AP Elections: వైఎస్ జగన్ రహస్యం చెప్పేసిన చెల్లి షర్మిల.. బాబోయ్ ఈ విషయం తెలిస్తే..!?
ABN , Publish Date - Apr 20 , 2024 | 07:08 PM
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ (AP Elections) ఎన్నో రహస్యాలు బయటపడుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియ మొదలవ్వడంతో పోటీలో ఉన్న అభ్యర్థులు ఎన్నికల సంఘానికి తమ అఫిడవిట్లు సమర్పిస్తున్నారు. ఈ అఫిడవిట్లలో అభ్యర్థులు ఆస్తులతో పాటు అప్పుల వివరాలు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) సొంత సోదరి వైఎస్ షర్మిళా రెడ్డి (YS Sharmila Reddy) అఫిడవిట్‌లో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. లక్షల కోట్ల అప్పులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన జగన్ ప్రభుత్వం.. సొంత కుటుంబాన్ని వదలలేదు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ (AP Elections) ఎన్నో రహస్యాలు బయటపడుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియ మొదలవ్వడంతో పోటీలో ఉన్న అభ్యర్థులు ఎన్నికల సంఘానికి తమ అఫిడవిట్లు సమర్పిస్తున్నారు. ఈ అఫిడవిట్లలో అభ్యర్థులు ఆస్తులతో పాటు అప్పుల వివరాలు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) సొంత సోదరి వైఎస్ షర్మిళా రెడ్డి (YS Sharmila Reddy) అఫిడవిట్‌లో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. లక్షల కోట్ల అప్పులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన జగన్ ప్రభుత్వం.. సొంత కుటుంబాన్ని వదలలేదు. తన సొంత చెల్లి అప్పులఊబిలో కూరుకుపోయేలా చేశారు జగన్.. తన సొంత చెల్లికి జగన్ రూ. 82,58,15000 (82కోట్ల 58 లక్షల 15వేలు) అప్పు ఇచ్చారు. అలాగే షర్మిల తన వదిన వైఎస్ భారతి (YS Bharati) దగ్గర రూ.19,56,682 (19లక్షల56వేల682) అప్పు చేసింది. ఈ విషయాలు షర్మిల స్వయంగా తన అఫిడవిట్‌లో పేర్కొంది. ఈ అఫిడవిట్ ప్రకారం జగన్‌కు వారసత్వంతో వచ్చిన ఆస్తులను సోదరి షర్మిలకు పంచలేదనే విషయం స్పష్టమవుతోంది. రాష్ట్రాన్నే కాదు సొంత చెల్లిని జగన్ అప్పులపాలు చేశారా..? అనే చర్చ రాష్ట్రవ్యాప్తంగా సాగుతోంది.
Chandrababu: వైసీపీ దుర్మార్గపు పాలనను తరిమికొట్టాలి.. సీఎం జగన్‌పై చంద్రబాబు ఆగ్రహం
ఇన్ని అప్పులా!!
షర్మిలతో పాటు ఆమె భర్త అనీల్‌కు లక్షల్లో అప్పులు ఉన్నాయి. వైఎస్ విజయమ్మ వద్ద అనీల్ రూ.40,00,000(40లక్షలు) అప్పు చేశారు. అలాగే భార్య షర్మిల వద్ద అనీల్ రూ.29, 99,97,037 అప్పు చేశారు. షర్మిలకు మొత్తం రూ.82,77,71,682 అప్పు ఉండగా.. ఈ మొత్తం అప్పు సొంత అన్నయ్య, వదిన వద్దనే చేయడం గమనార్హం. ఈ అఫిడవిట్ చూసిన తర్వాత జగన్, షర్మిల మధ్య గ్యాప్ పెరగడానికి ఈ అప్పులే కారణమనే అనుమానం కలుగుతుంది. తనకు ఇవ్వాల్సిన ఆస్తులు పంచకపోవడంతోనే జగన్‌తో షర్మిల విబేధించినట్లు తెలుస్తోంది. డబ్బుల కోసం సొంత చెల్లిని జగన్ దూరం చేసుకున్నారనే విషయాన్ని రాష్ట్రప్రజలకు ఈ అఫిడవిట్ ద్వారా అర్థమవుతున్నట్లు తెలుస్తోంది. అలాగే షర్మిలకు ఇవ్వాల్సిన ఆస్తిని అప్పుగా జగన్ ఇచ్చారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
లెక్కలు ఇవే..!
షర్మిల ఇప్పటివరకు ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీచేయకపోవడంతో ఆమెకు సంబంధించిన ఆస్తులు, అప్పుల వివరాలు బయటకు రాలేదు. తాజాగా కడప లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీచేయడంతో ఆమెకు సంబంధించిన ఆస్తులు, అప్పుల వివరాలు బయటకు వచ్చాయి. షర్మిలకు 123కోట్ల 26 లక్షల 65వేల 164 రూపాయిల విలువైన చర ఆస్తులు ఉండగా.. 9కోట్ల29 లక్షల 58వేల 180 రూపాయిల విలువైన స్థిర ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. షర్మిల భర్త అనీల్ పేరు మీద 45కోట్ల 19 లక్షల 72వేల 529 రూపాయిల చర ఆస్తులు ఉండగా.. 4కోట్ల 59 లక్షల 2వేల 365 రూపాయిల స్థిర ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పొందుపర్చారు.
జగన్ టార్గెట్ అదేనా..!
షర్మిలకు జగన్ 82 కోట్ల రూపాయిల అప్పు వెనుక అసలు కారణం ఏమిటనేది తెలియరావడం లేదు. షర్మిల పేరు మీద దాదాపు వంద కోట్లకు పైగా ఆస్తులు ఉన్నప్పటికీ.. అప్పు కూడా వడ్డీతో కలిపితే అంతే మొత్తంలో ఉండే అవకాశం ఉంది. ఒకవేళ తన సోదరికి ఆస్తిని సమానంగా పంచితే.. రాజకీయంగా తనకు ఎదురు తిరిగే అవకాశం ఉంటుందనే అవకాశంతోనే జగన్ ఆస్తి పంచకుండా.. తనకు అప్పు ఇచ్చారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చివరికి ఆస్తి కోసం షర్మిల పోరాడినా ఫలితం లేకపోవడంతో ఇక రాజకీయంగా జగన్‌పై పోరడాటానికి కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. సొంత చెల్లినే నమ్మని వ్యక్తి జగన్ అన్న విషయం ఏపీ ప్రజలకు తెలిసిపోయింది.
చెల్లికి న్యాయం చేయని వ్యక్తిగా..!
చెల్లికే న్యాయం చేయని వ్యక్తి రాష్ట్ర ప్రజలకు నేనున్నా.. ప్రజల నమ్మకం జగన్ అంటూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఇంట్లో వ్యక్తికే సరైన న్యాయం చేయని జగన్ రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జగన్ ఏపీ ప్రజలను మోసం చేస్తున్నారు.. మాయ మాటలతో ప్రజలను మభ్య పెడుతున్నారంటే వైసీపీ నాయకులు వాటిని ఖండిస్తూ వచ్చారు. స్వయంగా షర్మిల అఫిడవిట్ చూశాక.. సొంత కుటుంబ సభ్యులకే పంగనామాలు పెట్టిన జగన్ ప్రజలకు పంగనామాలు పెట్టేందుకే రెండోసారి అధికారం ఇవ్వాలని అడుగుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చెల్లికి అన్యాయం చేసిన జగన్‌ను రాష్ట్ర ప్రజలు నమ్మాల్సిన అవసరం లేదని విపక్షాలు అంటున్నాయి. సొంత చెల్లినే అప్పుల పాలు చేసిన ఘనుడు జగన్ గురించి వైసీపీ నాయకులు ఏం చెబుతారో.. దీనిని ఎలా సమర్థించుకుంటారో వేచి చూడాల్సి ఉంది.
Chandrababu: ట్విటర్ ట్రెండింగ్‌లో హ్యాపీ బర్త్ డే చంద్రబాబు హ్యాష్ ట్యాగ్..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..