Share News

Ragharama: నామీద రాజద్రోహం కేసు పెట్టారు... రఘరామ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Jul 18 , 2024 | 07:08 PM

ఐపీఎస్ అధికారి (IPS Officer) పీవీ సునీల్ కుమార్‌ (PV Sunil Kumar)పై కేసు నమోదైంది. ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnamraju) ఫిర్యాదు మేరకు గుంటూరు జిల్లా, నగరపాలెం పోలీసులు (Police) కేసు నమోదు చేశారు. వైసీపీ ప్రభుత్వం (YCP Govt)లో సునీల్ సీఐడీ డీజీగా పని చేశారు.

Ragharama: నామీద రాజద్రోహం కేసు పెట్టారు... రఘరామ సంచలన వ్యాఖ్యలు
Raghurama Krishnamraju

అమరావతి: ఐపీఎస్ అధికారి (IPS Officer) పీవీ సునీల్ కుమార్‌ (PV Sunil Kumar)పై కేసు నమోదైంది. ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnamraju) ఫిర్యాదు మేరకు గుంటూరు జిల్లా, నగరపాలెం పోలీసులు (Police) కేసు నమోదు చేశారు. వైసీపీ ప్రభుత్వం (YCP Govt)లో సునీల్ సీఐడీ డీజీగా పని చేశారు. అప్పుడు ఎంపీగా ఉన్న రఘురామ కృష్ణంరాజును కస్టడీకి తీసుకున్న సమయంలో కొట్టడమే కాకుండా హత్యాయత్నం చేశారని, చిత్ర హింసలు పెట్టారని ఫిర్యాదు చేశారు. దీంతో మాజీ సీఐడీ సునీల్‌తోపాటు పలువురు అధికారులపై పోలీసులు పలు సెక్షన్లకింద కేసు నమోదు చేశారు.


‘‘మాజీ సీఐడీ చీఫ్ పివి సునీల్ కుమార్‌తో పాటు ఐదుగురిపై ఫిర్యాదు చేశాం. గత నెలలో చేసిన ఫిర్యాదు పై ఎఫ్ ఐ ఆర్ నమోదైంది‌. నా దగ్గర ఉన్న సమాచారాన్ని, ఆధారాలను ఎస్పీకి ఇవ్వటానికి వచ్చాను. ఎలాంటి ఆలస్యం లేకుండా విచారణ చేస్తామన్నారు. 307 కేసులో డీజీ స్థాయి అధికారులు, మాజీ సీఎం జగన్ ఉండటం ఇప్పటి వరకూ విచారణ జరగలేదు. హత్యాయత్నం కేసు నమోదైనప్పుడు అధికారులను సస్పెండ్ చేయాలి. ఈ కేసులో ఇప్పటి వరకూ ఇది చేయలేదు. కొద్ది రోజుల తర్వాత అయినా సస్పెండ్ చేస్తారని భావిస్తున్నాను. పీవీ సునీల్ కుమార్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌తో పోల్చితే నేనే దళిత బంధువును. దళితులపై దాడి జరిగినప్పుడు నేనే స్పందించాను. వాళ్లెప్పుడూ స్పందించిన దాఖలాలు లేవు. కేసు నమోదైన వారందరిని అరెస్ట్ చేస్తారని నమ్ముతున్నాను. డీజీ స్థాయి అధికారులు కాబట్టే అరెస్టులో జాప్యం అవుతుందని భావిస్తున్నాను. అప్పటి గుంటూరు కలెక్టర్‌ను కూడా ప్రశ్నించాలి. డాక్టర్ శ్రీకాంతే అందుబాటులో ఉండాలని కలెక్టర్ ఎందుకు రాశాడో తేల్చాల్సి ఉంది. సాక్షిగా బోరుగడ్డ అనిల్ సంతకం తీసుకున్నారు. వీరంతా అప్పటికే సిద్ధంగా ఉన్నారంటే ఒక కుట్ర ప్రకారమే జరిగింది‌. నామీద రాజద్రోహం కేసు పెట్టారు’’ అని రఘరామ తెలిపారు.


జగన్ ప్రభుత్వ (Jagan Govt) హాయంలో తనపై జరిగిన కస్టోడియల్ టార్చర్‌పై (Custodial torture) గుంటూరు ఎస్పీకి (Guntur SP) రఘురామకృష్ణంరాజు ఫిర్యాదు చేశారు. తనపై పోలీస్ కస్టడీలో జరిగిన హత్యాయత్నానికి బాధ్యులుగా సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్, ఇంటిలిజెన్స్ చీఫ్ సీతారామంజనేయులు, మాజీ సీఎం వైఎస్ జగ్మోహన్ రెడ్డి, అప్పటి సీఐడీ, అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్‌లపై కేసు నమోదైంది. తనకు అయిన గాయాలపై కోర్టుకు గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి (Dr. Prabhavati) తప్పుడు నివేదిక ఇచ్చారని ఫిర్యాదు చేశారు. జగన్ రెడ్డిని విమర్శిస్తే తనను చంపేస్తానని సునీల్ కుమార్ తనను బెదిరించారని కూడా రఘురామ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు గుంటూ జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు.


Updated Date - Jul 18 , 2024 | 07:08 PM