CM Chandrababu: ఈరోజు అమ్మవారిని దర్శించుకోవడం నా అదృష్టం..
ABN , Publish Date - Oct 09 , 2024 | 03:43 PM
Andhrapradesh: అమ్మవారి జన్మనక్షత్రం అయిన ఈ రోజు అమ్మవారి దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి పట్టువస్త్రాలు పెట్టడం ఆనవాయితీ అని చెప్పుకొచ్చారు. తిరుపతి తరవాత రెండో అతి పెద్ద దేవాలయం దుర్గగుడి అని తెలిపారు.
విజయవాడ, అక్టోబర్ 9: రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. బుధవారం సతీసమేతంగా దుర్గమ్మకు సీఎం పట్టువస్త్రాలు సమర్పించారు. అమ్మవారి దర్శనానంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ.. అమ్మవారి జన్మనక్షత్రం అయిన ఈ రోజు అమ్మవారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి పట్టువస్త్రాలు పెట్టడం ఆనవాయితీ అని చెప్పుకొచ్చారు. తిరుపతి తరవాత రెండో అతిపెద్ద దేవాలయం దుర్గగుడి అని తెలిపారు. దేవాలయాల్లో పవిత్రతను కాపాడుకోవడం అందరి బాధ్యత అని అన్నారు.
Exit Polls Fail: సర్వే సంస్థల అంచనాలు బోల్తా.. ప్రజల నాడి పసిగట్టడంతో విఫలం..
ఈసారి ఉత్సవ కమిటీ కాకుండా సేవ కమిటీ వేశామన్నారు. ఉత్సవాల్లో భాగంగా నిన్నటి వరకు 5,85,651 భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారన్నారు. 67931 మంది భక్తులు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకూ అమ్మవారిని దర్శించుకున్నారని తెలిపారు. దసరాకు దేవాదాయశాఖ తరుపున ఏర్పాట్లు బాగా చేశారన్నారు. ఈసారి దసరాలో సామాన్య భక్తులకు పెద్దపీట వేశామని తెలిపారు. ఎప్పుడూ ఊహించని విధంగా కృష్ణానదికి వరద వచ్చిందన్నారు. త్వరలోనే అమరావతి, పోలవరం, నదుల అనుసంధానం ఉంటుందని.. అమ్మ దయ వలన త్వరలో పూర్తి చేయాలని దుర్గమ్మను కోరినట్లు చెప్పారు. మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారి దర్శనానికి వచ్చిన ప్రతి భక్తులకు లడ్డు ప్రసాదం ఉచితంగా ఇస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
Hydra: జీతం ఇచ్చేందుకు రెడీ.. మీరు సిద్దమా అని సవాల్
కాగా.. బుధవారం దుర్గమ్మ ఆలయానికి చేరుకున్న సీఎంకు ఆలయ అర్చకులు , దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయ చిన్నరాజగోపురం వద్ద సీఎం చంద్రబాబు తలకు ఆలయ అర్చకులు పరివేష్టం చుట్టారు. ఆపై మేళతాళాల నడుమ ప్రభుత్వం తరపున దుర్గమ్మకు సతీసమేతంగా సీఎం పట్టువస్త్రాలను సమర్పించారు. అనంతరం సరస్వతీ అలంకరణలో ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు. అంతకుముందుకు ఘాట్ రోడ్డులో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. ఇటీవల వర్షాలకు ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు పరిసరాల్లో దెబ్బతిన్న ప్రాంతాలు, పునరుద్ధరణ తర్వాత ఫోటోలతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఈ ఫోటో ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి తిలకించారు. సీఎం చంద్రబాబుతో పాటు దుర్గమ్మను మంత్రులు నారాలోకేష్, ఎంపీ కేశినేని చిన్ని, మంత్రులు కొల్లు రవీంద్ర ఎమ్మెల్యే సుజన చౌదరి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన, విజయవాడ నగర కమిషనర్ రాజశేఖర్ బాబు, ఆలయ ఈఓ కేఎస్ రామారావు, దేవాదాయ శాఖ అధికారులు దర్శించుకున్నారు.
ఇవి కూడా చదవండి...
Anitha: ఫేసు టు ఫేస్ కూర్చుందాం రండి.. వైసీపీకి అనిత సవాల్
Viral Video: కారు దిగడంలోనూ తొందరైతే ఇలాగే ఉంటుంది మరి.. ఇతడికేమైందో చూస్తే..
Read Latest AP News And Telugu News