Share News

Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ గేట్ల మరమ్మతులు పూర్తి.. కన్నయ్యకు సన్మానం

ABN , Publish Date - Sep 09 , 2024 | 04:33 PM

ప్రకాశం బ్యారేజీ దెబ్బతిన్న గేట్ల మరమ్మతులు పూర్తయ్యాయి.. 67, 69, 70 గేట్ల వద్ద దెబ్బతిన్న కౌంటర్ వెయిట్ల వద్ద ఇంజనీర్లు మరమ్మతులు పూర్తి చేశారు..

Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ గేట్ల మరమ్మతులు పూర్తి.. కన్నయ్యకు సన్మానం
Prakasam Barrage

అమరావతి/విజయవాడ: ప్రకాశం బ్యారేజీ (Prakasam Barrage) వద్ద దెబ్బతిన్న గేట్ల మరమ్మతు పనులు పూర్తయ్యాయి. కేవలం 5 రోజులలోపే మూడు గేట్ల వద్ద భారీ కౌంటర్ వెయిట్లు ఏర్పాటు చేయడం జరిగింది. 67, 69, 70 గేట్ల వద్ద దెబ్బతిన్న కౌంటర్ వెయిట్ల వద్ద ఇంజనీర్లు మరమ్మతు పనులు పూర్తి చేశారు. దెబ్బతిన్న వాటి స్థానంలో స్టీల్‌తో తయారు చేసిన భారీ కౌంటర్ వెయిట్లను ఇంజినీర్లు ఏర్పాటు చేశారు. ఇరిగేషన్ చీఫ్ అడ్వైజర్ కన్నయ్య నాయుడు మార్గదర్శనలో కౌంటర్ వెయిట్లు ఏర్పాటు పూర్తయ్యాయి. బెకెమ్ ఇన్ ఫ్రా సంస్థ గేట్ల మరమ్మతులు చేపట్టి పూర్తి చేసింది. రేయింబవళ్లు పనిచేసిన సిబ్బంది, ఇంజినీర్లు, అధికారులను కన్నయ్య సన్మానించారు. మార్గదర్శనం చేసిన కన్నయ్యను తిరిగి ఇంజినీర్లు, అధికారులు సన్మానించారు.


Prakasam-Barrage-Boats.jpg

కష్టపడ్డాం..

ఈ సందర్భంగా కన్నయ్య మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు సహకారం, ప్రోత్సాహంతోనే పనులు వేగంగా పూర్తి చేశామన్నారు. గేట్లు మరమ్మతు పనులు శరవేగంగా చేశామని.. ప్రస్తుతం ఆ మూడు గేట్లూ సమర్థవంతంగా పనిచేస్తున్నాయని చెప్పారు. రైతులకు నష్టం జరగకూడదనే రేయింబవళ్లు కష్టపడి పని చేసి పూర్తి చేశామని నాయుడు వెల్లడించారు. అంతేకాదు.. ఏపీలో లక్షలాది ఎకరాల్లో ఉన్న పంట పొలాలను రక్షించడం చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ఇదిలా ఉంటే.. ప్రకాశం బ్యారేజీకి పూర్తి అయిన విరిగిపోయిన కౌంటర్ వెయిట్ తొలగించడం జరిగింది. దగ్గరుండి పనులను నిపుణుడు కన్నయ్య పర్యవేక్షణలో ఈ పనులు జరిగాయి. కాగా.. రేపటి నుంచి బోట్లు తొలగింపు ప్రకీయను అధికారులు ప్రారంభించనున్నారు.


anitha-vangalapudi.jpg

కుట్ర కోణం ఇలా..

ఇదిలా ఉంటే.. ప్రకాశం బ్యారేజీను పడవలు ఢీ కొట్టిన ఘటనలో పోలీసులు మొత్తం మూడు కేసులు నమోదు చేశారు. ఈ మూడు కేసుల్లో నిందితులుగా ఉషాద్రి, కోమటి రామ్మోహనరావులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఇద్దరినీ సోమవారం సాయంత్రం విజయవాడ కోర్టులో పోలీసులు హాజరు పరిచారు. ఈ ఘటనపై రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. ప్రకాశం బ్యారేజ్ బోట్ల విషయంలో కుట్రకోణం ఉందన్నారు. విచారణ జరుగుతోంది.. ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేశామని హోం మంత్రి చెప్పుకొచ్చారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ విశాఖలో కూర్చుని మాట్లాడటం సరికాదని హితవు పలికారు. ఎంతోమంది దాతలు సహాయం చేస్తున్నారని.. వాటర్‌ ప్యాకెట్ కూడా ఇవ్వనోళ్లు మాట్లాడడం విడ్డూరం ఉందని విమర్శకులు, వైసీపీ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి ఇలాంటి సమయంలో కూడా బెంగళూరు వెళ్లారని మంత్రి అనిత ఒకింత వ్యంగ్యంగా మాట్లాడారు.

Updated Date - Sep 09 , 2024 | 05:04 PM