Andhra Pradesh: ఆయువు తీసిన ఆన్ లైన్ బెట్టింగ్..
ABN , Publish Date - Jan 12 , 2024 | 12:53 PM
ఆన్ లైన్ బెట్టింగ్ నిండు ప్రాణాలు తీసింది. సరదాగా మొదలై అలవాటుగా మారి చివరికి వ్యసనంగా మారి
నెల్లూరు: ఆన్ లైన్ బెట్టింగ్ నిండు ప్రాణాలు తీసింది. సరదాగా మొదలై అలవాటుగా మారి చివరికి వ్యసనంగా మారి ఓ యువకుడి గొంతు నులిమేసింది. ఆన్ లైన్ బెట్టింగ్ ఆడవద్దని తండ్రి మందలించడంతో ఓ యువకుడు మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. నెల్లూరు జిల్లాలోని మర్రిపాడు మండలం వెంగంపల్లి గ్రామానికి చెందిన ప్రకాశ్.. డిగ్రీ చదువుతున్నాడు. అతను ఆన్ లైన్ గేమ్స్ లో బెట్టింగ్ పెట్టేవాడు. ఈ అలవాటు కాస్తా వ్యసనంగా మారింది.
విషయం తెలుసుకున్న సురేశ్ తండ్రి.. ఆన్ లైన్ బెట్టింగ్ ఆడొద్దని మందలించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సురేశ్.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గతంలో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ఆడి భారీగా నగదు పోగొట్టుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి.. కేసు నమోదు చేసుకున్నారు.