AP Ministers: ఢిల్లీ పర్యటనలో ఏపీ మంత్రులు.. షెడ్యూల్ ఇదే
ABN , Publish Date - Oct 21 , 2024 | 12:14 PM
Andhrapradesh: ఢిల్లీలో మంత్రి లోకేష్ బిజీగా ఉన్నారు. ఈరోజు (సోమవారం) ఎలక్ట్రానిక్స్ రంగంలో అగ్ర సంస్థలతో మంత్రి లోకేష్ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు అగ్ర సంస్థలకు వివరించి వారిని రాష్ట్రానికి ఆహ్వానించనున్నారు. అలాగే పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉంది.
న్యూఢిల్లీ, అక్టోబర్ 21: దేశ రాజధాని ఢిల్లీ పర్యటనలో ఏపీ మంత్రులు నారా లోకేష్ (Minister Nara lokesh), సత్య కుమార్ (Minister Satyakumar) బిజీబిజీగా గడుపుతున్నారు. ఈరోజు (సోమవారం) ఎలక్ట్రానిక్స్ రంగంలో అగ్ర సంస్థలతో మంత్రి లోకేష్ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను అగ్ర సంస్థలకు వివరించి వారిని రాష్ట్రానికి ఆహ్వానించనున్నారు. అలాగే పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం ఉంది. నిన్న (ఆదివారం) రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను లోకేష్ కలిసిన విషయం తెలిసిందే. దాదాపు 40 నిమిషాల పాటు అనేక అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో చేపట్టిన కార్యక్రమాలను అమిత్ షాకు వివరించి... రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తున్నందుకు కేంద్రమంత్రికి మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలియజేశారు.
పచ్చి నెత్తురు తాగే రాక్షసుడివి!
తొలిసారి అమిత్‌షాతో భేటీ
ఇటు ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ కూడా ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం 12:30 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను సత్యకుమార్ కలువనున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు, మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి అమిత్ షాతో మంత్రి భేటీ అవుతున్నారు. మూడు నెలల పాలన, చేపట్టిన కార్యక్రమాలు, అంతర్గతంగా ఉన్న వ్యవహారాలు, మూడు పార్టీల మధ్య సమన్వయం, కేంద్ర పథకాల అమలు వంటి అంశాలపై కేంద్ర హోంమంత్రికి సత్యకుమార్ నివేదిక ఇవ్వనున్నారు. అనంతరం పలువురు కేంద్ర మంత్రులు, పార్టీ నేతలతో విడివిడిగా భేటీ కానున్నారు.
Train Accident: చిమిడిపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో ఘోర రైలు ప్రమాదం..
కాగా.. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను ఢిల్లీలోని ఆయన నివాసంలో ఆదివారం మంత్రి నారా లోకేశ్ కలిశారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలో భాగంగా పలువురు ప్రముఖ పారిశ్రామికవేత్తలతో సమావేశాల కోసం లోకేష్ ఢిల్లీలో ఉన్నారు. హోంమంత్రి అపాయింట్‌మెంట్ దొరకడంతో.. అమిత్‌షాతో లోకేష్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధిని, అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలో మరింత కేంద్రం సాయం అందించాలని కోరారు. లోకేష్ ప్రతిపాదనకు అమిత్‌షా సానుకూలంగా స్పందించారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌ను ఆర్థికంగా కీలకస్థానంలో నిలబెట్టేందుకు అమిత్‌షా అందిస్తున్న సహకారం, రాష్ట్రం పట్ల ఆయన శ్రద్ధ గొప్పవి’’ అంటూ భేటీ అనంతరం లోకేష్ ట్వీట్ చేస్తూ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఇవి కూడా చదవండి...
Hyundai: హ్యుందాయ్ మోటార్ రికార్డ్ ఐపీవో.. స్టాక్ మార్కెట్లో ఓపెనింగ్ కోసం ఎదురుచూపులు
Pawankalyan: అమరులైన పోలీసులకు మనస్ఫూర్తిగా అంజలి ఘటిస్తున్నా
Read Latest AP News And Telugu News