Share News

Viral Video: ఇది మరీ టూమచ్ భయ్యా.. ఇతను చేస్తున్న డేంజరస్ స్టంట్ చూస్తే.. నోరెళ్లబెడతారు..

ABN , Publish Date - Oct 09 , 2024 | 03:39 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి వీపుపై బియ్యం మూటను పెట్టుకుని డిప్స్ కొడుతున్నాడు. ఇందులో ఎలాంటి విశేషం లేదు కదా.. అని మీకు సందేహం రావొచ్చు. కానీ అతడు చేస్తున్న విన్యాసాన్ని పరిశీలించి అంతా షాక్ అవుతున్నారు. గోడపై ..

Viral Video: ఇది మరీ టూమచ్ భయ్యా.. ఇతను చేస్తున్న డేంజరస్ స్టంట్ చూస్తే.. నోరెళ్లబెడతారు..

సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నించడం చూస్తుంటాం. కొందరు వినూత్నంగా ఆలోచిస్తూ వింత వింత పనులు చేస్తుంటారు. మరికొందరు ఎదుటి వారిని ఇబ్బంది పెడుతూ.. వైరల్ అయ్యేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇంకొందరు తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి మరీ నెటిజన్ల దృష్టిని ఆకర్షించాలని చూస్తుంటారు. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి చేసిన డేంజరస్ స్టంట్ చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ఇది మరీ టూమచ్ భయ్యా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి వీపుపై బియ్యం మూటను పెట్టుకుని డిప్స్ కొడుతున్నాడు. ఇందులో ఎలాంటి విశేషం లేదు కదా.. అని మీకు సందేహం రావొచ్చు. కానీ అతడు చేస్తున్న విన్యాసాన్ని (stunt) పరిశీలించి అంతా షాక్ అవుతున్నారు. గోడపై కాళ్లు పెట్టిన అతను నేలపై ఓ చెక్క పలకపై ఏర్పాటు చేసిన ఇనుప కడ్డీపై కత్తి పెట్టాడు.

Viral Video: కోబ్రాల మధ్య భయంకర యుద్ధం.. చివరకు ఓ పాము ఎలా గెలిచిందో చూస్తే..


ఆ కత్తిని రెండు చేతులతో పట్టుకుని ఆపై వీపుపై బియ్యం మూటను (rice bag) ఉంచుకుని డిప్స్ కొడుతున్నాడు. అయితే మొదటి ప్రయత్నంలో అతను కొంచెం తడబడినా.. రెండో ప్రయత్నంలో విన్యాసాన్ని విజయవంతంగా పూర్తి చేశాడు. అతడు కత్తిని పట్టుకున్న తీరు చూస్తే.. ఏమాత్రం జారిపోయినా చేతులు కట్ అయ్యే ప్రమాదం ఉంది. అయినా అతను మాత్రం ఎంతో చాకచక్యంగా ఇనుప కడ్డీపై కత్తి పెట్టుకుని విన్యాసం చేశాడు.

Viral Video: అయ్యో.. ఈ జింకకు ఎంత కష్టం వచ్చింది.. మొసలిని ఓడించి గట్టుకొచ్చింది కానీ.. అంతలోనే..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘నీ ప్రాణాలను ఫణంగా పెట్టే ధైర్యం ఉన్నప్పుడు.. ఆర్మీలో చేరి దేశానికి సేవలు అందించు’’.. అంటూ కొందరు, ‘‘ప్రతిభ కంటే జీవితం ఎంతో ప్రధానం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2.68 లక్షలకు పైగా లైక్‌లు, 6.7 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: కారు దిగడంలోనూ తొందరైతే ఇలాగే ఉంటుంది మరి.. ఇతడికేమైందో చూస్తే..


ఇవి కూడా చదవండి..

Viral Video: కారు దిగడంలోనూ తొందరైతే ఇలాగే ఉంటుంది మరి.. ఇతడికేమైందో చూస్తే..

Viral Video: ప్రేయసితో మాట్లాడుతూ.. పామును గమనించలేదు.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు.

Viral Video: వామ్మో.. మరణం ఇలాక్కూడా వస్తుందా.. చివరి క్షణాల్లో ఈ తోడేలు ప్రవర్తన చూస్తే..

Viral Video: రైల్లో సమోసాలు తింటున్నారా.. ఇతనేం చేస్తున్నాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: ఆహా.. తెలివంటే ఈమెదే.. పాత్రలు శుభ్రం చేయడంలో ఈమె టెక్నిక్ చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 09 , 2024 | 03:41 PM