Lokesh: పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా అమెరికాకు లోకేష్.. అపూర్వ స్వాగతం
ABN , Publish Date - Oct 26 , 2024 | 12:46 PM
Andhrapradesh: విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్.. అమెరికాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టులో మంత్రికి అపూర్వ స్వాగతం లభించింది. ఏపీకి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా మంత్రి లోకేష్ అమెరికా పర్యటన సాగనుంది.
శాన్ ఫ్రాన్సిస్కో (యూఎస్ఏ), అక్టోబర్ 26: పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరానికి చేరుకున్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్‌కు (Minister Nara Lokesh) ఎయిర్‌పోర్టులో ఐటీ సర్వ్, ఎన్ఆర్ఐ టీడీపీ ప్రతినిధులు అపూర్వ స్వాగతం పలికారు. ఏపీలో ఎన్డీఏ కూటమి ‘‘అఖండ’’ విజయం సాధించిన తర్వాత తొలిసారిగా అమెరికాలో లోకేష్ పర్యటిస్తున్నారు. అక్టోబర్ 25 నుంచి నవంబర్ 1వ తేదీ వరకు మంత్రి లోకేష్ అమెరికా పర్యటన సాగనుంది. ఈనెల 29న లాస్ వేగాస్ నగరంలో జరుగనున్న ఐటీ సర్వీస్ సినర్జీ 9వ సదస్సుకు మంత్రి హాజరుకానున్నారు. 31న అట్లాంటాలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటుచేసిన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో లోకేష్ పాల్గొననున్నారు.
Telangana: కలెక్టర్ ఏం చేస్తోంది.. భర్త పక్కన పడుకుందా.. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు..
పారిశ్రామికవేత్తల సమావేశంలో...
శాన్ ఫ్రాన్సిస్కోలో పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. వై2కె బూమ్ నేపథ్యంలో హైదరాబాద్, బెంగుళూరు నగరాల్లో ఐటీ శరవేగంగా అభివృద్ధి చెందిందని, ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ఏఐ అవకాశాలను అందిపుచ్చుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అభివృద్ధి సాధించబోతోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు గల అనుకూలతలు, ప్రభుత్వం అమలు చేస్తున్న ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలను మంత్రి వివరించారు. భారత్‌లో రాబోయే పాతికేళ్లలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయని , పరిపాలనలో ఏఐ వినియోగం ద్వారా ప్రజలకు వేగవంతమైన, మెరుగైన సేవలను అందించేందుకు తాము కృషి చేస్తున్నామని తెలిపారు.
Viral Video: వామ్మో.. ఒళ్లు జలదరించే స్టంట్.. కత్తులపై యువకుడి పల్టీలు.. చివరకు జరిగింది చూస్తే..
నాలుగవ సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నేతృత్వంలో యువనాయకత్వం చురుగ్గా పనిచేస్తోందన్నారు. మంత్రివర్గంలో 17 మంది కొత్తవారే ఉన్నారని.. విభజిత ఆంధ్రప్రదేశ్‌లో మ్యాన్యుఫ్యాక్చరింగ్, రెన్యువబుల్ ఎనర్జీ, బయో ఎనర్జీ, ఆక్వా, పెట్రో కెమికల్ రంగాల్లో పెట్టుబడులకు విస్తృతమైన అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి ద్వారా పేదరిక నిర్మూలనకు సీఎం సరికొత్త పీ-4 విధానానికి శ్రీకారం చుట్టారని మంత్రి తెలిపారు.
విద్యావ్యవస్థలో మార్పులు..
పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యావ్యవస్థలో మార్పులు తీసువస్తామన్నారు. పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా నైపుణ్యతతో కూడిన మానవవనరులను అందించడానికి, తద్వారా యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు విద్యారంగంలో కూడా సంస్కరణలకు శ్రీకారం చుట్టామన్నారు. నవీన ఆవిష్కరణల కోసం విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలకు ప్రాధాన్యతనిస్తూ రీసెర్చి సెంట్రిక్‌గా చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
Lawrence Bishnoi: జైల్లో గ్యాంగ్‌స్టర్ ఇంటర్వ్యూ.. డీఎస్పీ సహా ఏడుగురు పోలీసులపై వేటు
Viral Video: ఛీ.. ఛీ.. జెయింట్ వీల్‌ను కూడా వదలరా.. బహిరంగంగా యువతీయువకుల పాడు పనులు..
Read Latest AP News And Telugu News