Share News

Ayyanna Patrudu: ఇదేం పద్ధతి.. అయ్యన్న పాత్రుడు సీరియస్

ABN , Publish Date - Nov 18 , 2024 | 01:25 PM

ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సభలో సీరియస్ కామెంట్స్ చేశారు. తప్పుడు నివేదికలు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ఆదేశించారు. ఒక అధికారిపై చర్యలు చేపడితే మిగిలిన అధికారులు ఇలా చేయరని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు హెచ్చరించారు.

 Ayyanna Patrudu: ఇదేం పద్ధతి.. అయ్యన్న పాత్రుడు సీరియస్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (AP Assembly budget meetings) సోమవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ప్రశ్నోత్తరాల సమయం (Question time continues) కొనసాగుతోంది. అయితే సభలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సీరియస్ కామెంట్స్ చేశారు. జగనన్న కాలనీల్లో పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని కోరారు. అధికారుల నివేదికలకు వాస్తవ పరిస్థితులకు చాలా తేడా ఉందని అన్నారు. తప్పుడు నివేదికలు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ఆదేశించారు. ఒక అధికారిపై చర్యలు చేపడితే మిగిలిన అధికారులు ఇలా చేయరని.. అధికారులు ఇలాంటి పద్ధతులు వెంటనే మానుకోవాలని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు హెచ్చరించారు.


విజిలెన్స్ విచారణ కొనసాగుతుంది: మంత్రి కొలుసు పార్థ సారథి

kolusu.jpg

జగనన్న హౌసింగ్ ఇళ్లల్లో పూర్తి విచారణ చేయాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే ఆదేశించారని మంత్రి కొలుసు పార్థ సారథి తెలిపారు.జగనన్న కాలనీల్లో డిపార్ట్‌మెంట్..విజిలెన్స్ విచారణ కొనసాగుతుందని చెప్పారు. అవసరమైతే సభ్యులు సూచనలు ఇస్తే కాంట్రాక్టర్లను మార్చేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు.


ఇళ్ల నిర్మాణాలు ముందుకు సాగడం లేదు: ఎమ్మెల్యే గనబాబు

హౌసింగ్ ఇళ్ల నిర్మాణాలు ముందుకు సాగడం లేదని ఎమ్మెల్యే గనబాబు అన్నారు. లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. హౌసింగ్ ఇళ్లా నిర్మాణాలపై ప్రభుత్వం విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.


అధ్వాన్నంగా జగనన్న కాలనీల నిర్మాణాలు: ఎమ్మల్యే వరద రాజుల రెడ్డి

జగనన్న కాలనీల నిర్మాణాలు అధ్వాన్నంగా ఉన్నాయని ప్రొద్దుటూరు ఎమ్మల్యే వరద రాజుల రెడ్డి చెప్పారు. చిన్న వర్షాలకు ఇల్లు కూలిపోయేలా ఉన్నాయని తెలిపారు.జగనన్న కాలనీల్లో కాంట్రాక్టర్లు భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపించారు. కోట్లాది రూపాయల ప్రజాధనం కాంట్రాక్టర్లు దండుకున్నారని మండిపడ్డారు.


ఈ వార్తలు కూడా చదవండి..

విశాఖ రైల్వే డీఆర్ఎం అరెస్టును ధ్రువీకరించిన సీబీఐ

బాబు అరెస్టుకు.. నా స్టేట్‌మెంట్లతో లింకా..

Read Latest AP News and Telugu News

Updated Date - Nov 18 , 2024 | 01:34 PM