Share News

Speaker Ayyanna: దొడ్డిదారిన కాదు.. రాచమార్గంలో గవర్నర్‌ను తీసుకొచ్చాం!

ABN , Publish Date - Jul 22 , 2024 | 03:00 PM

Andhrapradesh: గత సమావేశాల వరకూ గవర్నర్‌ను అసెంబ్లీకి దొడ్డిదారిన తెచ్చినట్లుగా చుట్టూ తిప్పి వెనుక నుంచి తీసుకొచ్చేవారని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. సోమవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మాట్లాడుతూ... ఈ సమావేశాలకు గవర్నర్‌ను రాచమార్గంలో ముందు వైపు నుంచీ తీసుకొచ్చామన్నారు.

Speaker Ayyanna: దొడ్డిదారిన కాదు.. రాచమార్గంలో గవర్నర్‌ను తీసుకొచ్చాం!
AP Speaker Ayyannapatrudu

అమరావతి, జూలై 22: గత సమావేశాల వరకూ గవర్నర్‌ను అసెంబ్లీకి దొడ్డిదారిన తెచ్చినట్లుగా చుట్టూ తిప్పి వెనుక నుంచి తీసుకొచ్చేవారని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు (AP Speaker Chintakayala Ayyannapatrudu) అన్నారు. సోమవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మాట్లాడుతూ... ఈ సమావేశాలకు గవర్నర్‌ను రాచమార్గంలో ముందు వైపు నుంచీ తీసుకొచ్చామన్నారు. అసెంబ్లీకి రాచమార్గం ఉండాలనే గోడ కూల్చి గేట్-2 తలుపులు తీశామని తెలిపారు.

Economic Survey 2024: ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్.. ఈసారి భారత్ వృద్ధి రేటు ఏంతంటే..


నలుగురు ప్యానల్ స్పీకర్లను పెట్టుకోమని సీఎం సూచించారన్నారు. అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 26 వరకు జరుగుతాయన్నారు. రెండుబిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుందన్నారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు బిల్లుతో పాటు ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణ బిల్లు కూడా ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం కొన్ని శ్వేత పత్రాలు ప్రవేశపెట్టనుందని తెలిపారు. 88మంది మొదటిసారి గెలుపొందిన ఎమ్మెల్యేలు ఉన్నందున వచ్చే సమావేశాల్లోపు వారికి శిక్షణ ఇస్తామన్నారు. అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలు 80 శాతం మేర పూర్తయి ఉన్నాయన్నారు. ఆరు నెలల్లోగా వాటిని సభ్యులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. తొమ్మిది నెలల్లో అందుబాటులోకి తెస్తామని అధికారులు చెప్పారని స్పీకర్ అయ్యన్నపాత్రుడు వెల్లడించారు.


అసెంబ్లీ సమావేశాలు...

కాగా.. ఈరోజు ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే ఉయయసభలను ఉద్దేశించిన గవర్నర్ నజీర్ ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత అసెంబ్లీ వాయిదా పడింది. అనంతరం స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, విష్ణు కుమార్ రాజు హాజరయ్యారు. ఐదు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. కాగా బీఏసీ సమావేశానికి వైసీపీ సభ్యులు గైర్హజరయ్యారు.


ఇవి కూడా చదవండి...

CM Chandrababu: మినిట్ టు మినిట్ ఏం జరిగింది?.. మదనపల్లి ఘటనపై సీఎం చంద్రబాబు

Economic Survey 2024: ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్.. ఈసారి భారత్ వృద్ధి రేటు ఏంతంటే..

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 22 , 2024 | 03:17 PM