Share News

Savita: ఎసెన్షియా పాపం ముమ్మాటికీ జగన్ దే

ABN , Publish Date - Aug 23 , 2024 | 03:52 PM

Andhrapradesh: జగన్... నీరో చక్రవర్తిలా ఇంట్లో కూర్చుని పబ్జీ గేమ్‌లు ఆడుతూ ఐదేళ్లు నెట్టుకొచ్చేశారిన రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి సవిత వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రాన్ని, వ్యవస్థలను విధ్వంసం చేసిన ఘనత జగన్ దే అని అన్నారు. గత ఏడాది ఇచ్చిన థర్డ్ పార్టీ నివేదిక అమలు చేయకపోవడం వల్లే...

Savita: ఎసెన్షియా పాపం ముమ్మాటికీ జగన్ దే
Minister Savita

అమరావతి, ఆగస్టు 23: జగన్... నీరో చక్రవర్తిలా ఇంట్లో కూర్చుని పబ్జీ గేమ్‌లు ఆడుతూ ఐదేళ్లు నెట్టుకొచ్చేశారిన రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి సవిత (Minister Savita) వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రాన్ని, వ్యవస్థలను విధ్వంసం చేసిన ఘనత జగన్ దే అని అన్నారు. గత ఏడాది ఇచ్చిన థర్డ్ పార్టీ నివేదిక అమలు చేయకపోవడం వల్లే అచ్యుతాపురంలోని ఎసెన్షియా ఘటనకు కారణమని అన్నారు.

Pinnelli: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి బెయిల్


శవ రాజకీయాలు చేస్తున్న జగన్ ఇకనైనా వాటిని మానుకోవాలని హితవుపలికారు. ఎసెన్షియా పాపం ముమ్మాటికీ జగన్ దే అని మంత్రి అన్నారు. తమ నాయకుడు చంద్రబాబు వెంటనే స్పందించారని.. ఆగమేఘాల మీద మృతుల కుటుంబాలకు కోటి చొప్పున నష్టపరిహారం అందించారని తెలిపారు. క్షతగాత్రులను, మృతుల కుటుంబాలను కలిసి చంద్రబాబు భరోసా ఇచ్చారన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించడమే కాకుండా నష్టపరిహారం కూడా అందిస్తున్నామని మంత్రి సవిత పేర్కొన్నారు.

CM Revanth: ఏఐసీసీ అగ్రనేతలతో సీఎం రేవంత్ భేటీ.. టీపీసీసీ ఎవరో మరి?


విమర్శలు సిగ్గుచేటు: కొల్లు రవీంద్ర

అచ్యుతాపురం ఘటనను ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాజకీయం చేస్తున్నారని రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర(Minister Kollu Ravindra) మండిపడ్డారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్లి రాజకీయాలు మాట్లాడడం సరికాదన్నారు. బాధితులను ఓదార్చాల్సింది పోయి రాజకీయ విమర్శలకు జగన్ దిగటం సిగ్గుచేటని మంత్రి రవీంద్ర ఆగ్రహించారు. అచ్యుతాపురం ఘటనపై కూటమి ప్రభుత్వం ఘటనపై సరిగా స్పందించలేదంటూ వైసీపీ అధినేత చేసిన వ్యాఖ్యలను మంత్రి కొల్లు రవీంద్ర ఖండించారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే హోంమంత్రి అనిత, సీఎం చంద్రబాబు, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ స్పందించారని తెలిపారు. ఘటనా స్థలానికి అధికారులు వెళ్లాల్సిందిగా.. బాధితులకు సరైన వైద్యం అందించి అక్కడి పరిస్థితులపై పర్యవేక్షించాలంటూ అధికారులను అప్రమత్తం చేసినట్లు మంత్రి రవీంద్ర చెప్పుకొచ్చారు. తీవ్ర వేదనలో ఉన్న బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పాల్సిన చోట వైఎస్ జగన్ రాజకీయాలు మాట్లాడడం ఆశ్చర్యం కలిగించిందని మంత్రి కొల్లురవీంద్ర అన్నారు.

Updated Date - Aug 23 , 2024 | 04:02 PM