Share News

Viral Video: కారు రూఫ్‌పై షాకింగ్ సీన్.. ప్రేమికుల నిర్వాకం చూసి అవాక్కైన వాహనదారులు..

ABN , Publish Date - Aug 08 , 2024 | 10:59 AM

ఇటీవల ప్రేమికుల ప్రవర్తన హద్దులు మీరిపోతోంది. చుట్టూ ఎవరున్నా మాకేం సంబంధం లేదన్నట్లుగా వారి ప్రవర్తన ఉంటోంది. కొందరు పార్కుల్లో పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటే.. మరికొందరు బైకుల్లో ముద్దులు పెట్టుకుంటూ అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి..

Viral Video: కారు రూఫ్‌పై షాకింగ్ సీన్.. ప్రేమికుల నిర్వాకం చూసి అవాక్కైన వాహనదారులు..

ఇటీవల ప్రేమికుల ప్రవర్తన హద్దులు మీరిపోతోంది. చుట్టూ ఎవరున్నా మాకేం సంబంధం లేదన్నట్లుగా వారి ప్రవర్తన ఉంటోంది. కొందరు పార్కుల్లో పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటే.. మరికొందరు బైకుల్లో ముద్దులు పెట్టుకుంటూ అసభ్యకరంగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. రోడ్డుపై కారులో వెళ్తు్న్న ప్రేమికులు.. ఉన్నట్టుండి రూఫ్ నుంచి పైకి లేచి అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈ వీడియో చూసిన వారంతా షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లక్నోలో చోటు చేసుకుంది. ఓ ప్రేమ జంట (lovers) రాత్రి వేళ కారులో వెళ్తుండగా.. షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మార్గ మధ్యలో వారు ఉన్నట్టుండి కారు రూఫ్ నుంచి పైకి లేచి నిలబడ్డారు.

Viral Video: వామ్మో.. ఏనుగు పగబట్టిందా ఏంటీ.. ఊర్లోకి చొరబడి.. ఇళ్లను కూడా పేకమేడల్లా..


అంతటితో ఆగకుండా ఇద్దరూ ఒకనినొకరు కౌగిలించుకుంటూ, ముద్దులు పెట్టుకుంటూ (Lovers misbehave in car) అసభ్యకరంగా ప్రవర్తించారు. ఇలా చాలా దూరం వరకూ వారిద్దరూ సరసాలు ఆడుతూ కనిపించారు. ఈ ఘటనతో వెనుక వస్తున్న వాహనదారులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. కొందరు ఈ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Viral Video: అత్యుత్సాహానికి పోతే ఇలాగే జరుగుతుందేమో.. ఏదో చేయాలని చూస్తే.. చివరకు ఏమైందో చూడండి..


ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ ప్రేమికుల కోసమే కారు రూఫ్ పెట్టినట్లున్నారు’’.. అంటూ కొందరు, ‘‘ఇలాంటి దృశ్యాలను వీడియోలు తీయడం కడా తప్పే’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1600కి పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఇంటి పైకప్పు నుంచి ఎప్పుడూ వినని శబ్ధాలు.. పాములేమో అనుకుని పగులగొట్టి చూడగా..

Updated Date - Aug 08 , 2024 | 12:24 PM