Share News

Kadambari Jethwani: నటి జెత్వానీ కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం

ABN , Publish Date - Oct 01 , 2024 | 02:30 PM

Andhrapradesh: ఈ కేసులో సీనియర్ పోలీసు అధికారులు నిందితులుగా ఉండటం, ముంబై లింక్‌ల నేపథ్యంలో సీఐడీకు ఇవ్వడం మంచిదని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

Kadambari Jethwani: నటి జెత్వానీ కేసులో ప్రభుత్వం కీలక నిర్ణయం
AP Govt key decision in actress Jethwani case

అమరావతి, అక్టోబర్ 1: ముంబై నటి కాదంబరి జెత్వానీ (Mumbai Actress Kadambari Jethwani) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఈరోజు, రేపటిలోగా ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) వద్ద జరిగిన ఉన్నతస్థాయి భేటీలో ఈ కేసుపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో సీనియర్ పోలీసు అధికారులు నిందితులుగా ఉండటం, ముంబై లింక్‌ల నేపథ్యంలో సీఐడీకు ఇవ్వడం మంచిదని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం.

Sarpanch Elections: సర్పంచ్‌గా పోటీ చేసే ఆశావాహులకు శుభవార్త


ఈ కేసులో ఇప్పటికే ప్రథమ నిందితుడు కుక్కల విద్యాసాగర్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో నిందితులుగా ఉన్న అప్పటి విజయవాడ సీపీ క్రాంతి రాణా, డీసీపీ విశాల్ గున్ని, దర్యాప్తు అధికారి సత్యనారాయణ ముందస్తు బెయిల్ కోసం హైకోర్ట్‌లో పిటిషన్లు దాఖలు చేశారు. కేసు రెండు రాష్ట్రాల్లో దర్యాప్తు చేయాల్సి ఉండటంతో సీఐడీకి ఇవ్వాలని ప్రభుత్వానికి అధికారులు సూచించారు. న్యాయ నిపుణుల సలహా తీసుకుని నేడు, రేపటిలోగా ప్రభుత్వం నిర్ణయం ఉత్తర్వులను ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం.

Huge scam: చెత్తనూ వదలని వైసీపీ.. భారీ స్కాం బట్టబయలు


కాగా.. వైసీపీ హయాంలో జెత్వానీపై కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ ఫిర్యాదు ఆధారంగానే విమానంలో వెళ్లి మరీ ఆమెను విజయవాడకు తీసుకొచ్చారు. దీంతో తప్పుడు కేసు పెట్టి, అరెస్టు చేసి ఇబ్బందులకు గురి చేశారని జెత్వానీ ఇటీవలే ఇబ్రహీంపట్నం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కుక్కల విద్యాసాగర్ ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు ఆధారంగా తనపై అన్యాయంగా కేసు పెట్టి, తల్లిదండ్రులను అరెస్టు చేశారని పోలీసులకు నటి జెత్వానీ ఫిర్యాదు చేశారు. పారిశ్రామికవేత్తపై తాను పెట్టిన కేసును వెనక్కి తీసుకునేలా చేసేందుకు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారని, ఎఫ్ఐఆర్ నమోదు చేసిన వెంటనే ఆగమేఘాల మీద ముంబై వచ్చి తనతో పాటు తల్లిదండ్రులను అరెస్టు చేయడం కుట్రలో భాగమేనని ఆమె పేర్కొన్నారు. పీఎస్ఆర్ ఆంజనేయులు నేతృత్వంలోనే తనను అక్రమంగా నిరబంధించారని ఆమె పేర్కొన్నారు. తన పూర్వాపరాలు, ముంబైలో తన నివాసం తదితర అంశాలపై విశాల్ గున్ని ద్వారా ఆరా తీయించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

Chennai: బ్రహ్మోత్సవాలకు తిరుపతికి ప్రత్యేక బస్సులు..


జెత్వానీ ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు కుక్కల విద్యాసాగర్‌ను ప్రధాన నిందితుడిగా గుర్తించారు. కేసు పెట్టిన విషయాన్ని తెలుసుకున్న అతడు పరారవడంతో పోలీసులు ముమ్మరంగా గాలించి గత నెలలో విద్యాసాగర్‌ను అరెస్ట్ చేశారు. డెహ్రాడూన్‌లో విద్యాసాగర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు విజయవాడ 4వ ఏసీఎంఎం జడ్జి ముందు పోలీసులు హాజరుపరచారు. దీంతో విద్యాసాగర్‌కు జడ్జి అక్టోబరు 4వ తేదీ వరకు రిమాండ్ విధిస్తున్నట్టు చెప్పారు. ఇక.. ఇదే కేసులో ఐపీఎస్‌ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్‌ గున్నీ కూడా కీలకంగా ఉన్నారని తేలింది. పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు పెట్టారు. అలాగే ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం.. ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది. అధికార దుర్వినియోగ ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.


ఇవి కూడా చదవండి...

Huge scam: చెత్తనూ వదలని వైసీపీ.. భారీ స్కాం బట్టబయలు

Tirumala Laddu: టీటీడీ లడ్డూ వివాదంపై సుప్రీంలో కేఏపాల్ పిటిషన్

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 01 , 2024 | 04:05 PM