Share News

AP Politics: మోదీకి జగన్ లేఖ వెనుక అసలు మతలబు ఏమిటి..?

ABN , Publish Date - Jul 19 , 2024 | 12:43 PM

వైసీపీ అధినేత జగన్ ప్రధాని మోదీకి రాసిన లేఖపై రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అపాయింట్‌మెంట్ కావాలంటూ మూడు పేజీల లేఖను జగన్ రాశారు.

AP Politics: మోదీకి జగన్ లేఖ వెనుక అసలు మతలబు ఏమిటి..?
Jagan

వైసీపీ అధినేత జగన్ ప్రధాని మోదీకి రాసిన లేఖపై రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. అపాయింట్‌మెంట్ కావాలంటూ మూడు పేజీల లేఖను జగన్ (YS Jagan) రాశారు. రాష్ట్రంలో అత్యంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని.. శాంతి భద్రతలు క్షీణించాయని.. ఏపీలో తాజా పరిస్థితులను మీ దృష్టికి తీసుకొచ్చేందుకు అపాయింట్‌మెంట్ కావాలంటూ మాజీ సీఎం జగన్ ఓ లేఖను రాశారు. రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయని.. ప్రభుత్వ యంత్రాంగం నిస్తేజంగా మారిపోయిందని జగన్ రాసిన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో అత్యంత భయానక వాతావరణం నెలకొందని.. అత్యంత అనాగరిక సంఘటనలు జరుగుతున్నాయంటూ లేఖ ద్వారా జగన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ లేఖపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ (TDP) ప్రభుత్వంపై బురద జల్లేందుకు జగన్ ఈ లేఖ రాశారనే అభిప్రాయం ఎక్కువుగా వినిపిస్తోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవనే జగన్ వాదన ఓ బూటకమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి

ఎంపీ విజయసాయిరెడ్డికి పిచ్చి పట్టింది: మంత్రి కొల్లు


40 రోజుల్లోనే..

టీడీపీ ప్రభుత్వం ఏర్పడి 40 రోజులవుతుంది. అతి తక్కువ వ్యవధిలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడానికి ఎటువంటి అంశాలు లేకపోవడంతో.. రాష్ట్రంలో జరుగుతున్న కొన్ని ఘటనలను బూచిగా చూపించి రాష్ట్రంలో శాంతి, భద్రతలు క్షీణిస్తున్నాయనే ఒక వాదనను తెరమీదకు తీసుకువచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా ప్రతిరోజు రాష్ట్రంలో ఎన్నో నేరాలు జరుగుతుంటాయి. వాటన్నింటికి ప్రభుత్వాలను బాధ్యులను చేయలేం. ప్రతి ఘటనలోనూ రాజకీయ కోణం ఉండదు. నేరాల సంఖ్య పెరుగుతుంటే.. ఆ రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించినట్లు భావించలేము. కానీ వైసీపీ ఓ పథకం ప్రకారం టీడీపీపై బురద జల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని.. ఏపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరగడానికి.. జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించడానికి జగన్ ఇలా చేస్తున్నారానే అనుమానాలను టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.

Amaravati : భార్యాభర్తల మధ్య విభేదాలు చిన్నారుల సంరక్షణకు అవరోధం కారాదు


టీడీపీ రియాక్షన్..!

జగన్ లేఖపై టీడీపీ కూటమి నేతల రియాక్షన్ మరోలా ఉంది. వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ నేతలను టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారని.. ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని.. అలాంటి పరిస్థితులు ప్రస్తుతం రాష్ట్రంలో లేవని అంటున్నారు. 2019 నుంచి 2024 మార్చి వరకు ఏపీలో శాంతి భద్రతలు క్షీణించాయని టీడీపీ నేతలు విమర్శిస్తే.. వాటిని వైసీపీ తిప్పికొట్టేది.. ప్రస్తుతం అవే ఆరోపణలను వైసీపీ చేస్తోంది. శాంతిభధ్రతలు అనేది సున్నితమైన అంశం.. ఓ రాష్ట్రంలో శాంతి, భద్రతలు క్షీణిస్తే అక్కడికి పరిశ్రమలు రావు.. పెట్టుబడులు రావు.. అందుకే రాజకీయ పార్టీలు ఇతర పార్టీలను విమర్శించే క్రమంలో రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విమర్శలు చేయాల్సి ఉంటుంది. ఏ రాజకీయ పార్టీకైనా ఆ నియమం వర్తిస్తుంది. నెలరోజుల పాలనలోనే టీడీపీ ప్రభుత్వం పాలనలో విఫలమైందని.. రాష్ట్రం రావణకాష్టంగా మారిందని విమర్శించడానికి రాజకీయ విమర్శగానే చూడాల్సి ఉంటుందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.

అరాచకం గురించి జగన్‌ మాట్లాడితే రోత పుడుతోంది: లోకేశ్‌


కుట్ర నిజమేనా..!

వైసీపీని రాష్ట్రంలో లేకుండా చేసేందుకు టీడీపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందంటూ ప్రధాని మోదీకి రాసిన లేఖలో జగన్ సంచలన ఆరోపణలు చేశారు. ఏదైనా రాజకీయ పార్టీ భవిష్యత్తు ప్రజల చేతుల్లో ఉంటుంది. ప్రజలు నాయకుడిని విశ్వసిస్తే ఆ రాజకీయ పార్టీ మనుగడ సాగిస్తుంది. దీనికి పెద్ద ఉదాహరణ టీడీపీ. 2019 ఎన్నికల తర్వాత టీడీపీకి రాజకీయ భవిష్యత్తు లేదని.. ఆ పార్టీ నేతలంతా పార్టీ విడిచి వెళ్తున్నారనే ప్రచారం సాగింది. కానీ ఐదేళ్లకు సీన్ రివర్స్ అయింది. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా.. పార్టీని కాపాడుకుంటూ వచ్చారు చంద్రబాబు. దీంతో ఆ పార్టీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చింది. ఓ పార్టీ మనుగడ.. నాయకుడి సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. జగన్ తన తప్పులను సరిదిద్దుకుని ముందుకెళ్తే తన పార్టీకి రాజకీయ భవిష్యత్తు ఉంటుందే తప్పా.. వేరొకరిపై తప్పుడు ఆరోపణలు చేయడం ద్వారా కాదనేది గ్రహించాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు.


ఇసుక మాఫియాను విడిచిపెట్టం: మంత్రి సుభాశ్‌

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Read More Andhra Pradesh News and Latest Telugu News

Updated Date - Jul 19 , 2024 | 12:43 PM