Perni Nani: చంద్రబాబుపై మరోసారి నోరుపారేసుకున్న పేర్నినాని
ABN , Publish Date - Sep 28 , 2024 | 03:59 PM
Andhrapradesh: నిన్నటి వరకు తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసిందని చంద్రబాబు నానా యాగీ చేశారని పేర్నినాని అన్నారు. నిన్నటి రోజున కల్తీ నెయ్యి దానిలో వాడారో తెలియదని అంటున్నారని తెలిపారు. దీనిబట్టి చూస్తుంటే కేవలం జగన్‌ను రాజకీయంగా అంతం చేసేందుకే చంద్రబాబు తిరుపతి లడ్డూపై కలంకితం మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కృష్ణాజిల్లా, సెప్టెంబర్ 28: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై (CM Chandrababu Naidu) మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) (Former Minister Perni Nani) నోరు పారేసుకున్నారు. చంద్రబాబు నోటిని ఆ వెంకటేశ్వర స్వామే శుద్ధి చేస్తున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిపై పాలకుల కలంకిత మాటలను నిరసిస్తూ మచిలీపట్నం బచ్చుపేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పేర్నినాని పాల్గొన్నారు.
Srinivas Varma: అదే వాస్తవం.. టీటీడీ లడ్డూ వివాదంపై కేంద్రమంత్రి
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. నాని హాట్ కామెంట్స్ చేశారు. నిన్నటి వరకు తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసిందని చంద్రబాబు నానా యాగీ చేశారన్నారు. నిన్నటి రోజున కల్తీ నెయ్యి దానిలో వాడారో తెలియదని అంటున్నారని తెలిపారు. దీనిబట్టి చూస్తుంటే కేవలం జగన్‌ను రాజకీయంగా అంతం చేసేందుకే చంద్రబాబు తిరుపతి లడ్డూపై కలంకితం మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం జగన్ తిరుపతి వెళతానంటే కొండపైన ఫ్లెక్సీలు పెట్టిస్తారా..!? అన్యమతస్థులు డిక్లరేషన్ ఇవ్వాలని ఏ నాడైనా తిరుపతి కొండపై ఫ్లెక్సీలు పెట్టారా..!? జగన్ తన పర్యటన వాయిదా వేసుకున్నాడని తెలిసిన వెంటనే ఆ ప్లెక్సీలు తీయించేస్తారా..!? కాషాయం దుస్తులు వేసుకున్న దొంగ భక్తులను జగన్ ఇంటికి పంపి గేట్లకు కాషాయం రంగులు పులుమిస్తారా..!?’’ అంటూ పేర్నినాని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
YS Sharmila: వెంకట్‌రెడ్డి లాంటి తీగలే కాదు.. పెద్ద డొంకలు సైతం కదలాలి
డిక్లరేషన్‌పై జగన్...
కాగా.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుమల పర్యటనను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. అనంతరం ఆయన ప్రెస్మీట్లో చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. శ్రీవారి దర్శనానికి వెళ్లాలంటే డిక్లరేషన్ ఇవ్వాలని తనను డిమాండ్ చేయడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. ‘‘మనం ఎలాంటి దేశంలో నివసిస్తున్నాం? ఆలయంలో ప్రవేశించే వ్యక్తి తన మతమేంటో చెప్పాలా? ఇదేం దేశం.. ఇదేం హిందూయిజం’’ అని మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించారు. ‘‘ఎలాంటి లౌకికవాదంలో, ఎలాంటి లౌకికదేశంలో మనం నివసిస్తున్నాం. ఇదెక్కడి హిందూత్వం.. ఇదేం హిందూయిజం’’ అని ప్రశ్నించారు. నాలుగ్గోడల మధ్య తాను బైబిల్ చదువుతానని స్పష్టం చేశారు.
బయట హిందూ, ముస్లిం మతాలను గౌరవిస్తానని.. పార్శీ, సిక్కు మతాలనూ గౌరవిస్తానని చెప్పారు. తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకుంటానంటే తన మతమేమిటని అడుగుతారా అని మండిపడ్డారు. తన మతం మానవత్వమని.. డిక్లరేషన్‌లో రాసుకోవాలంటూ టీటీడీకి సూచించారు. దేవాలయానికి వెళ్తే మతమేమిటని అడుగుతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడికి వెళ్తే మతమేంటో చెప్పాలనడమే హిందూత్వమా అని ప్రశ్నించారు. తాను ఎప్పటినుంచో వెంకన్న దర్శనానికి వెళ్తున్నానని.. ఏనాడూ కోరని డిక్లరేషన్ ఇప్పుడే ఎందుకు అడుగుతున్నారని అడిగారు. హిందూత్వకు టార్చ్ బేరర్లమని చెప్పుకొనే బీజేపీ.. దేవాలయాలకు వెళ్తే.. మతాన్ని అడుగుతుంటే సమర్థిస్తుందా అని ప్రశ్నించారు. లడ్డూలో కల్తీ నెయ్యి వాడకపోయినా.. వాడినట్లుగా అబద్ధాలు చెబుతుంటే చంద్రబాబును ఆ పార్టీ ఎందుకు నిలదీయడం లేదన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన తనలాంటివాడినే డిక్లరేషన్ అడుగుతుంటే.. సామాన్యులు, ఎస్సీ, ఎస్టీల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి హోదాలో ఐదేళ్లపాటు వెంకన్నకు వస్త్రాలు సమర్పించానన్నారు.
దేవాలయానికి వెళ్తే మత ప్రస్తావనతో అడ్డుకోవడం దేశంలో ఎక్కడా ఉండదని చెప్పారు. తన తిరుమల పర్యటనకు అనుమతి లేదంటూ వైసీపీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, నేతలకు పోలీసులు నోటీసులివ్వడం ఏమిటని మండిపడ్డారు. తిరుమల లడ్డూపై చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనని తేలిపోవడంతో.. దానిని డైవర్ట్ చేయడానికే డిక్లరేషన్ అంశాన్ని తీసుకొచ్చారని చెప్పారు. జంతువుల కొవ్వుతో తిరుమల లడ్డూ తయారుచేశారంటూ ఆయన చెబుతున్నవి అబద్ధాలేనని తాను నిరూపిస్తానన్నారు. టీడీపీ హయాంతోపాటు తన హయాంలోనూ నెయ్యి కొనుగోళ్లలో ఎలాంటి అవకతవకాలూ జరుగలేదని చెప్పారు. ప్రసాదం తయారీ కోసం కొనుగోలు చేసే నెయ్యి నాణ్యతను పరిశీలించేందుకు మూడంచెల పరీక్షలు ఉంటాయన్నారు. కల్తీ ఉంటే.. వెంటనే లారీని వెనక్కు పంపేస్తారని తెలిపారు. జూలైలో వచ్చిన 4 లారీలను వెనక్కి పంపారన్నారు. తిరస్కరించిన నెయ్యిని వాడనప్పుడు.. ప్రసాదంలో జంతువుల కొవ్వు ఎలా కలుస్తుందని ప్రశ్నించారు. నిర్ణీత స్థాయిలో నెయ్యి నాణ్యత లేకపోవడానికి కారణాలను లేబొరేటరీ వెల్లడించిందని అన్నారు.
ఇవి కూడా చదవండి...
Somireddy: అలా చేస్తే భారతమ్మ ఇంట్లోకి రానీయదా.. జగన్‌కు సూటి ప్రశ్న
Srinivas Varma: అదే వాస్తవం.. టీటీడీ లడ్డూ వివాదంపై కేంద్రమంత్రి
Read Latest AP News And Telugu News