల్లో ప్రాతినిధ్యం లభించడంతో.. ప్రస్తుతం తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఓవైపు ప్రభుత్వంలో తన మార్క్‌ పాలనను చూపిస్తున్న పవన్‌ కళ్యాణ్‌.. పార్టీ క్యాడర్‌ను కంటికి రెప్పలా కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. మరోవైపు తన పాలనతో ప్రజల మ ప్రశంసలు అందుకుంటున్నారు. ఈక్రమంలో మరింతమంది సామాన్య ప్రజలను తన పార్టీలో చేర్చుకునేందుకు జనసేన క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించింది.

Amaravati : భార్యాభర్తల మధ్య విభేదాలు చిన్నారుల సంరక్షణకు అవరోధం కారాదు


పది రోజుల పాటు..

జనసేన క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం జులై 18న ప్రారంభమైంది. ఈ మెంబర్‌ షిప్‌ డ్రైవ్‌ జులై 28వరకు కొనసాగనుంది. జనసేన క్రియాశీల సభ్యత్వం తీసుకునే సభ్యులకు అనేక ప్రయోజనాలను పార్టీ కల్పిస్తోంది. సభ్యత్వం తీసుకున్న వ్యక్తికి రూ.5లక్షల బీమా ప్రయోజనాన్ని అందిచనుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 6.47 లక్షల క్రియాశీల సభ్యులు ఉండగా.. వీటి రెన్యూవల్‌తో పాటు కొత్త సభ్యులను చేర్చకోవడంపై జనసేన దృష్టిపెట్టంది. కొత్తగా 9లక్షల క్రియాశీల సభ్యత్వాలు చేయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రతి సంవత్సరం క్రియాశీల సభ్యత్వాల సంఖ్యను పెంచుకోవడం ద్వారా పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే లక్ష్యంతో జనసేనాని అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేసుకోవడానికి మంచి అవకాశంగా జనసేన భావిస్తోంది.

అరాచకం గురించి జగన్‌ మాట్లాడితే రోత పుడుతోంది: లోకేశ్‌


చేరికలపై ఫోకస్‌..

జనసేన పార్టీని సంస్థాగతంగా క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు చేరికలపై దృష్టిపెట్టాలని జనసేనాని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎటువంటి రిమార్కులేని కూటమిలో భాగస్వాములుగా లేని పార్టీల నుంచి నాయకులను జనసేనలో చేర్చుకోవాలనే ఆలోచనలో అధినేత ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్థానికంగా ఉన్న నాయకులతో పాటు కొత్తవాళ్లను చేర్చకోవడం ద్వారా రానున్న ఐదేళ్లలో జనసేనను బలమైన రాజకీయ శక్తిగా మార్చాలనే ఆలోచనలతో ఆ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు మండల స్థాయి కమిటీలను పూర్తిస్థాయిలో వేయడంతో పాటు.. బలమైన నాయకులను జిల్లా అధ్యక్షులుగా నియమించనున్నట్లు తెలుస్తోంది.


ఇసుక మాఫియాను విడిచిపెట్టం: మంత్రి సుభాశ్‌

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Read More Andhra Pradesh News and Latest Telugu News

Updated Date - Jul 19 , 2024 | 01:35 PM