Share News

Viral Video: బాబోయ్.. ఓ వైపు హెవీ రైన్.. మరోవైపు గూడ్స్ ట్రైన్.. సీన్ చూస్తే మతిపోవాల్సిందే..!

ABN , Publish Date - Aug 04 , 2024 | 09:08 AM

ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో జనం తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. మరికొన్ని ప్రాంతాల్లో కరువు ప్రాంత వాసులు ఊరటచెందుతున్నారు. రోడ్లపై వరద నీరు చేరుతుండడంతో..

Viral Video: బాబోయ్.. ఓ వైపు హెవీ రైన్.. మరోవైపు గూడ్స్ ట్రైన్.. సీన్ చూస్తే మతిపోవాల్సిందే..!

ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో జనం తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. మరికొన్ని ప్రాంతాల్లో కరువు ప్రాంత వాసులు ఊరటచెందుతున్నారు. రోడ్లపై వరద నీరు చేరుతుండడంతో వాహనదారులు మాత్రం అనేక రకాల ఇబ్బందులు పడుతుండడం చూస్తున్నాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతన్నాయి. అయితే భారీ వర్షంలో దూసుకెళ్తున్న గూడ్స్ రైలు వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. భారీ వర్షాల (Heavy rains) కారణంగా రోడ్లతో పాటూ రైల్వే ట్రాక్స్ కూడా వరద నీటిలో మునిగిపోయాయి. అయితే ఈ సందర్భంగా ఓ రైల్వే స్టేషన్‌లో చోటు చేసుకున్న ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రైల్వే స్టేషన్‌ను వరద నీరు ముంచెత్తింది. దీంతో ట్రాకులన్నీ నీటిలో మునిగిపోయాయి.

Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న అతి పెద్ద తప్పును పసిగట్టగలరేమో ప్రయత్నించండి..


ప్లాట్‌ఫామ్‌పై ప్రయాణికులంతా వరద నీటిని చూస్తూ అవాక్కవుతున్నారు. ఇంతలో ఓ గూడ్స్ రైలు (train running in flood water) అటుగా దూసుకొచ్చింది. రావడం కూడా అత్యంత వేగంగా దూసుకురావడంతో ట్రాక్స్‌పై ఉన్న వరద నీళ్లన్నీ ఎగిరి ప్లాట్‌ఫామ్‌పై పడుతున్నాయి. ఈ సీన్ చూస్తే రైలు ఏ సముద్రంలో దూసుకెళ్తుందో అని అనిపిస్తోంది. ఈ సీన్ చూసి అక్కడున్న ప్రయాణికులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. రైలు స్టేషన్‌లోకి రావడంతో అక్కడున్న గార్డ్ కూడా జెండా ఊపి ట్రైన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు.

Viral Video: కళ్ల ముందు జరగబోయే పెద్ద ప్రమాదాన్ని.. ఈ యువతి ఎలా ఆపిందో చూడండి..


చూస్తుండగానే ఆ రైలు వరద నీటిలో స్పీడ్ బోట్ తరహాలో దూసుకెళ్లింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘రైలు పట్టాలపై నడుస్తోందా.. లేక నీళ్లపై తేలియాడుతోందా’’.. అంటూ కొందరు, ‘‘పట్టాల కింద మట్టి జారిపోతే ప్రమాదం జరుగుతుంది.. ఈ కారణంగా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: బైకుపై మధ్యలో కూర్చున్న ప్రేమికులు.. సైలెంట్‌గా చేసిన పని చూసి అవాక్కవుతున్న నెటిజన్లు..

Updated Date - Aug 04 , 2024 | 09:08 AM