Share News

Viral Video: రైలు దిగడం కూడా సాహసమే.. ఇతడి పరిస్థితి చూస్తే.. షాకవ్వాల్సిందే..

ABN , Publish Date - Aug 06 , 2024 | 11:48 AM

సాధారణంగా రైలు ప్రయాణం అంటేనే రద్దీ జనం మధ్య సాహసం చేయాల్సిన పరిస్థితి. అలాంటిది ముంబై వంటి రైలు ప్రాంతాల్లో రైలు ప్రయాణం అంటే.. దినదినగండం అనే చెప్పొచ్చు. తాజాగా, ఇందుకు నిదర్శనంగా నిలిచే వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.

Viral Video: రైలు దిగడం కూడా సాహసమే.. ఇతడి పరిస్థితి చూస్తే.. షాకవ్వాల్సిందే..

రైలు ప్రయాణ సమయాల్లో చాలా మంది వివిధ రకాల సాహసాలు చేస్తుంటారు. కొందరు రన్నింగ్ రైళ్లను ఎక్కే క్రమంలో ప్రమాదమని తెలిసినా ప్రమాదకర సాహసాలు చేస్తుంటారు. మరికొందరికి రైలు ఎక్కే సమయంలోనే కాకుండా దిగే సమయంలోనూ అనేక షాకింగ్ అనుభవాలు ఎదురవుతుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తికి రైలు దిగడం పెద్ద పరీక్షగా మారింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా రైలు ప్రయాణం అంటేనే రద్దీ జనం మధ్య సాహసం చేయాల్సిన పరిస్థితి. అలాంటిది ముంబై (Mumbai) వంటి రైలు ప్రాంతాల్లో రైలు ప్రయాణం అంటే.. దినదినగండం అనే చెప్పొచ్చు. కిక్కిరిసిన జనంతో వెళ్లే లోకల్ ట్రైన్స్‌లో (Local trains) నిత్యం ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంటుంది. ఇక్కడి రైళ్లను ఎక్కడమే కాదు.. దిగడం కూడా ఒక సాహసం అనే చెప్పాలి.

Viral Video: తల్లీబిడ్డను రైలు ఎక్కించాలని చూడగా ఊహించని షాక్.. చివరకు యువకుడు చేసిన పనేంటో మీరే చూడండి..


తాజాగా, ఇందుకు నిదర్శనంగా నిలిచే వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ముంబై లోకల్ రైలు కిక్కిరిసిన ప్రయాణికులతో వెళ్తోంది. ఈ క్రమంలో ఓ స్టేషన్‌లో ఆగగానే.. ఓ వైపు ఎక్కేవారు, దిగి వారితో అక్కడ ఉన్నట్టుండి తోపులాట చోటు చేసుకుంది. అంతటి తోపులాట మధ్య ఓ వ్యక్తి.. రైలు దిగేందుకు పెద్ద సాహసం చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. రైలు ఆగగానే ప్రయాణికులంతా ఒకేసారి రైలు ఎక్కేందుకు ప్రయత్నించారు. దీంతో ఆ వ్యక్తి రైలు దిగేందుకు వారి తోయాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పటికీ దారి ఇవ్వకపోవడంతో తన శక్తిని మొత్తం ఉపయోగించి వారిని చేత్తో బలంగా కొట్టాల్సి వచ్చింది.

Viral Video: రోడ్డుపై రెయిన్ సాంగ్ చేస్తున్న మహిళ.. వెనుక నుంచి ఉన్నట్టుండి ఊహించని షాక్.. చివరకు..


ఇలా చివరకు ఎలాగోలా రైల్లోంచి బయటపడ్డ అతను చివరకు ధబేల్‌మని కిందపడ్డాడు. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో.. రైలు దిగాలంటే యుద్ధం చేయాలేమో’’.. అంటూ కొందరు, ‘‘ముంబై లోకల్ ట్రైన్స్‌లో ఇలాంటి సహసాలు చాలా సాధారణం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 9లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: వంటింట్లో భర్తకు షాక్ ఇచ్చిన భార్య.. ఇలాంటి టాలెంట్ ఈమెకు మాత్రమే సాధ్యమేమో..

Updated Date - Aug 06 , 2024 | 11:48 AM