Share News

Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద.. 70 గేట్లు ఎత్తివేత

ABN , Publish Date - Aug 08 , 2024 | 11:08 AM

Andhrapradesh: ప్రకాశం బ్యారేజీకి వరద నీటి ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్ట్ గేట్లను ఎత్తివేయడంతో బ్యారేజీకిలో వరద నీరు భారీగా చేరుతోంది. ప్రస్తుతం బ్యారేజీ ‌ 2,88,191 క్యూసెక్కులు గా ఉంది. కాలువలకు ‌13,991 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే వరద నీరు అధికంగా ఉండటంతో బ్యారేజీ 30 గేట్లు ఏడు అడుగుల మేర, 40 గేట్లు ఆరు అడుగుల మేర ఎత్తి ...

Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద.. 70 గేట్లు ఎత్తివేత
Prakasam Barrage Gates Open

విజయవాడ, ఆగస్టు 8: విజయవాడ (Vijayawada) ప్రకాశం బ్యారేజీకి (Prakasam Barrage) వరద నీటి ప్రవాహం క్రమక్రమంగా పెరుగుతోంది. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్ట్ గేట్లను ఎత్తివేయడంతో బ్యారేజీకిలో వరద నీరు భారీగా చేరుతోంది. ప్రస్తుతం బ్యారేజీ ‌ 2,88,191 క్యూసెక్కులుగా ఉంది. కాలువలకు ‌13,991 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే వరద నీరు అధికంగా ఉండటంతో బ్యారేజీ 30 గేట్లు ఏడు అడుగుల మేర, 40 గేట్లు ఆరు అడుగుల మేర ఎత్తి 2,74,200 క్యూసెక్కుల నీటిని అధికారులు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. దిగువ ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు.

Kemburi Rammohan Rao: మాజీ ఎంపీ కెంబూరి రామ్మోహన్ రావు కన్నుమూత


మరోవైపు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం కొంగువారిగూడెం ఎర్రకాల్వ జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోంది. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటిమట్టం 83.50 మీటర్లు కాగా... ప్రస్తుతం 82.30 మీటర్ల నీటిమట్టం చేరుకుంది. ప్రాజెక్ట్‌లోకి ప్రస్తుతం ఆరువేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ నాలుగు గేట్లు ద్వారా 6500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తి నీటి నిల్వ సామర్ధ్యం 4.428 టీఎంసీలుగా ఉంది. అలాగే చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం తమ్మిలేరు రిజర్వాయర్‌లో వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఇన్ ప్లో 5256 క్యూసెక్కులు,అవుట్ ఫ్లో 5688 క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 355 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 349.49 అడుగులకు చేరింది.

Botcha Satyanarayana: పదవులు వస్తుంటాయ్‌.. పోతుంటాయ్‌


అలాగే పూర్తి స్థాయి నిల్వసామర్జ్యం 3 టీఎంసీలకు గాను.. ప్రస్తుత నీటి నిల్వ 2.014 టీఎంసీలుగా కొనసాగుతోంది. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాలకు కొండ వాగులు పొంగిపొర్లుతున్నాయి. కొయ్యలగూడెం మండలం కన్నాపురం వద్ద తూర్పు కాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఆ ప్రాంతంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో అప్రమత్తమైన అధికారులు ఎవరూ కూడా కొండవాగులు దాటే ప్రయత్నం చేయవద్దని సూచనలు చేశారు.


ఇవి కూడా చదవండి..

Viral: గర్ల్ ఫ్రెండ్‌ కోసం.. ఓ టీనేజర్ ఘనకార్యం

Buddhadeb Bhattacharjee: మాజీ సీఎం బుద్దదేవ్ బట్టాచార్య మృతి

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 08 , 2024 | 11:12 AM