Share News

Cyber Crime: సీబీఐ అధికారులమంటూ మహిళకు రూ.26లక్షలు టోకరా..

ABN , Publish Date - Jul 29 , 2024 | 09:50 AM

నగరంలోని విద్యానగర్‌లో సైబర్ మోసం వెలుగుచూసింది. సీబీఐ అధికారులమని చెప్పిన కేటుగాళ్లు సెల్వా రోజ్లిన్ అనే మహిళ నుంచి సుమారు రూ.26లక్షలు దోచుకున్నారు. ముంబయి నుంచి ఫోన్ చేస్తున్నామని, మీ పేరిట వచ్చిన కొరియర్‌లో డ్రగ్స్ ఉన్నాయంటూ ఆమెను బెదిరించారు. దీంతో భయపడిపోయిన సదరు మహిళ కేటుగాళ్లు చెప్పిన అకౌంట్‌కు డబ్బు పంపించింది. అనంతరం మోసపోయినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించింది.

Cyber Crime: సీబీఐ అధికారులమంటూ మహిళకు రూ.26లక్షలు టోకరా..

ఏలూరు: నగరంలోని విద్యానగర్‌లో సైబర్ మోసం వెలుగుచూసింది. సీబీఐ అధికారులమని చెప్పిన కేటుగాళ్లు సెల్వా రోజ్లిన్ అనే మహిళ నుంచి సుమారు రూ.26లక్షలు దోచుకున్నారు. ముంబయి నుంచి ఫోన్ చేస్తున్నామని, మీ పేరిట వచ్చిన కొరియర్‌లో డ్రగ్స్ ఉన్నాయంటూ ఆమెను బెదిరించారు. దీంతో భయపడిపోయిన సదరు మహిళ కేటుగాళ్లు చెప్పిన అకౌంట్‌కు డబ్బు పంపించింది. అనంతరం మోసపోయినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించింది.


ఏలూరు విద్యానగర్‌లో పాము సెల్వా రోజ్లిన్ అనే మహిళ నివాసం ఉంటోంది. ఆమెకు ఈనెల 18న ఓ అపరిచిత వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తి తనను తాను సీబీఐ అధికారిగా పరిచయం చేసుకున్నాడు. ముంబయి నుంచి కాల్ చేస్తున్నట్లు చెప్పాడు. అనంతరం మీ పేరిట కొరియర్ వచ్చిందని, అందులో పాస్ పోర్టులు, పాన్ కార్డులు, క్రెడిట్ కార్డులు, డ్రగ్స్ ఉన్నాయని చెప్పాడు. మీపై కేసు నమోదు చేశామని బెదిరింపులకు దిగాడు. ఆమె నమ్మకపోయే సరికి వీడియో కాల్ చేసి మరీ పార్సిల్‌లోని వస్తువులు చూపించాడు. కేసు నుంచి మీరు బయటపడాలంటే అడిగినంత డబ్బు ఇవ్వాలని వార్నింగ్ ఇచ్చాడు. భయపడిపోయిన సెల్వా రోజ్లిన్ నిందితుడు చెప్పిన బ్యాంకు ఖాతాకు రూ.25,60,500 పంపించారు. అనంతరం మోసపోయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.


ఈనెల 5వ తేదీన కూడా తిరుపతి జిల్లా చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే ఎన్.ఆర్.జయదేవనాయుడు సైతం సైబర్ క్రైమ్ బారిన పడి రూ.50లక్షలు పోగొట్టుకున్నారు. వాట్సాప్ కాల్ చేసిన కేటుగాళ్లు సుప్రీంకోర్టు నియమించిన సీబీఐ అధికారులమంటూ మాజీ ఎమ్మెల్యేను నమ్మించారు. మనీ లాండరింగ్ కేసులో మిమ్మల్ని అరెస్టు చేసి జైలుకు పంపిస్తామని బెదిరించారు. కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పినా సైబర్ మోసగాళ్లు వినలేదు. తనిఖీల నిమిత్తం తమ ఖాతాకు రూ.50లక్షలు పంపాలని అనంతరం వాటిని తిరిగి పంపిస్తామని చెప్పారు. వారు చెప్పిన మాటలు నమ్మిన మాజీ ఎమ్మెల్యే జయదేవనాయుడు నిందితుల అకౌంట్‌కు నగదు పంపారు. అనంతరం మోసపోయినట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించారు.


అపరిచిత వ్యక్తుల మెసేజ్‌లు, ఫోన్ కాల్స్‌కు స్పందించవద్దని పోలీసులు ఇప్పటికే పలుమార్లు ప్రజల్ని హెచ్చరించారు. బ్యాంకు, సీపీఐ, సీఐడీ లేదా ఇతర అధికారులమంటూ ఫోన్లు వస్తే వెంటనే తమను సంప్రదించాలని తెలిపారు. అనవసరపు లింకులపై క్లిక్ చేసి నగదు పోగొట్టుకోవద్దని హెచ్చరిస్తున్నారు. లాటరీలో నగదు తగిలిందని, లోన్ యాప్ సందేశాలపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే వాట్సాప్ మెసేజ్, ఈ-మెయిల్స్‌‌కు ఏమాత్రం స్పందించవద్దని సూచిస్తున్నారు. ఎవరైనా ఫోన్ చేసి బ్యాంకు వివరాలు, మెుబైల్స్‌కు వచ్చే ఓటీపీలు చెప్పాలని కోరితే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్తున్నారు. ప్రజలు సైబర్ మోసాలపై అవగాహన పెంచుకొని ఆర్థిక నష్టం బారిన పడకుండా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Updated Date - Jul 29 , 2024 | 09:50 AM