Kollu Ravindra: వైసీపీలో వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదు... మంత్రి కొల్లు రవీంద్ర వార్నింగ్
ABN , Publish Date - Nov 25 , 2024 | 03:52 PM
ఇది కలియుగం... కర్మ ఫలం ఎవరినీ వదలదని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. ఈ జన్మలో చేసిన పాపాలకు కర్మ ఫలం ఈ రోజుల్లోనే అనుభవించే రోజులు వచ్చాయని హెచ్చరించారు.
కృష్ణాజిల్లా, (మచిలీపట్నం) : జగన్ ప్రభుత్వం అమరావతిని పూర్తిగా నిర్వీర్యం చేసిందని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన అన్ని రంగాలను అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.జగన్ సర్కార్ స్వార్ధపూరిత రాజకీయాలతో పోలవరం ప్రాజెక్ట్ గత ఐదేళ్లలో చాలా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలు విజయవంతంగా జరిగాయని అన్నారు. అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరైన మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్‌రెడ్డి చట్టసభలను, రాజ్యాంగాన్ని అవమానించారని అన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో అసెంబ్లీలో తాము జవాబుదారీతనంగా వ్యవహరించామని అన్నారు. ప్రభుత్వ విధి విధానాలను అసెంబ్లీ వేదికగా ప్రజలకు తెలియజేవామని చెప్పారు. రూ.2.97కోట్ల రాష్ట్ర బడ్జెట్‌ని ప్రవేశ పెట్టామని చెప్పుకొచ్చారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా సంస్థలు వస్తున్నాయని తెలిపారు. మానవవనరులను సక్రమంగా వినియోగించగల వ్యక్తి చంద్రబాబు అని కొనియాడారు.
కృష్ణాజిల్లా అభివృద్ధికి ఎమ్మెల్యేలు అందరితో కలిసి ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ఆగిపోయిన బందరు పోర్టు, ఫిషింగ్ హార్బర్ పనులను వేగవంతం చేస్తున్నామని చెప్పారు. ఇది కలియుగం... కర్మ ఫలం ఎవరినీ వదలదని హెచ్చరించారు. ఈ జన్మలో చేసిన పాపాలకు కర్మ ఫలం ఈ రోజుల్లోనే అనుభవించే రోజులు వచ్చాయన్నారు. వారు చేసిన పాపాలే వారికి శాపాలుగా తగులుతున్నాయని చెప్పారు. తమను జైళ్లలో పెట్టించి శునకానందం పొందారని మండిపడ్డారు. ప్రజాతీర్పుతోపాటు చట్టం కూడా తనపై తాను చేసుకుంటుందని అన్నారు. కారుకూతలు కూసే వారిని వదిలేది లేదని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి
CM Chandrababu: ఏపీ విద్యుత్ శాఖకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
AP NEWS:అదానీ స్కాంలో.. జగన్‌పై గోనే ప్రకాశరావు సంచలన ఆరోపణలు
AP NEWS: చెవిరెడ్డి నువ్వో చీటర్...బాలినేని సంచలన కామెంట్స్
Read Latest AP News and Telugu News