Burlaramanjaneyulu: ప్రత్తిపాడు నియోజకవర్గ అభివృద్ధికి ప్రతీనెల సమీక్ష
ABN , Publish Date - Jul 02 , 2024 | 12:55 PM
Andhrapradesh: ప్రత్తిపాడు నియోజకవర్గ అభివృద్ధికి ప్రతీనెల సమీక్షించి ప్రాధాన్యతల వారీగా లక్ష్యాలు నిర్ణయిస్తామని ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... నెల రోజులలోపు నియోజకవర్గంలో చేపట్టాలనుకున్న పనులను గుర్తించామని.. సాగు నీటి కాలువల్లో పూడిక తీత పనులు చెయ్యాలని నిర్ణయించామన్నారు.
గుంటూరు, జూలై 2: ప్రత్తిపాడు (Prathipadu) నియోజకవర్గ అభివృద్ధికి ప్రతీనెల సమీక్షించి ప్రాధాన్యతల వారీగా లక్ష్యాలు నిర్ణయిస్తామని ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు (MLA Burla Ramanjaneyulu) తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... నెల రోజులలోపు నియోజకవర్గంలో చేపట్టాలనుకున్న పనులను గుర్తించామని.. సాగు నీటి కాలువల్లో పూడిక తీత పనులు చెయ్యాలని నిర్ణయించామన్నారు. కాల్వల్లో గుర్రపుడెక్క పెద్ద ఎత్తున పేరుకుపోయి ఉందన్నారు. గత ఐదేళ్ళలో ప్రభుత్వం కాల్వల గురించి పట్టించుకోలేదని విమర్శించారు. పూడిక తీత పనులకు గాను మొదటి క్యాబినెట్‌లోనే సీఎం ఆమోదించారని తెలిపారు.
Chandrababu: చంద్రబాబు సొంతింటి నిర్మాణానికి లంచం అడిగిన డిప్యూటీ సర్వేయర్‌పై వేటు
గతంలో పెద్ద కాంట్రాక్ట్‌లు వచ్చి పనులు చేయకుండా చేశామని బిల్లులు తీసుకునేవారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారిందన్నారు. రోడ్లపై గుంతలను తాత్కాలంగా పూడ్చి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని నిర్ణయించినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. గుంటూరు ఛానల్ పొడిగింపునకు కూడా నిధులు బడ్జెట్ లో పెట్టాలని అడిగామన్నారు. ఛానల్‌ను పర్చూరు వరకు పొడగించాలంటే మొదటి నుంచి కాలువను వెడల్పు చేయాల్సి ఉందన్నారు. ఛానల్ పొడగింపునకు ఇప్పటికే ప్రతిపాదనలున్నాయని.. వాటి మేరకు బడ్జెట్‌లో నిధులు మంజూరుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి....
Trains: ప్రత్యేక వారాంతపు రైళ్ల సేవల పొడిగింపు
Lok Sabha Updates: రాహుల్ ప్రసంగంపై వివాదం.. ఆ వ్యాఖ్యలు తొలగింపు..
Read Latest AP News AND Telugu News