Share News

Peddireddy: ఒక్కొక్కటిగా పెద్దిరెడ్డి బాగోతాలు బయటకు.. వందల సంఖ్యలో ఫిర్యాదులు

ABN , Publish Date - Jul 25 , 2024 | 04:30 PM

మాజీమంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) కుటుంబ అక్రమాలు, అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం అండ చూసుకుని ఐదేళ్లు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు చెలరేగిపోయారు.

Peddireddy: ఒక్కొక్కటిగా పెద్దిరెడ్డి బాగోతాలు బయటకు.. వందల  సంఖ్యలో ఫిర్యాదులు
Peddireddy Ramachandra Reddy

అన్నమయ్య జిల్లా: మాజీమంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) కుటుంబ అక్రమాలు, అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం అండ చూసుకుని ఐదేళ్లు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు చెలరేగిపోయారు. తాజాగా పెద్దిరెడ్డి కుటుంబం చేతిలో మోసపోయిన బాధితులు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయానికి భారీగా చేరుకుంటున్నారు. వందల సంఖ్యల్లో భూ బాధితులు కార్యాలయానికి వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. మరికాసేపట్లో భూ బాధితుల నుంచి వినతి పత్రాలను రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా స్వీకరించనున్నారు.


సిసోడియా‌కు ఫిర్యాదులు

మదనపల్లి, పుంగనూరు, తంబళ్లపల్లి, పీలేరు నాలుగు నియోజకవర్గాల నుంచి బాధితులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పెద్దిరెడ్డి కుటుంబం దాడులు, దౌర్జన్యాలు, అరాచకాలకు భయపడి తమ బాధను ఇంతకాలం బయటకొచ్చి చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫైళ్ల దహనం ఘటనపై స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. మదనపల్లి డివిజన్‌లోని 11 మండలాల తహసీల్దార్‌లతో సిసోడియా సమావేశమయ్యారు. ఫైళ్ల దహనం ఘటనపై పోలీసుల దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది.


ALSO Read: Chandrababu: శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు

భార్య స్వర్ణలత పేరిట భూములు

మరోవైపు.. రేణిగుంట ఎయిర్‌పోర్టు పక్కనే 100 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అందులో వివిధ కంపెనీలు కొలువుతీరాయి. ఆ భూమి మధ్యలో 20.5 ఎకరాల అసైన్డ్‌ పొలం ఉంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సతీమణి స్వర్ణలత పేరిట ఇప్పుడు ఆ భూమి ఉంది. దీని మార్కెట్‌ విలువ రూ. 100 కోట్ల పైమాటే. వైసీపీ ప్రభుత్వంలో రెవెన్యూ అధికారులు గుట్టుచప్పుడు కాకుండా సెటిల్‌ చేశారు. ఇప్పుడు దాని గురించి తమకు ఏమీ తెలియదంటున్నారు. 100 ఎకరాల ప్రభుత్వ భూమి మధ్యలో 20 ఎకరాల అసైన్డ్‌ భూమి ఎలా వచ్చి చేరింది? అది పెద్దిరెడ్డి ఇంటి పేరిట ఎలా మారింది? అంతా పరమ రహస్యం. నాటి తిరుపతి జిల్లా కలెక్టర్‌‌కు, జిల్లా రెవెన్యూ అధికారులకే తెలిసిన రహస్యం. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఏర్పేడు మండలంలో వికృతమాల గ్రామం ఉంది. ఇది రేణిగుంట ఎయిర్‌పోర్టు పక్కనే ఉంది.


ఎయిర్‌పోర్టు భూములు, వికృతమాల భూములు పక్కపక్కనే ఉన్నాయి. వికృతమాల గ్రామ పరిధిలో 100 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అందులో వివిధ కంపెనీలు, పారిశ్రామిక సంస్థలకు భూములు కేటాయించారు. అక్కడ కంపెనీల ఆఫీసులు ఏర్పాటయ్యాయి. దానిపక్కనే 524-1 సర్వే నంబరులో 2.5 ఎకరాల భూమిని 2022లో పెద్దిరెడ్డి స్వర్ణలత కొన్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాక 2022 సెప్టెంబరులో ఆ భూమి మ్యుటేషన్‌ చేశారు. 533, 534, 535, 536, 537 సర్వే నంబర్లలో ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో అనూహ్యంగా అసైన్డ్‌ భూమి పుట్టుకొచ్చింది. 533 సర్వే నంబర్‌లో 5 ఎకరాలు (2007)లో, 534లో 5 ఎకరాలు 2005లో అసైన్‌ చేసినట్లుగా రికార్డులు తెరమీదకు తీసుకొచ్చారు. ఈ రెండు సర్వే నంబర్లలోని 10 ఎకరాల భూమి 2022 సెప్టెంబరులోనే స్వర్ణలత పేరిట మ్యుటేషన్‌ చేశారు.


ఆ సర్వే నంబర్ల పక్కనే ఉన్న 535 నంబర్‌లో 5.1 ఎకరాల ప్రైవేటు భూమి ఉన్నట్లుగా, దాన్ని కూడా పెద్దిరెడ్డి కొనుగోలు చేసినట్లుగా రికార్డులు చూపిస్తున్నాయి. చుట్టూ ప్రభుత్వ భూమి, దాని మధ్యలో ప్రైవేటు భూమి ఉంది. ఇది ఎలా వచ్చిందో ఇక్కడ మిస్‌ అయిన లాజిక్‌. అయినా సరే పెద్దిరెడ్డి ఎలా కొన్నారు. ఆ భూమిని పెద్దిరెడ్డి కోరుకున్నారని రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమిలో అసైన్డ్‌ భూమిని పుట్టించారా? లేక అధికార బలంతో ఆ భూములను దక్కించుకున్నారా? అన్నది తేలాల్సి ఉంది. ఇంతకుముందు ఇదే వికృతమాల గ్రామంలో ఇనాం భూమి పేరిట 120 ఎకరాల ప్రభుత్వ భూమిని కొట్టేసేందుకు పెద్దలు ప్రయత్నించగా ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు భూమి చేతులు మారిన తర్వాత విషయం వెలుగులోకి వచ్చింది.


ఇవి కూడా చదవండి...

Bhuvaneshwari: ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడంపై భువనమ్మ ఏం చెప్పారంటే?

Madanapalle Fire Accident: మదనపల్లి కేసులో కీలక ఆధారాలు లభ్యం

Read Latest AP News And Telangana News

Updated Date - Jul 25 , 2024 | 05:00 PM