Share News

AP News: ఆగని అక్రమ రేషన్ తరలింపు.. తాజాగా

ABN , Publish Date - Jul 03 , 2024 | 09:32 AM

Andhrapradesh: నిరు పేదలకు అందించాల్సిన రేషన్ బియ్యాన్ని కొందరు అక్రమార్కులు తమ స్వలాభాలకు ఉపయోగించుకుంటున్నారు. అనేక విధాలుగా రేషన్ అక్రమ రవాణాలకు అధికారులు అడ్డుకట్ట వేస్తున్నప్పటికీ ఎక్కడో చోట బియ్యం అక్రమ తరలింపులు కొనసాగుతూనే ఉన్నాయి.

AP News: ఆగని అక్రమ రేషన్ తరలింపు.. తాజాగా
Control rice

ఎన్టీఆర్ జిల్లా, జూలై 3: నిరు పేదలకు అందించాల్సిన రేషన్ బియ్యాన్ని కొందరు అక్రమార్కులు తమ స్వలాభాలకు ఉపయోగించుకుంటున్నారు. అనేక విధాలుగా రేషన్ అక్రమ రవాణాలకు అధికారులు అడ్డుకట్ట వేస్తున్నప్పటికీ ఎక్కడో చోట బియ్యం అక్రమ తరలింపులు కొనసాగుతూనే ఉన్నాయి. బియ్యం అక్రమ తరలింపును ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని తగు చర్యలు చేసినప్పటికీ అక్రమార్కుల ఆగడాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఎన్టీఆర్‌ జిల్లాలో ఓ రైస్‌మిల్‌లో భారీగా నిల్వ ఉంచి రేషన్ బియ్యం విజిలెన్స్ అధికారులకు చిక్కింది.

Floods: వరదల ఎఫెక్ట్.. 38కి చేరిన మృతులు


ఇదీ విషయం..

ఎన్టీఆర్ జిల్లాలోని (NTR District)తిరువూరు రాజుపేట సముద్రాల హరి రైస్ మిల్లులో గత అర్ధరాత్రి విజిలెన్స్ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో లారీల్లో తరలించటానికి సిద్ధంగా ఉన్న సుమారు 30 టన్నుల అక్రమ రేషన్ బియ్యాన్ని అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అలాగే రెండు వాహనాలు సీజ్ చేశారు. అర్ధరాత్రి నుంచి రైస్ మిల్‌లో తనిఖీలు కొనసాగుతున్నాయి. రైస్ మిల్ గౌడౌన్‌లో అక్రమ రేషన్ బియ్యం బస్తాలను భారీగా నిల్వ చేసినట్లు అధికారులు గుర్తించారు. రైస్ మిల్‌లో పూర్తి తనిఖీ తరవాత ఎంత మేర అక్రమ రేషన్ బియ్యం నిల్వ చేశారనే దానిపై ఈరోజు మధ్యాహ్ననం నాటికి పూర్తి సమాచారం తెలుస్తుందని విజిలెన్స్ అధికారులు చెబుతున్నారు.


ఇవి కూడా చదవండి...

PM Narendra Modi: అబద్ధాలు.. పిల్లచేష్టలు!

Gold and Silver Rate: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి రేట్లు

Read Latest AP News AND Telugu News

Updated Date - Jul 03 , 2024 | 09:33 AM