Share News

Budda Venkanna: పెద్దిరెడ్డికి వీరప్పన్‌ అంటూ నామకరణం చేసిన టీడీపీ నేత

ABN , Publish Date - Jul 29 , 2024 | 11:00 AM

Andhrapradesh: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పెద్దిరెడ్డిని వీరప్పన్‌తో‌ పోలుస్తూ వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... కొడుకుతో కలిసి పెద్దిరెడ్డి భూకబ్జాలు, అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. అబ్బా కొడుకుల ఆగడాలతో ప్రజలు తిరగబడి పుంగనూరులో అడుగు పెట్టకుండా అడ్డుకున్నారన్నారు. వారి దాడులు, దారుణాలు చెప్పకుండా టీడీపీపై పడి ఏడుస్తున్నారని మండిపడ్డారు.

Budda Venkanna: పెద్దిరెడ్డికి వీరప్పన్‌ అంటూ నామకరణం చేసిన టీడీపీ నేత
TDP Leader Budda Venkanna

విజయవాడ, జూలై 29: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై (Former Minister Peddireddy Ramachandra Reddy) టీడీపీ నేత బుద్దా వెంకన్న(TDP Leader Budda Venkanna) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పెద్దిరెడ్డిని వీరప్పన్‌తో‌ పోలుస్తూ వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ... కొడుకుతో కలిసి పెద్దిరెడ్డి భూకబ్జాలు, అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. అబ్బా కొడుకుల ఆగడాలతో ప్రజలు తిరగబడి పుంగనూరులో అడుగు పెట్టకుండా అడ్డుకున్నారన్నారు. వారి దాడులు, దారుణాలు చెప్పకుండా టీడీపీపై పడి ఏడుస్తున్నారని మండిపడ్డారు. వారి కబ్జాలు, దోపిడీల గురించి ప్రజలు పిటీషన్లు, వినతి పత్రాల ద్వారా ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారన్నారు. పుంగనూరుకే పరిమితం కాకుండా జిల్లా మొత్తం మీద పడి దోచేశారన్నారు. తండ్రి ఎమ్మెల్యే, కొడుకు ఎంపీ, అనచరులు మరోచోట పోటీ చేసి చిత్తూరు జిల్లాలో వేల కోట్లు దోచుకున్నారన్నారు.

MLA Peddireddy: ఎమ్మెల్యే పెద్దిరెడ్డిపై అనర్హత వేటు తప్పదా.. వైసీపీలో ఆందోళన!


బాబును ఓడించడం కాదు కదా..

చిత్తూరు జిల్లా వీరప్పన్‌గా పెద్దిరెడ్డికి నామకరణ చేస్తున్నామంటూ దుయ్యబట్టారు. వారి దోపిడీకి అడ్డం వస్తున్నారనే చంద్రబాబును ఓడించేందుకు వందల కోట్లు కుప్పంలో ఖర్చు పెట్టారని టీడీపీ నేత తెలిపారు. ప్రజల సొమ్మును దోచుకుని.. ఆ సొమ్ముతో ఓడిస్తాననే గుడ్డి నమ్మకంతో చంద్రబాబుపై శపధం చేశారన్నారు. చంద్రబాబును ఓడించడం కాదు కదా.. ఆయన దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయారన్నారు. చిత్తూరు జిల్లా వీరప్పన్ పెద్ది రెడ్డి అక్రమ ఆస్తులను అధికారులు జప్తు చేయాలని కోరారు. చంద్రబాబు పై రాళ్లు వేయించి ఆయన పర్యటనను అడ్డుకున్న నీచ చరిత్ర వాళ్లదని విమర్శలు గుప్పించారు. చిత్తూరు జిల్లా వీరప్పన్ ఆస్తులు మొత్తం అవినీతిమయమని... కాబట్టి కేసులు పెట్టి అరెస్టు చేయాలన్నారు. ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులను సుమోటాగా తీసుకుని ఈడీ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని కోరారు.


ఆ స్మగ్లర్లను మించి దోపిడీ...

చంద్రగిరి చెవిరెడ్డికి, తిరుపతి భూమనకు, నగరి రోజాకు వదిలి.. మిగతా ప్రాంతాలు మొత్తం పెద్దిరెడ్డే దోచుకున్నారన్నారు. టీడీఆర్ బాండ్లలో దాడులకు చెవిరెడ్డి, అతని కుమారుడు పాల్పడ్డారన్నారు. టీడీపీ ఎమ్మెల్యే నానిపై దాడి చేసి చంపేందుకు యత్నించారని ఆరోపించారు. పెద్ది రెడ్డి ఆస్తులను స్వాధీనం చేసుకుని విచారణ చేయాలన్నారు. ఎర్రచందనం స్మగ్లర్లను మించి ఈ వీరప్పన్ దోపిడీ జరిగిందన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను అభ్యర్దిస్తున్నా 2019 నుంచి 2024 వరకు దోచుకున్న అటవీ సంపదపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు.

Suryakumar Yadav: సూర్య కుమార్ యాదవ్ ఏమన్నారంటే..!!


ఆయనతో ఎప్పటికి గొడవ పడను...

‘‘నేను ఒక కామన్ మెన్‌‌గా ఈ దోపిడీపై ఫిర్యాదు చేస్తున్నా. ప్రభుత్వం కూడా చొరవ తీసుకుని సీబీఐకి లేఖ రాసి వారి ఆస్తులను జప్తు చేయాలి.ఒక్కరోజు ఐదు వందల మంది పెద్దిరెడ్డి అక్రమాలపై ఫిర్యాదులు చేశారంటే వారి దోపిడి ఎలా ఉందో అర్దం అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా సీఐడీ విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డీజీపీకి లేఖ రాస్తాను. మరోసారి ఇంతటి అక్రమాలకు ఎవరూ పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలి.పెద్దిరెడ్డికి ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయో దర్యాప్తు బృందాలు నిగ్గు తేల్చాలి. సుజనాతో ఎటువంటి విభేదాలు నాకు లేవు.. ఎవరో కావాలనే ప్రచారం చేయిస్తున్నారు. ఈజిల్లాకు ఇన్‌ఛార్జిగా ఉన్నప్పటి నుంచి ఆయనతో నాకు అనుబంధం ఉంది. నన్ను టీడీపీ నగర అధ్యక్షుడిగా చేసింది కూడా సుజనా చౌదరే. ఆనాడు కేశినేని నాని వ్యతిరేకించినా... సుజనా నన్ను ప్రోత్సహించారు. మొన్న పోటీ చేసే ముందు కూడా నాకు ఫోన్ చేసి నా అభిప్రాయం కూడా అడిగారు. అటువంటి వ్యక్తితో నాకు విభేదాలు ఎందుకు ఉంటాయి.. పబ్లిసిటీ లేకుండా పది మందికి మంచి చేసే గుణం ఉన్న వ్యక్తి సుజనా చౌదరి. నా జీవితంలో నేను ఆయనతో ఎప్పుడూ గొడవ పడను’’ అని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి..

YSRCP: వైసీపీకి ఇక చుక్కలే.. భూకబ్జాలపై కమిటీ..!

GST Scam: జీఎస్టీ స్కామ్.. ఏ5గా మాజీ సీఎస్... త్వరలో నోటీసులు

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 29 , 2024 | 11:56 AM