Share News

AP HighCourt: పిన్నెల్లి బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా

ABN , Publish Date - Aug 05 , 2024 | 03:31 PM

Andhrapradesh: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది. పిన్నెల్లి బెయిల్ పిటిషన్లపై ఈరోజు హైకోర్టులో విచారణకు రాగా.. పిటిషన్‌ను ధర్మాసనం వాయిదా వేసింది. పల్నాడు పోలీసులు నమోదు చేసిన రెండు కోసుల్లోనూ బెయిల్ ఇవ్వాలంటూ పిన్నెల్లి పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్లపై విచారణను హైకోర్టు ధర్మాసనం వచ్చే వారినికి వాయిదా వేసింది.

AP HighCourt: పిన్నెల్లి బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా
Former MLA Pinnelli Ramakrishnareddy

అమరావతి, ఆగస్టు 5: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి (Former MLA Pinnelli Ramakrishna Reddy) హైకోర్టులో (AP HighCourt) మరోసారి చుక్కెదురైంది. పిన్నెల్లి బెయిల్ పిటిషన్లపై ఈరోజు హైకోర్టులో విచారణకు రాగా.. పిటిషన్‌ను ధర్మాసనం వాయిదా వేసింది. పల్నాడు పోలీసులు నమోదు చేసిన రెండు కోసుల్లోనూ బెయిల్ ఇవ్వాలంటూ పిన్నెల్లి పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్లపై విచారణను హైకోర్టు ధర్మాసనం వచ్చే వారినికి వాయిదా వేసింది. దీంతో బెయిల్‌ కోసం ఎంతగానో ఎదురుచూసిన పిన్నెల్లికి మరోసారి నిరాశే ఎదురైంది.

Sheikh Hasina Resigns: బంగ్లాదేశ్ ప్రధానమంత్రి రాజీనామా!.. దేశం విడిచి వెళ్లిపోయిన షేక్ హసీనా


ఇదీ విషయం...

ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈవీఎం పగలగొట్టిన కేసులో అరెస్ట్ అయిన పిన్నెల్లి ప్రస్తుతం నెల్లూరు జైలులో ఉన్నారు. ఎన్నికల సందర్భంగా మే 13న పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎం, వీవీప్యాట్‌ ధ్వంసం చేసిన వ్యవహారంలో పల్నాడు జిల్లా రెంటచింతల పోలీసులు పిన్నెల్లిపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఆ ధ్వంసాన్ని అడ్డుకున్న టీడీపీ ఏజెంట్‌ శేషగిరిరావుపై ఆయన దాడి చేసి, హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి రెంటచింతల పోలీసులు పిన్నెల్లి, ఆయన అనుచరులు మరో 15 మందిపై హత్యాయత్నం (ఐపీసీ 307), మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అదేరోజు నాగశిరోమణి అనే మహిళను ఆయన బూతులు తిట్టారు. ఆమె ఫిర్యాదుతో పలు సెక్షన్ల కింద పిన్నెల్లిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Stock market: స్టాక్ మార్కెట్‌ క్రాష్.. రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేటును ముందుగానే తగ్గిస్తుందా..?


ఇక మే 14న పిన్నెల్లి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి, వారి అనుచరులు సీఐ నారాయణ స్వామిపై దాడి చేసి గాయపరిచారు. దీనిపై హత్యాయత్నం, మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులన్నిటిలో తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అరెస్ట్ నుంచి ఉపశమనం కల్పించాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్లను ఏపీ హైకోర్టు తోసిపుచ్చడంతో జూన్ 26న పోలీసులు పిన్నెల్లిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. పిన్నెల్లిపై మొత్తం 14 కేసులు నమోదయ్యాయి. ఇందులో మూడు హత్యాయత్నం కేసులున్నాయి. రెంటచింతల మండలం పాల్వాయి గేట్ గ్రామంలో ఈవీఎం ధ్వంసం ఘటన ప్రధానంగా ఉంది. అలాగే పిన్నెల్లి బెయిల్‌ పిటిషన్లను గుంటూరు జిల్లా కోర్టు రెండు సార్లు కొట్టివేసిన విషయం తెలిసిందే.


ఇవి కూడా చదవండి...

SupremeCourt: స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ మరోసారి వాయిదా

AP News: ప్రభుత్వ ఉద్యోగులకు ఉండే రూల్స్... మాకు ఇవ్వాల్సిందే..

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 05 , 2024 | 03:38 PM