Share News

Viral Video: స్కూటీ మిడిల్ స్టాండ్ వేయాలంటే ఇబ్బందిగా ఉందా.. ఇతడి సింపుల్ ట్రిక్ చూడండి..

ABN , Publish Date - Aug 07 , 2024 | 08:16 AM

వాహనాలను డ్రైవ్ చేసే సమయంలో ఎంత ఎంజాయ్ చేస్తామో.. కొన్నిసార్లు వాటిని పార్క్ చేసే సమయంలో అంత ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్రధానంగా స్టాండ్ వేసే సమయంలో అయితే కొందరు మరీ ఇబ్బంది పడుతుంటారు. అందులోనూ ...

Viral Video: స్కూటీ మిడిల్ స్టాండ్ వేయాలంటే ఇబ్బందిగా ఉందా.. ఇతడి సింపుల్ ట్రిక్ చూడండి..

వాహనాలను డ్రైవ్ చేసే సమయంలో ఎంత ఎంజాయ్ చేస్తామో.. కొన్నిసార్లు వాటిని పార్క్ చేసే సమయంలో అంత ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్రధానంగా స్టాండ్ వేసే సమయంలో అయితే కొందరు మరీ ఇబ్బంది పడుతుంటారు. అందులోనూ మిడిల్ స్టాండ్ వేయడం చాలా కష్టమవుతుంటుంది. అయితే కొందరు ఈ పనిని ఎంతో సులభంగా చేసేస్తుంటారు. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి స్కూటీ మిడిల్ స్టాండ్‌ను ఎంతో సింపుల్‌గా వేశాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా బుల్లెట్ బైకులు (Bullet bikes), స్కూటీలకు (Scooty) మిడిల్ స్టాండ్ వేయడం చాలా కష్టంగా ఉంటుంది. దీంతో చాలా మంది వాహనదారులు.. ఈ వాహనాలకు ఎక్కువగా సైడ్ స్టాండ్‌నే వేస్తుంటారు. అయితే ఓ వ్యక్తి స్కూటీ మిడిల్ స్టాండ్‌ను (Middle stand) ఎంతో సింపుల్‌గా వేసేశాడు.

Viral Video: చూస్తుండగానే మాయమైన రోడ్డు.. దడ పుట్టిస్తున్న 52 సెకన్ల వీడియో..


సైడ్ స్టాండ్‌తో పార్క్ చేసి ఉన్న స్కూటీ వద్దకు వెళ్లిన ఆ వ్యక్తి.. ఆ వాహనాన్ని అలాగే హ్యాండిల్ పట్టుకుని తన పక్కకు వంచేశాడు. అలా వంచిన తర్వాత మిడిల్ స్టాండ్‌ను వేశాడు. ఇలా మిడిల్ స్టాండ్ వేసేందుకు ఇబ్బంది (man put the scooter middle stand easily) పడకుండా ఎంతో సింపుల్‌గా వేసేశాడు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Viral Video: రోడ్డుపై రెయిన్ సాంగ్ చేస్తున్న మహిళ.. వెనుక నుంచి ఉన్నట్టుండి ఊహించని షాక్.. చివరకు..


దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘నేను స్కూటీకి స్టాండ్ వేసే సమయంలో చాలాసార్లు దెబ్బలు తాకించుకున్నాను.. అప్పట్లో ఇంటర్నెట్ ఉండుంటే ఎంత బాగుండేదో’’.., ‘‘స్కూటీకి ఇంత సింపుల్‌గా మిడిల్ స్టాండ్ వేయొచ్చని ఇప్పుడే తెలిసింది’’.., ‘‘ఈ టెక్నిక్‌ను ఎవరికీ చెప్పొద్దు.. రహస్యాంగా దాచుకోండి’’.., ‘‘ఇలా చేస్తే సైడ్ స్టాండ్ త్వరగా పాడవుతుందేమో’’.., ‘‘ఈ టెక్నిక్ అన్ని వాహనాలపై పని చేయదు’’.., ‘‘ఇరుకైన పార్కింగ్ ప్రదేశాల్లో ఇలా చేయడం వీలు కాదు’’.. అంటూ ఇలా కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: ఆకలేసిన ఏనుగు.. మొదటి అంతస్తులోని ఆహారాన్ని ఎలా కొట్టేసిందో చూస్తే..

Updated Date - Aug 07 , 2024 | 08:17 AM