Share News

Viral Video: తల్లీబిడ్డను రైలు ఎక్కించాలని చూడగా ఊహించని షాక్.. చివరకు యువకుడు చేసిన పనేంటో మీరే చూడండి..

ABN , Publish Date - Aug 06 , 2024 | 11:11 AM

రైల్వే స్టేషన్‌లో ఓ మహిళ తన పిల్లలను తీసుకుని రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తుంది. అయితే అప్పటికే రైలు కదులుతుండడంతో ఎక్కడానికి సాధ్యం కాదు. అదే సమయంలో అక్కడ ఉన్న ఓ యువకుడు ఆమెకు సాయం చేయడానికి ముందుకు వస్తాడు. అయితే చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Viral Video: తల్లీబిడ్డను రైలు ఎక్కించాలని చూడగా ఊహించని షాక్.. చివరకు యువకుడు చేసిన పనేంటో మీరే చూడండి..

రైలు ప్రయాణ సమయాల్లో తెలిసి కొందరు, తెలీక మరికొందరు చివరకు ఊహించని ప్రమాదాల్లో చిక్కుకుంటుంటారు. చాలా మంది రైలు ఎక్కి, దిగే సమయంలోనే ఇలాంటి ప్రమాదాలకు గురవుతుంటారు. ఈ తరహా ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ యువకుడు తల్లీబిడ్డను రైలు ఎక్కించాలని చూడగా.. షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రైల్వే స్టేషన్‌లో (Railway station) ఓ మహిళ తన పిల్లలను తీసుకుని రైలు (woman tried to board the train) ఎక్కేందుకు ప్రయత్నిస్తుంది. అయితే అప్పటికే రైలు కదులుతుండడంతో ఎక్కడానికి సాధ్యం కాదు. అదే సమయంలో అక్కడే ఉన్న ఓ యువకుడు ముందుగా బాలికను రైలు ఎక్కిస్తాడు. ఆ తర్వాత తల్లీబిడ్డను రైలు రైలు ఎక్కించాలని చూస్తాడు.

Viral Video: రోడ్డుపై రెయిన్ సాంగ్ చేస్తున్న మహిళ.. వెనుక నుంచి ఉన్నట్టుండి ఊహించని షాక్.. చివరకు..


అయితే అదే సమయంలో మరో మహిళ రైలు ఎక్కేందుకు అక్కడికి పరుగెత్తుకుంటూ వస్తుంది. దీంతో ఆమెను కూడా రైలు ఎక్కించేందుకు ప్రయత్నిస్తాడు. అయితే ఆ సమయంలో ఆమె అదుపు తప్పి కిందపడుతుంది. చివరకు ఆమెను రైలు కింద పడకుండా పక్కకు లాగి, పరుగెత్తుకుంటూ వెళ్లి రైలు ఎక్కేస్తాడు. చైన్ లాగడంతో (man pulling a train chain) కాసేపటికి రైలు ఆగిపోతుంది. ఇలా చివరకు తల్లీపిల్లలను సురక్షితంగా రైలు ఎక్కిస్తారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Viral Video: వంటింట్లో భర్తకు షాక్ ఇచ్చిన భార్య.. ఇలాంటి టాలెంట్ ఈమెకు మాత్రమే సాధ్యమేమో..


ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అతను రైలు ఎక్కించాలని చూడడంతోనే ఆమె కింద పడింది’’.., ‘‘ఇతడి మీద హత్యాయత్నం కేసులు నమోదు చేయాలి’’.., ‘‘మరో రైలుకు పోయినా ఏం కాదు.. ప్రాణాలు ఎంతో విలువైనవి’’.., ‘‘ఇలాంటి కంగారుతోనే ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు’’.., ‘‘ఇందుకేనేమో.. ఇండియన్ రైళ్లు ఎప్పుడూ ఆలస్యంగా వస్తుంటాయి’’.. అంటూ ఇలా కొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు వివిధ రకాల ఎమోజీలతో కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 29వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: చూస్తుండగానే మాయమైన రోడ్డు.. దడ పుట్టిస్తున్న 52 సెకన్ల వీడియో..

Updated Date - Aug 06 , 2024 | 11:11 AM