Share News

YSRCP: సీనియర్లతో సమావేశం.. జగన్ ఏం చర్చించారు

ABN , Publish Date - Oct 04 , 2024 | 04:24 PM

మండలస్థాయి నాయకుల నుంచి జిల్లా స్థాయి నాయకుల వరకు చాలామంది అసంతృప్తితో ఉన్నారనే విషయాన్ని నాయకులు జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. సీనియర్ నేతలు కొందరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని, దీంతో క్షేత్రస్థాయి కేడర్ సైతం ముందుకు రావడం లేదని చెప్పగా..

YSRCP: సీనియర్లతో సమావేశం.. జగన్ ఏం చర్చించారు
YS Jagan

వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గత మూడు రోజులుగా పార్టీ శ్రేణులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా పార్టీ సీనియర్ నేతలతో జగన్ తాడేపల్లిలో సమావేశమై రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఏయే జిల్లాల్లో ముఖ్య నాయకులు పార్టీ వీడారు, రానున్న రోజుల్లో పార్టీని వీడనున్న నేతలు ఎవరనే విషయాన్ని జగన్ సీనియర్లను అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. వీలైనంతవరకు పార్టీని వీడకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని సూచించినట్లు సమాచారం. మరోవైపు పార్టీలో మండలస్థాయి నాయకుల నుంచి జిల్లా స్థాయి నాయకుల వరకు చాలామంది అసంతృప్తితో ఉన్నారనే విషయాన్ని నాయకులు జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. సీనియర్ నేతలు కొందరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని, దీంతో క్షేత్రస్థాయి కేడర్ సైతం ముందుకు రావడం లేదని చెప్పగా.. ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ప్రోత్సహించాలని, యాక్టివ్‌గా ఉండే నాయకులకు పార్టీలో పదవులు ఇద్దామని జగన్ చెప్పినట్లు చర్చ జరుగుతోంది. అదే విధంగా పార్టీ అంతర్గత వ్యవహారాలపై సీనియర్ నేతలతో జగన్ చర్చించారట.

AP Capital: ఏపీ రాజధానికి రైల్వే ట్రాక్‌పై ఏపీ ఎంపీల కీలక ప్రకటన


ప్రభుత్వంపై విమర్శల విషయంలో..

కూటమి ప్రభుత్వంపై విమర్శల విషయంలో వేగం పెంచాలని జగన్ సీనియర్ నేతలతో చెప్పినట్లు తెలుస్తోంది. ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగేలా అవసరమైతే అసత్య ప్రచారానికి వెనుకాడవద్దని దిశానిర్దేశం చేశారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వంపై ప్రజలు సంతృప్తిగానే ఉన్నట్లు వైసీపీలోనే కొందరు సీనియర్ల చర్చించుకుంటున్న నేపథ్యంలో.. ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలని, ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు కాకపోయినా హామీల విషయంలో విఫలమైందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని జగన్ చెప్పారట. లడ్డూ వివాదంలో వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిన నేపథ్యంలో.. ఈ వివాదంలో కూటమి ప్రభుత్వాన్ని దోషిగా చూపించే ప్రయత్నం చేయాలనే విషయం చర్చించినట్లు తెలుస్తోంది.

AP Highcourt: హైకోర్టులో సజ్జలకు ఊరట.. ఏ కేసులో అంటే


మారని తీరు..

సార్వత్రిక ఎన్నికల్లో జగన్ అవలంభించిన విధానాలు, వైఖరి కారణంగానే ప్రజలు ప్రతిపక్ష హోదా లేకుండా 11 సీట్లకు పరిమితం చేసినప్పటికీ వైసీపీ అధ్యక్షుడి తీరు మారనట్లు తెలుస్తోంది. వైసీపీ అరాచక పాలనకు స్వస్తి పలకాలనే ఉద్దేశంతో ప్రజలు కసిగా ఓటు వేసినట్లు ఎన్నికల ఫలితాలు స్పష్టంచేశాయి. ఇప్పటికైనా తీరు మార్చుకుని.. విపక్ష పార్టీగా నిర్మాణాత్మక పాత్రను పోషించాల్సి ఉండగా.. ఆ విధమైన ప్రయత్నం చేయడం మానేసి కూటమి ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారం చేయడం ద్వారా ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. జగన్ వైఖరి నచ్చక ఎంతోమంది సీనియర్ నేతలు, మాజీ మంత్రులు వైసీపీని వీడినా.. జగన్ తన తప్పులను సరిదిద్దుకోకుండా పాత పద్ధతులతోనే ముందుకెళ్తున్నట్లు పార్టీ నాయకులే చర్చించుకుంటున్నారు.


Tirumala issue: తిరుమల లడ్డూ వివాదం- సుప్రీంకోర్టు తీర్పుపై మంత్రుల రియాక్షన్ ఇదే..

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

To Read More Latest Telugu News Click Here

Updated Date - Oct 04 , 2024 | 04:24 PM