Share News

Subhash: ఈఎస్ఐ హాస్పిటల్ వ్యవస్థని వైసీపీ భ్రష్టు పట్టించింది

ABN , Publish Date - Aug 19 , 2024 | 01:54 PM

ఈఎస్ఐ హాస్పిటల్ వ్యవస్థని గత ఐదేళ్లలో వైసీపీ భ్రష్టు పట్టించిందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆరోపించారు. ఈఎస్ఐ హాస్పిటల్ ప్రాంగణంలో ఉన్న 100పడకల హాస్పిటల్ భవనాన్ని, ల్యాబ్స్, డయోగ్నస్టిక్,సెంటర్లని మంత్రి వాసంశెట్టి సుభాష్ సోమవారం నాడు ప్రారంభించారు.

Subhash: ఈఎస్ఐ హాస్పిటల్ వ్యవస్థని వైసీపీ భ్రష్టు పట్టించింది

విజయవాడ: ఈఎస్ఐ హాస్పిటల్ వ్యవస్థని గత ఐదేళ్లలో వైసీపీ భ్రష్టు పట్టించిందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆరోపించారు. ఈఎస్ఐ హాస్పిటల్ ప్రాంగణంలో ఉన్న 100పడకల హాస్పిటల్ భవనాన్ని, ల్యాబ్స్, డయోగ్నస్టిక్,సెంటర్లని మంత్రి వాసంశెట్టి సుభాష్ సోమవారం నాడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహ‌న్‌రావు పాల్గొన్నారు. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి , ధనుంజయ రెడ్డి కనుసన్నల్లో గత ప్రభుత్వంలో మొత్తం వ్యవస్థను నడిపించారని మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆరోపణలు చేశారు.


గత ఐదేళ్లలో ఈఎస్ఐ హాస్పిటల్స్ జరిగిన అవినీతిపై విజిలెన్స్ విచారణ జరుగుతుందని హెచ్చరించారు. దళారీ వ్యవస్థ కారణంగా భారీ స్థాయిలో కుంభకోణాలు జరిగాయని విమర్శలు చేశారు. వైఎస్సార్ బీమాలో జరిగిన అవినీతిపైన విచారణ జరిపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ నాయకుల మీద కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారని మంత్రి వాసంశెట్టి సుభాష్ గుర్తుచేశారు.


చంద్రబాబుతో సహా అందరూ కడిగిన ముత్యం లాగా బయటకు వచ్చారని చెప్పారు. మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తను చేసిన అవినీతి ఎక్కడ బయటపడుతుందో అని భయపడి అసెంబ్లీకి రావడం లేదని అన్నారు. జగన్‌కి ఆ 10 స్థానాలు కూడా ఉండవని తేల్చిచెప్పారు. చివరికి ఆ పార్టీలో మిగిలేది జగన్ ఒక్కడేనని మంత్రి వాసంశెట్టి సుభాష్ విమర్శలు చేశారు.

Updated Date - Aug 19 , 2024 | 01:54 PM