AP News: సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి ప్రత్యేకహోదా సాధన సమితి యత్నం
ABN , Publish Date - Mar 01 , 2024 | 11:35 AM
Andhrapradesh: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ప్రత్యేకహోదా సాధన సమితి శుక్రవారం ఆందోళనకు దిగారు. హోదా సాధించడంలో సీఎం జగన్ విఫలమయ్యారని ప్రత్యేక హోదా సాధన సమితి ఆరోపించింది. ప్రత్యేక హోదా కోసం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడికి నేతల యత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు.
అమరావతి, మార్చి 1: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ప్రత్యేకహోదా సాధన సమితి శుక్రవారం ఆందోళనకు దిగారు. హోదా సాధించడంలో సీఎం జగన్ విఫలమయ్యారని ప్రత్యేక హోదా సాధన సమితి ఆరోపించింది. ప్రత్యేక హోదా కోసం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడికి నేతల యత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. సీఎం క్యాంప్ కార్యాలయానికి యత్నించిన నేతలను పోలీసులు అరెస్టు చేశారు. క్యాంప్ కార్యాలయం వైపు దూసుకు వెళ్తున్న యువజన విద్యార్థి జేఎసీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. ప్రత్యేక హోదా సాధన సమితి నేత చలసాని శ్రీనివాస్, జై భారత్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ ఆందోళనలో పాల్గొన్నారు.
అఖిలపక్షాన్ని ప్రధాని వద్దకు తీసుకెళ్లాలి: జేడీ
ఈ సందర్భంగా జేడీ మాట్లాడుతూ.. రాష్టానికి ప్రత్యేక హోదా సాధించడంలో సీఎం జగన్ ఘోరంగా విఫలమయ్యారన్నారు. విభజన జరిగి పదేళ్లైనా హోదా సహా విభజన హామీలు నెరవేర్చకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణలో సీఎం ఘోరంగా విఫలమయ్యారన్నారు. వెంటనే ప్రధాని వద్దకు అఖిల పక్షాన్ని సీఎం జగన్ తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా ఇచ్చేలా కృషి చేయాలి లేదంటే ప్రజలు క్షమించరన్నారు. అందరూ కలసి రాష్ట్రాన్ని మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దం అంటోన్న సీఎం జగన్.. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లేందుకు సిద్దమవ్వాలన్నారు. హోదా సాధన కోసం టీడీపీ కమ్యూనిస్టులు ఇతర పార్టీలంతా కలసి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
అందరితో కలిసి ఉద్యమానికి సిద్ధం: చలసాని
రాష్ట్రానికి హోదా అడిగితే అక్రమంగా అరెస్టులు చేయడం దుర్మార్గమని చలసాని శ్రీనివాస్ మండిపడ్డారు. ఏపీ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో సీఎం జగన్ తాకట్టు పెట్టారని ఆరోపించారు. అందరితో కలసి ఉద్యమానికి తాను సిద్దమన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురాలేకపోవడం వల్ల ప్రజలు దారుణంగా నష్టపోయారన్నారు. విశాఖ ఉక్కును అమ్నుతుంటే సీఎం సిగ్గులేకుండా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడంలో సీఎం జగన్ ఘోరంగా విఫలమయ్యారన్నారు. సీఎం సొంత జిల్లాలో కడప ఉక్కు ఫ్యాక్టరీని ప్రారంభించలేక పోవడం సిగ్గు చేటన్నారు. సీఎం కనీసం తమ వినతి పత్రం తీసుకోకుండా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...