Kesineni Chinni: సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఇంద్రకీలాద్రిపై దేవాదాయశాఖ సమగ్రమైన ఏర్పాట్లు చేసింది
ABN , Publish Date - Oct 04 , 2024 | 10:24 AM
ఇంద్రకీలాద్రిపై ఇవాళ(శుక్రవారం) శ్రీ గాయత్రి దేవిగా అమ్మవారు దర్శనమిచ్చారు. ఈరోజు అమ్మవారిని విజయవాడ ఎంపీ కేశినేని శినవాథ్ (చిన్ని) దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాల సందర్భంగా పోలీసులు కొండపై ఆంక్షలు విధించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు, పోలీసులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు.
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ఇవాళ(శుక్రవారం) శ్రీ గాయత్రి దేవిగా అమ్మవారు దర్శనమిచ్చారు. ఈరోజు అమ్మవారిని విజయవాడ ఎంపీ కేశినేని శినవాథ్ (చిన్ని) దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాల సందర్భంగా పోలీసులు కొండపై ఆంక్షలు విధించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ అధికారులు, పోలీసులు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. అమ్మవారిని దర్శించుకోడానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. దీంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. కొండపై నుంచి వచ్చే వాహనాలతో ట్రాఫిక్ జాం నెలకొంది. దీంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్భంగా కేశినేని శినవాథ్ మీడియాతో మాట్లాడుతూ...దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా దుర్గమ్మను దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.
అమ్మవారి ఆశీస్సులతో తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ సుఖ సంతోషాలతో, సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్లు చెప్పారు. ఎంపీగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా జరుగుతున్న ఈ దసరా ఉత్సవాలు ఎంతో ప్రత్యేకమైనవని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. సామాన్య భక్తులందరికీ అమ్మవారి దర్శనం కలిగే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు, సూచనలతో దేవాదాయశాఖ సమగ్రమైన ఏర్పాట్లు చేసిందని చెప్పారు. వీఐపీల కోసం ప్రత్యేకమైన యాప్‌ని క్రియేట్ చేశామని అన్నారు. ఈ యాప్ ద్వారా వీఐపీలు దర్శించుకునే విధంగా టైం స్లాట్‌ని ఏర్పాటు చేశామని వివరించారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేసే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడించారు.
రెండో రోజుకి చేరిన దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు
విజయవాడ: విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ఇవాళ(శుక్రవారం) శ్రీ గాయత్రి దేవిగా అమ్మవారు దర్శనమిచ్చారు. రెండో రోజుకి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు చేరుకున్నాయి. ఉదయం నాలుగు గంటల నుంచి భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు. పంచ ముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావందన దేవత గాయత్రీదేవిగా అమ్మవారు ఉన్నారు. శిరస్సు యందు బ్రహ్మ, హృదయమందు విష్ణువు, శిఖ యందు రుద్రుడు నివసిస్తుండగా త్రికూర్త్యాంశంగా ఉన్న గాయత్రీ దేవిని భక్తులు దర్శించుకుంటున్నారు.
ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ఇవాళ(శుక్రవారం) శ్రీ గాయత్రి దేవిగా అమ్మవారు దర్శనమిచ్చారు. గాయత్రి దేవిని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అందరికి దసరా శుభాకాంక్షలు తెలిపారు. దసరా ఏర్పాట్లు బావున్నాయని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు.
కనకదుర్గమ్మకు తెలుగుదేశం ఎంపీ గంటి హరీష్ మాథుర్ విశేష పూజలు
విజయవాడ: దసరా శరన్నవరాత్రుల్లో అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అమలాపురం తెలుగుదేశం ఎంపీ గంటి హరీష్ మాథుర్ తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి దసరా వేడుకలు తమ చేతుల మీదుగా జరగడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. భక్తులకు పెద్దపీట వేసే ఉద్దేశంతో కొన్ని విషయాల్లో కఠినమైన నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. వరదల్లో ఇబ్బంది పడ్డ వారందరికీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అండగా నిలిచిందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నామని ఎంపీ హరీష్ మాధుర్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గాయత్రీ దేవి అలంకారంలో కనకదుర్గ అమ్మవారు..
భద్రాచలంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News