Share News

Nagababu: జగన్ వ్యాఖ్యలపై స్ట్రాంగ్ కౌంటర్

ABN , Publish Date - Jul 20 , 2024 | 01:06 PM

Andhrapradesh: రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు జనసేన నేత కొణిదల నాగబాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. శనివారం నాడు జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ వీడియో విడుదల చేశారు. జగన్ శవ రాజకీయాలు మానుకో అని హితవుపలికారు. రషీద్ హత్యకు రాజకీయాలతో సంబంధం లేదన్నారు.

Nagababu: జగన్ వ్యాఖ్యలపై స్ట్రాంగ్ కౌంటర్
Janasena Leader Nagababu

అమరావతి, జూలై 20: రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (Former CM Jaganamohan Reddy) చేసిన వ్యాఖ్యలకు జనసేన నేత కొణిదల నాగబాబు(Nagababu) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. శనివారం నాడు జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ వీడియో విడుదల చేశారు. జగన్ శవ రాజకీయాలు మానుకో అని హితవుపలికారు. రషీద్ హత్యకు రాజకీయాలతో సంబంధం లేదన్నారు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవలో అతను హత్య చేయబడ్డాడని తెలిపారు.

Telangana: ఢిల్లీకి సీఎం రేవంత్.. ప్రధాన అజెండా అదే..!


ఈ హత్యను జనసేన పక్షాన తాము ఖండిస్తున్నామన్నారు. జగన్ పాలనలో ఎన్నో దారుణాలు చేశారని గుర్తుచేశారు. ప్రభుత్వ లోపాలను ‌ప్రశ్నిస్తే కొట్టారని... ప్రతిపక్ష నేతల గొంతెత్తితే కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమాయకులైన ప్రాణాలను బలి తీసుకున్నారన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలపై పెట్టిన కేసులకు‌ హద్దే లేదన్నారు. పోలీసు వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని విమర్శించారు. ఐపీఎస్‌లను ‌వైసీపీ నాయకులుగా మార్చి ‌పని చేయించారని వ్యాఖ్యలు చేశారు.

Delhi Liquor Scam: 10 కిలోల బరువు తగ్గిన కవిత ?.. భర్త అనిల్ కంటతడి!


‘‘మీ దందాలకు అమాయకులైన అధికారులు బలి అయ్యారు’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలు నోరెత్తాలంటే భయపడి పోయారన్నారు. ‘‘మీరు ఇప్పుడు నీతులు వల్లిస్తున్నారు’’ అంటూ ఎద్దేవా చేశారు. వ్యక్తుల మధ్య గొడవతో జరిగిన హత్యను రాజకీయంగా వాడుకోవాలని‌ చూస్తున్నారన్నారు. ‘‘ప్రజలు మీకు బుద్ధి చెప్పినా...‌ ఇంకా మీ బుద్ధి మార్చుకోవడం లేదు’’ అంటూ నాగబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.


జగన్ ఏమన్నారంటే..

వినుకొండలో హత్యకు గురై రషీద్ కుటుంబసభ్యులను నిన్న(శుక్రవారం) మాజీ ముఖ్యమంత్రి జగన్ పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జగన్... రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై ఢిల్లీలో 24న వైసీపీ ధర్నా చేస్తుందని ప్రకటించారు. రాష్ట్రంలో లా-అండ్‌-ఆర్డర్‌ లేదనడానికి వినుకొండలో రషీద్‌ హత్యే నిదర్శనమంటూ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసిన చంద్రబాబు పథకాలు ఇవ్వకుండా ప్రజలను మోసం చేస్తున్నారని జగన్ విమర్శించారు.


ఇవి కూడా చదవండి...

Ketireddy Peddareddy: పోలీస్‌స్టేషన్‌కు పెద్దారెడ్డి.. తాడిపత్రిలో హైటెన్షన్

TTD EO: తిరుమల ప్రక్షాళానికి శ్రీకారం...

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 20 , 2024 | 01:19 PM