Share News

AP Government: మరో రెండు హామీల అమలు దిశగా.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ నిర్ణయాలు..

ABN , Publish Date - Jul 19 , 2024 | 07:23 AM

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకెళ్తుందనే చర్చ ప్రజల్లో సాగుతోంది. ఓవైపు టీడీపీ అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీలు అమలు చేయరంటూ ఎన్నికలకు ముందు వైసీపీ విస్తృతంగా ప్రచారం చేసింది.

AP Government: మరో రెండు హామీల అమలు దిశగా.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వ నిర్ణయాలు..
AP Government

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకెళ్తుందనే చర్చ ప్రజల్లో సాగుతోంది. ఓవైపు టీడీపీ అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీలు అమలు చేయరంటూ ఎన్నికలకు ముందు వైసీపీ విస్తృతంగా ప్రచారం చేసింది. కానీ అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోనే ఫించన్ల పెంపుతో వైసీపీ విమర్శలకు చెక్‌ పెట్టింది. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులమయం చేసినప్పటికీ.. తనకున్న పాలనా అనుభవంతో సీఎం చంద్రబాబు ఎన్నికల హామీలు అమలుతో పాటు రాష్ట్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు. గత వైసీపీ ప్రభుత్వం కేవలం కొన్ని సంక్షేమ పథకాలను అమలుచేసి.. అభివృద్ధిని పక్కనపెట్టింది. దీంతో వైసీపీపై ఆగ్రహంతో ఉన్న ప్రజలు ఇటీవల ఎన్నికల్లో ఆ పార్టీని పక్కనపెట్టారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఘన విజయాన్ని అందించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు సీఎం చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ఇప్పటికే పెన్షన్ల పెంపుతో లక్షలాది మందికి లబ్ధి చేకూర్చిన ప్రభుత్వం.. మరో నెల రోజుల వ్యవధిలో సూపర్‌ సిక్స్‌లో ఇచ్చిన ఒక హామీతో పాటు.. మరో ఎన్నికల హామీ అమలు దిశగా అడుగులు వేస్తోంది.

Amaravati : భార్యాభర్తల మధ్య విభేదాలు చిన్నారుల సంరక్షణకు అవరోధం కారాదు


అన్న క్యాంటీన్లు..

టీడీపీ అధికారంలో ఉన్న 2014-19 మధ్య ఏపీ వ్యాప్తంగా అమలుచేసిన అన్న క్యాంటీన్ల పథకం సూపర్‌ సక్సెస్‌ అయింది. సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఏదైనా పనిమీద పట్టణాలు, నగరాలకు వస్తే ఉదయం అల్పాహరం, మధ్యాహ్నం భోజనం కోసం సుమారు వంద రూపాయిలకు పైగా ఖర్చు చేయాల్సి వచ్చేది. అలాగే సామాన్యులు, శ్రమ జీవులు, నిరుద్యుగులు, ఉద్యోగాల కోసం శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులు బయట భోజనం చేయాలన్న ఎక్కువ మొత్తంలో ఖర్చుపెట్టాల్సి వచ్చేది. అలాంటివారి ఇబ్బందులను తొలగించేందుకు టీడీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్ల పేరుతో రూ.5కే అల్పాహ రం, భోజనం అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాన్ని ఆపేసింది. తాము మళ్లీ అదికారంలోకి వస్తే ఏపీలో అన్న క్యాంటీన్లను పునరుద్దరిస్తామని టీడీపీ తన మేనిఫెస్టోలో చెప్పింది. ఇచ్చిన మాట ప్రకారం ఆగష్టు 15 నుంచి అన్న క్యాంటీన్లను ఏపీలో తెరవనుంది. దీనికి సంబంధించిన పనులు చురుగ్గా సాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఒకే మోడల్‌లో ఈ క్యాంటీన్ల నిర్మాణం చేపడుతున్నామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. అన్న క్యాంటీన్లలో 5రూపాయిలకు అందించే భోజనం ఎంతో నాణ్యతతో కూడి ఉండటంతో ఎక్కువమంది ఇక్కడ భోజనం చేయడానికి ఇష్టపడుతుంటారు.

ఎంపీ విజయసాయిరెడ్డికి పిచ్చి పట్టింది: మంత్రి కొల్లు


ఫ్రీ బస్సు..

ఎన్నికల్లో మహిళలను విపరీతంగా ఆకర్షించిన మరో హామీ ఉచిత బస్సు పథకం. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఫ్రీ బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఇప్పటికే కర్ణాటక, తెలంగాణలో ఈ పథకం అమలవుతుంది. ఏపీలో ఆగష్టు 15 నుంచి ఈ పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేయనుంది. ఇప్పటికే కర్ణాటక, తెలంగాణలో అమలువుతున్న పథకాలను అధ్యయనం చేసిన ఏపీ ప్రభుత్వం.. ఎటువంటి వివాదాలకు తావు లేకుండా ఫ్రీ బస్సు పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతుంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం రూపొందిస్తుంది. ఫ్రీ బస్సు పథకాన్ని అమలుచేస్తే సూపర్‌ సిక్స్‌లో పొందుపర్చిన పథకాన్ని టీడీపీ కూటమి ప్రభుత్వం అమలుచేసినట్లవుతుంది.


అరాచకం గురించి జగన్‌ మాట్లాడితే రోత పుడుతోంది: లోకేశ్‌

ఇసుక మాఫియాను విడిచిపెట్టం: మంత్రి సుభాశ్‌

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Read More Andhra Pradesh News and Latest Telugu News

Updated Date - Jul 19 , 2024 | 07:34 AM