Share News

Viral Video: అయ్యో.. ఈ జింకకు ఎంత కష్టం వచ్చింది.. మొసలిని ఓడించి గట్టుకొచ్చింది కానీ.. అంతలోనే..

ABN , Publish Date - Oct 08 , 2024 | 08:47 PM

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. దాహం వేయడంతో ఓ జింక.. కొలను వద్దకు వెళ్లి నీరు తాగుతూ ఉంటుంది. అప్పటికే ఆకలితో ఉన్న మొసలి ఆహారం కోసం ఎదురు చూస్తుంటుంది. జింక రాగానే వెంటనే నోటితో పట్టుకుని లోపలికి లాగేసుకుంటుంది. మొసలి దాడితో..

Viral Video: అయ్యో.. ఈ జింకకు ఎంత కష్టం వచ్చింది.. మొసలిని ఓడించి గట్టుకొచ్చింది కానీ.. అంతలోనే..

అదృష్టం బాగుంటే ఎన్ని ప్రమాదాలు ఎదురైనా ఏమీ కాదు. అదే టైం కలిసిరాకపోతే.. ప్రాణాలు కాపాడుకోవాలని ఎంత ప్రయత్నించినా ఫలితం ఉండదు. ఇది మనుషులకే కాకుండా జంతువులకూ వర్తిస్తుంది. ఇందుకు నిదర్శనంగా మన కళ్ల ముందు అనేక సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ జింక తన ప్రాణాలు కాపాడుకునేందుకు చివరకు మొసలినే ఓడించింది. అయితే గట్టుకు రాగానే ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘అయ్యో.. ఈ జింకకు ఎంత కష్టం వచ్చింది’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. దాహం వేయడంతో ఓ జింక.. కొలను వద్దకు వెళ్లి నీరు తాగుతూ ఉంటుంది. అప్పటికే ఆకలితో ఉన్న మొసలి ఆహారం కోసం ఎదురు చూస్తుంటుంది. జింక రాగానే వెంటనే నోటితో పట్టుకుని లోపలికి లాగేసుకుంటుంది. మొసలి దాడితో (Crocodile attack on deer) షాక్ అయిన జింక.. ఎలాగైనా తప్పించుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తుంది.

Optical illusion: ఈ చిత్రంలో దాక్కున్న కుక్క పిల్లను 20 సెకన్లలో కనుక్కోవడం మీ వల్ల అవుతుందా..


ఈ క్రమంలో అంత పెద్ద మొసలిని సైతం విసిరి నీటిలోకి తోసేస్తుంది. ఇలా దాంతో పోరాడి క్షేమంగా ఒడ్డుకు చేరుకుంటుంది. అయితే తీరా ఒడ్డుకు చేరుకోగానే షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. అప్పటికే ఆ పక్కనే ఉన్న చెట్టు మాటున ఓ చిరుత పులి దాక్కుని ఉంటుంది. ఒడ్డు మీదకు వచ్చిన జింక.. అక్కడి నుంచి వెళ్లిపోవాలని ప్రయత్నించేలోపే వెనుక నుంచి చిరుత పులి (Leopard attack on deer) దానిపై దాడి చేసేందుకు దూసుకొస్తుంది. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది.

Viral Video: ప్రేయసితో మాట్లాడుతూ.. పామును గమనించలేదు.. చివరకు ఏమైందో చూస్తే నవ్వు ఆపుకోలేరు.


అయితే పరిస్థితి చూస్తుంటే చిరుత దాడిలో జింక ప్రాణాలు పోయినట్లే కనిపిస్తోంది. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అయ్యో పాపం.. ఇలా జరిగిందేంటీ’’.. అంటూ కొందరు, ‘‘అంత కష్టపడ్డా ప్రయోజనం లేకుండా పోయిందే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1600కి పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral: ట్యాక్సీ డ్రైవర్ నుంచి మెసేజ్.. లండన్‌లో పిల్లలను వదిలి ఇండియాకు.. ఆరా తీసిన భర్తకు దిమ్మతిరిగే షాక్..


ఇవి కూడా చదవండి..

Viral Video: వామ్మో.. మరణం ఇలాక్కూడా వస్తుందా.. చివరి క్షణాల్లో ఈ తోడేలు ప్రవర్తన చూస్తే..

Viral Video: రైల్లో సమోసాలు తింటున్నారా.. ఇతనేం చేస్తున్నాడో చూస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: ఆహా.. తెలివంటే ఈమెదే.. పాత్రలు శుభ్రం చేయడంలో ఈమె టెక్నిక్ చూస్తే..

Viral Video: వామ్మో.. ఇకపై టమాటాలు తినాలంటే ఆలోచించాలేమో.. ఈ పాము చేసిన నిర్వాకం చూడండి..

Viral Video: ద్యేవుడా.. చపాతీలను ఈమె ఎలాంటి ప్లేస్‌లో చేస్తుందో చూస్తే..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 08 , 2024 | 08:47 PM