Share News

Yarlagadda: భారీ వర్షం.. అధికారుల తీరుపై యార్లగడ్డ అసహనం

ABN , Publish Date - Sep 01 , 2024 | 12:35 PM

భారీ వర్షాలకు గన్నవరం రూరల్ మండలం అంబాపురంలో దయనీయ పరిస్థితి ఏర్పడింది. గ్రామాన్ని వరదనీరు ముంచెత్తడంతో ప్రజలు రక్షించాలంటూ ఆక్రందనలు పెడుతున్నారు. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు సైతం గ్రామానికి చేరుకుని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కోసం వేచి చూస్తున్నారు. ఫోన్ చేసినా అధికారుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Yarlagadda:  భారీ వర్షం.. అధికారుల తీరుపై యార్లగడ్డ అసహనం

కృష్ణాజిల్లా: భారీ వర్షాలకు గన్నవరం రూరల్ మండలం అంబాపురంలో దయనీయ పరిస్థితి ఏర్పడింది. గ్రామాన్ని వరదనీరు ముంచెత్తడంతో ప్రజలు రక్షించాలంటూ ఆక్రందనలు పెడుతున్నారు. ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు సైతం గ్రామానికి చేరుకుని ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కోసం వేచి చూస్తున్నారు. ఫోన్ చేసినా అధికారుల నుంచి సరైన స్పందన లేకపోవడంతో ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లపైకి ఎక్కిన ప్రజలు రక్షించాలంటూ కోరుతున్నా ఏమీ చేయలేని స్థితిలో ఎమ్మెల్యే, పలువురు గ్రామస్థులు ఉండిపోయారు.


గన్నవరం రూరల్ మండలం అంబాపురం గ్రామాన్ని వరదనీరు ముంచెత్తింది. ఓ అపార్మెంట్ మెుదటి అంతస్తు వరకూ వరదనీరు చేరిందంటే పరిస్థితే ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. భారీ వరదతో ప్రజలు ఇళ్లపైకి ఎక్కారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు గ్రామానికి చేరుకున్నారు. జేసీబీ పైకి ఎక్కిన ఎమ్మెల్యే.. బాధితులను రక్షించేందుకు అధికారులకు ఫోన్ చేశారు. పడవలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపాలంటూ ఆదేశించారు. ఇవాళ ఉదయం 9గంటల నుంచి ఫోన్ చేస్తున్నా ఇంతవరకూ ఎలాంటి సహాయక బృందం గ్రామానికి రాకపోవడంతో ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు.


మరోవైపు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు జేసీబీపైకి ఎక్కి బాధితుల వద్దకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వరద ఉద్ధృతికి వారి వద్దకు ఆయన వెళ్లలేకపోతున్నారు. తమను రక్షించాలని ఇళ్లపై నుంచి ప్రజలు ఆర్తనాదాలు చేస్తున్నారు. ఓ అపార్ట్మెంట్ మెుదటి అంతస్తు వరకూ నీరు చేరడంతో రక్షించాలంటూ అపార్ట్మెంట్ పైకి ఎక్కిన స్థానికులు కేకలు పెడుతున్నారు. వారి వద్దకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఎమ్మెల్యే జేసీబీలో కూర్చొని ధైర్యం చెబుతున్నారు. వైఎస్ఆర్ రింగ్‌లో ఉన్న చెట్టును పట్టుకుని కాపాడాలంటూ ఓ యువకుడు వేడుకుంటున్నాడు. దూరంలో ఉండి ఏమి చేయలేకపోతున్నామని యార్లగడ్డ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామానికి సహాయక బృందాలు రాకపోవడం, తానూ ఏమీ చేయలేని స్థితిలో ఉండడంతో ఎమ్మెల్యే యార్లగడ్డ మనోవేదనకు గురయ్యారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Rains Effect: విషాదాన్ని మిగులుస్తున్న భారీ వర్షాలు..

Rain Effect: వర్ష ప్రభావిత ప్రాంతాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా..

Rains: ఎన్టీఆర్ జిల్లాను ముంచెత్తిన వరదలు..

Rains: భారీ వర్షాలతో జలాశయాలకు పెరుగుతున్న వరదనీరు..

Updated Date - Sep 01 , 2024 | 12:54 PM