Share News

Viral: ఆటో డ్రైవర్‌గా మారిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే!

ABN , Publish Date - Jul 22 , 2024 | 02:45 PM

ప్రైవేటు సంస్థల్లో పని చేసే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు మంచి జీతాలు వస్తాయన్న విషయం అందరికీ తెలుసు. ముఖ్యంగా.. అనుభవం ఉన్న వారికి లక్షల్లోనే ప్యాకేజీ ఉంటుంది. అఫ్‌కోర్స్..

Viral: ఆటో డ్రైవర్‌గా మారిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే!
Software Employee Turned Driver

ప్రైవేటు సంస్థల్లో పని చేసే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు (Software Employees) మంచి జీతాలు వస్తాయన్న విషయం అందరికీ తెలుసు. ముఖ్యంగా.. అనుభవం ఉన్న వారికి లక్షల్లోనే ప్యాకేజీ ఉంటుంది. అఫ్‌కోర్స్.. పని ఒత్తిడి అనేది ఉంటుంది కానీ, అందుకు తగినట్టు జీతాలు అందిపుచ్చుకుంటారు. అయితే.. ఓ టెకీ మాత్రం ఆటో డ్రైవర్‌గా మారడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఓవైపు ఉద్యోగం చేస్తూనే.. మరోవైపు అతను ఆటో నడుపుతున్నాడు. ఇందుకు కారణం ఏంటో తెలుసా.. ఒంటరితనం. ఆ వివరాల్లోకి వెళ్తే..


బెంగళూరులోని కోరమంగళలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న వెంకటేశ్ గుప్తా (Venkatesh Gupta) అనే ఓ వ్యక్తి.. ఇటీవల ఓ ఆటో బుక్ చేసుకున్నాడు. అందులో కూర్చున్న తర్వాత.. ఆ ఆటోని నడుపుతున్న డ్రైవర్ ‘మైక్రోసాఫ్ట్’ (Microsoft) లోగో ఉన్న హూడీని ధరించడం చూసి ఆశ్చర్యపోయాడు. అసలు ఆ హూడీ అతని వద్దకు ఎలా వచ్చిందా? అనే ఆసక్తితో.. మాటలు కలపడం మొదలుపెట్టాడు. అప్పుడు అతనికి ఫ్యూజులు ఎగిరిపోయే విషయం తెలిసింది. తాను మైక్రోసాఫ్ట్ ఇంజినీర్‌నని, వారాంతాల్లో ఇలా ఆటో నడుపుతుంటానని ఆ డ్రైవర్ చెప్పాడు. ఎందుకని వెంకటేశ్ ప్రశ్నించగా.. ఒంటరితనాన్ని భరించలేక, ఆ ఒత్తిడిని ఎదుర్కోవడం కోసమని జవాబిచ్చాడు. కనీసం.. ఆటో నడుపుతూ ఇతరులతో మాట్లాడే అవకాశం లభిస్తుందని పేర్కొన్నాడు.


ఆ డ్రైవర్ మాటలు విని ఖంగుతిన్న వెంకటేశ్.. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా అందరితో పంచుకున్నాడు. ఓ టెక్కీ తన ఒంటరితనం కోసం ఎదుర్కోవడం కోసం ఆటో డ్రైవర్‌గా అవతారం ఎత్తాడని, దీన్ని బట్టి సామాజిక అనుసంధానం (Social Connection) ఎంత అవసరమో అర్థం చేసుకోవచ్చని టన ట్వీట్‌లో రాసుకొచ్చాడు. ఈ పోస్టు ఇప్పుడు నెట్టింట్లో చర్చనీయాంశంగా మారింది. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా.. అది మానవుల మధ్య ఉండే బంధాన్ని ఎప్పటికీ రీప్లేస్ చేయలేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. నగరాల్లో పని చేసే ఉద్యోగులందరూ ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారని, కుటుంబాలకు దూరంగా ఉండటం వల్ల మానసికంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read Latest Prathyekam News and Telugu News

Updated Date - Jul 22 , 2024 | 04:20 PM