Share News

Somireddy: జన్మభూమిని తిరిగి ప్రారంభించే దిశగా అడుగులు..

ABN , Publish Date - Aug 08 , 2024 | 04:02 PM

Andhrapradesh: జన్మభుమి కార్యక్రమాలు తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. జన్మభూమి కార్యక్రమంపై టీడీపీ పొలిబ్యూరో సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. త్వరలో జన్మభూమి 2 కార్యక్రమం మొదలు కానున్నట్లు తెలిపారు.

Somireddy: జన్మభూమిని తిరిగి ప్రారంభించే దిశగా అడుగులు..
Somireddy Chandramohan Reddy

అమరావతి, ఆగస్టు 8: జన్మభూమి కార్యక్రమాలు తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం (AP Govt) అడుగులు ముందుకు వేస్తోంది. జన్మభూమి కార్యక్రమంపై టీడీపీ పొలిబ్యూరో సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (TDP Politburo Member somireddy Chandramohan Reddy) తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. త్వరలో జన్మభూమి-2 కార్యక్రమం మొదలు కానున్నట్లు తెలిపారు. జన్మభూమి 2 కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు ఎన్నారైలు, పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. పోలీట్ బ్యూరోలో 55 రోజుల పాలనపై చర్చించినట్లు తెలిపారు.

YSRCP: సోషల్ మీడియాలో వైసీపీ కుట్రలు..ఏం చేస్తున్నారంటే?


వర్షాలతో ప్రాజెక్టులన్ని నిండుకుండలా ఉన్నాయన్నారు. ప్రాజెక్టులు నిండటంతో జగన్ గుండె నీరుకారుతోందని విమర్శించారు. నామినేటెడ్ పోస్టులు అతి త్వరలో భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇసుకలో అక్రమాలు సహించబోనని అధినేత చంద్రబాబు మరోసారి హెచ్చరించారన్నారు. జనాభా నియంత్రణ వలన డీలిమిటేషన్‌లో దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందన్నారు. ఒక యూపీలో 140 పార్లమెంటు స్థానాలు వస్తే దక్షిణ భారతదేశం 160 మాత్రమే ఉంటాయన్నారు. జనాభా తగ్గడంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా తగ్గిపోతాయని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వెల్లడించారు.

CM Revanth Reddy: సాధించిన రేవంత్ రెడ్డి.. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌కు..!


కాగా.. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రాబాబు నాయుడు అధ్యక్షతన గురువారం టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలకు చంద్రబాబు పలు కీలక విషయాలపై దిశానిర్దేశం చేశారు. అలాగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దక్షిణ భారతదేశంలో జనాభా నిష్పత్తి రోజురోజుకు తగ్గుతుందని.. జనాభా నిష్పత్తి తగ్గడంతో కేంద్రం నుంచి వచ్చే నిధులు సైతం తగ్గుతాయని సమావేశంలో మాట్లాడారు. తెలంగాణాలో టిడిపి పార్డీని బలోపేతంపై దృష్టి సారించాలని నిర్ణయించారు. టీడీపీ పార్టీ సభ్యత్వం రుసుము రూ.100 తో ప్రారంభిస్తామని.. సభ్యత్వం తీసుకున్న వారు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి 5 లక్షలు వచ్చే విధంగా పరిహారం ఉండాలని నిర్ణయించారు. అలాగే పేదరిక నిర్మూలనపై ప్రధానంగా చర్చ జరిగింది. త్వరలో పేదరిక నిర్మూలనపై విధివిధానాలు రూపొందిస్తామని సమావేశంలో నిర్ణయించారు. విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నవారిని పేదరిక నిర్మూలన కార్యక్రమంలో భాగస్వాములుగా చేయాలని నిర్ణయించారు. ఎస్సీ వర్గీకరణకు జిల్లాను యూనిట్‌గా తీసుకుంటామని సమావేశంలో చర్చించారు. సరిగా దృష్టి పెడితే వైసీపీ గెలిచిన సీట్లలో మరో నాలుగు నుంచి ఐదు సీట్లు టీడీపీ గెలిచేదని టీడీపీ బ్యూరోలో నేతలు చర్చించారు.


ఇవి కూడా చదవండి..

Viral Video: కాలం కలిసిరాకపోవడం అంటే ఇదేనేమో.. వీధిలోకి వచ్చిన మొసలికి.. చివరికి ఎలాంటి గతి పట్టిందంటే..

Ambati Rambabu: ఏపీలో లా అండ్ ఆర్డర్‌‌ దారుణంగా పడిపోయింది..

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 08 , 2024 | 04:13 PM