Share News

Viral Video: ఆకలితో ఉన్న మొసళ్లు ఇలాక్కూడా చేస్తాయా.. గూస్‌బమ్స్ తెప్పిస్తున్న వీడియో..

ABN , Publish Date - Aug 04 , 2024 | 02:00 PM

మొసళ్లు చూడటానికి ఎంత భయంకరంగా ఉంటాయో.. వాటి దాడి అంత కంటే భయంకరంగా ఉంటుంది. నీటిలో వాటి కంటపడ్డ జీవులను ఒక్కసారి టార్గెట్ చేశాయంటే ఇక తప్పించుకోవడం అసాధ్యం. అలాంటి మొసళ్లు ఇక తీవ్రమైన ఆకలితో ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో..

Viral Video: ఆకలితో ఉన్న మొసళ్లు ఇలాక్కూడా చేస్తాయా.. గూస్‌బమ్స్ తెప్పిస్తున్న  వీడియో..

మొసళ్లు చూడటానికి ఎంత భయంకరంగా ఉంటాయో.. వాటి దాడి అంత కంటే భయంకరంగా ఉంటుంది. నీటిలో వాటి కంటపడ్డ జీవులను ఒక్కసారి టార్గెట్ చేశాయంటే ఇక తప్పించుకోవడం అసాధ్యం. అలాంటి మొసళ్లు ఇక తీవ్రమైన ఆకలితో ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా, అలాంటి పరిస్థితికి నిదర్శనంగా నిలిచే వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘ఆకలితో ఉన్న మొసళ్లు ఇలాక్కూడా చేస్తాయా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆకలితో ఉన్న ఓ భారీ మొసలి వేట కోసం సంచరిస్తోంది. అయినా దానికి ఏ జంతువూ కనిపించలేట్టుంది. దీంతో చిర్రెత్తుకొచ్చిన మొసలి.. చివరకు మరో మొసలిపై దాడి చేసింది. చివరకు దాన్ని గట్టిగా కొరికి ప్రాణాలు తీసేసింది. చనిపోయిన ఆ మొసలిని నోటితో పట్టుకుని తన స్థావరంలోకి తీసుకెళ్లింది.

Viral: పట్టుకునే క్రమంలో కాటేసింది.. చికిత్స తీసుకుని వచ్చి కోబ్రాను చూడగా.. షాకింగ్ సీన్..


మొసలిని చూసి ముందుగా ఏదో జంతువును వేటాడిందేమో అని అంతా అనుకున్నారు. కానీ తర్వాత దాని నోట్లో మరో మొసలిని చూసి అంతా షాక్ అయ్యారు. అంతా చూస్తుండగానే ఆ భారీ మొసలి చనిపోయిన మొసలిని తీసుకెళ్తోంది. ఈ ఘటన మొత్తం అక్కడే పడవల్లో ఉన్న వారు తమ కెమెరాల్లో బంధించారు.

Viral Video: వీళ్లు పిల్లలు కాదు పిడుగులే.. ఒలిపింక్స్‌‌కు పంపిస్తే.. పతకం గ్యారెంటీ..


ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో ఈ మొసలిని చూస్తుంటేనే భయమేస్తోంది’’.. అంటూ కొందరు, ‘‘ఆకలితో ఉన్న మొసళ్లు ఇలా చేస్తాయా’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 18 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరూ లుక్కేయండి మరి..

Viral Video: అయ్యో.. ఇలా జరిగిందేంటీ.. ఎస్కలేటర్ ఎక్కుతుండగా.. ఈ మహిళల ఇబ్బందులు చూస్తే..

Updated Date - Aug 04 , 2024 | 02:00 PM