Share News

Lok Sabha Polls: మేనిఫెస్టోలో ఎవరిది పై చేయి..ఎందులో ఏముంది..?

ABN , Publish Date - Apr 16 , 2024 | 10:50 AM

దేశంలో సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఏప్రియల్ 19న తొలివిడత పోలింగ్ జరగనుంది. ఏడు విడతల్లో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. గెలుపు కోసం రాజకీయ పార్టీలు వ్యూహాలను సిద్ధం చేశాయి. ముందుకు ప్రజలను ఆకర్షించేందుకు మేనిఫెస్టోలతో రెడీ అయ్యాయి.

Lok Sabha Polls: మేనిఫెస్టోలో ఎవరిది పై చేయి..ఎందులో ఏముంది..?
Modi vs Rahul

దేశంలో సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఏప్రియల్ 19న తొలివిడత పోలింగ్ జరగనుంది. ఏడు విడతల్లో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. గెలుపు కోసం రాజకీయ పార్టీలు వ్యూహాలను సిద్ధం చేశాయి. ముందుకు ప్రజలను ఆకర్షించేందుకు మేనిఫెస్టోలతో రెడీ అయ్యాయి. ఇప్పటికే కాంగ్రెస్ (Congress), బీజేపీ ఈ రెండు పార్టీలు తమ మేనిఫెస్టో(Manifesto)లను విడుదల చేశాయి. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. తమను గెలిపిస్తే ఏం చేస్తామో ప్రజలకు వివరిస్తున్నారు. కాంగ్రెస్ 'న్యాయ్ పత్ర్ ' పేరుతో బీజేపీ 'సంకల్ప్ పత్ర్' పేరుతో ఎన్నికల ప్రణాళికను విడుదల చేశాయి. ఈ రెండు మేనిఫెస్టోల్లో ఏమి ఉన్నాయో తెలుసుకుందాం.

బాండ్ల రద్దుతో మళ్లీ నల్లధనం


సంకల్ప్ పత్ర్ vs న్యాయ పత్ర్

లోక్‌సభ ఎన్నికలకు ముందు, కాంగ్రెస్, బీజేపీ తమ తమ మేనిఫెస్టోలను విడుదల చేశాయి. మోదీ గ్యారెంటీ క్యాప్షన్‌తో బీజేపీ సంకల్ప్ పత్ర్ విడుదల చేయగా.. మహిళలు, యువత, నిరుపేదలు, రైతులు సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ న్యాయ పత్ర్ ‌ను రూపొందించింది.


యువత కోసం

రెండు పార్టీలు యువతను ఆకర్షించే ప్రయత్నం చేశాయి. బీజేపీ తన మేనిఫెస్టోలో పేపర్ లీక్‌లకు వ్యతిరేకంగా చట్టాలు చేస్తామని హామీ ఇచ్చింది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను సత్వరమే భర్తీ చేశామని, స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి చర్యలు తీసుకుంటా మని తెలిపింది. దేశాన్ని గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా మార్చి ఉపాధి అవకాశాలు పెంచుతామని తెలిపింది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మద్దతుగా ముద్ర రుణాల పరిమితిని పెంచుతామని బీజేపీ పేర్కొంది.

నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి యువ న్యాయ్ కార్యక్రమం అమలు చేస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో తెలిపింది. డిప్లొమా, గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన 25 ఏళ్లలోపు యువకుల కోసం రైట్ టు అప్రెంటీస్‌షిప్ చట్టం తీసుకొస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో 30 లక్షల ఖాళీలను భర్తీ చేస్తామిన తెలిపింది.


సీనియర్ సిటిజన్ల కోసం

సీనియర్ సిటిజన్ల కోసం రెండు పార్టీలు తమ మేనిఫెస్టోలో వివిధ హామీలు ఇచ్చాయి. 70 ఏళ్లు పైబడిన వారికి ఆయుష్మాన్ భారత్ పథకం కింద వైద్య సేవలు అందిస్తామని తెలిపింది. తీర్థయాత్రలు చేపట్టే సీనియర్ సిటిజన్లకు రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అవసరమైన సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపింది.

దివ్యాంగుల హక్కుల చట్టం 2016ను కఠినంగా అమలు చేస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పేర్కొంది. సీనియర్ సిటిజన్లు, వితంతువులు, దివ్యాంగులకు జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం కింద పెన్షన్‌ను వెయ్యి రూపాయిలకు పెంచుతామని చెప్పింది. సీనియర్ సిటిజన్లకు ప్రజా రవాణాలో ప్రయాణ రాయితీలను పునరుద్దరిస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పేర్కొంది.


రైతుల కోసం

దేశంలో రైతులు కీలకమైన ఓటు బ్యాంకుగా ఉన్నారు. దీంతో ఈ వర్గాన్ని ఆకట్టుకునేందుకు రెండు పార్టీలు ప్రయత్నించాయి. వ్యవసాయాన్ని సాంకేతికతను జోడించడంతో పాటు.. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనను బలోపేతం చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. కనీస మద్దతు ధర (MSP) పెంచుతామని తెలిపింది.

స్వామినాథన్ కమిషన్ సిఫార్సు చేసిన విధంగా MSPకి చట్టబద్ధత కల్పిస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో తెలిపింది. వ్యవసాయ ఫైనాన్స్‌పై శాశ్వత కమిషన్‌ ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చింది.


మహిళల కోసం

మహిళలకు చట్టసభల్లో సమాన ప్రాతినిధ్యాన్ని కల్పించడానికి మహిళా రిజర్వేషన్ బిల్లును క్రమపద్ధతిలో అమలు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. మహిళా సాధికారత సాధించే దిశగా గ్రామీణ మహిళలను లక్షాదికారులు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపింది. అలాగే మహిళల ఆరోగ్య సమస్యలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తామని బీజేపీ మేనిఫెస్టోలో తెలిపింది.

మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతి పేదింటి మహిళకు షరతులు లేకుండా ఏడాదికి లక్ష రూపాయిలు నేరుగా ఖాతాల్లో జమచేస్తామని తెలిపింది. 2025 నుంచి మహిళలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 50శాతం రిజర్వేషన్లు. ప్రతి జిల్లాలో కనీసం ఒక సావిత్రీబాయి ఫూలే హాస్టల్‌తో వర్కింగ్ ఉమెన్ హాస్టళ్ల సంఖ్యను రెట్టింపు చేస్తామని తెలిపింది.


ఆరోగ్య రంగం

నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించేందుకు AIIMS నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడంతో పాటు బలమైన ఆరోగ్య సంరక్షణ కోసం PM-ABHIMను విస్తరిస్తామని బీజేపీ మేనిఫెస్టోలో పేర్కొంది. తక్కువ ధరకే మందులు అందించేందుకు దేశ వ్యాప్తంగా జన్ ఔషధి కేంద్రాలను విస్తరిస్తామని తెలిపింది. ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి ఆయుష్మాన్ భారత్ పథకం వర్తించేలా చర్యలు తీసుకుంటామని తెలిపింది.

సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ కోసం రూ. 25 లక్షల వరకు నగదు రహిత ఆరోగ్య సేవలు పొందే విధంగా బీమా పథకం అమలు, పబ్లిక్ హెల్త్ సెంటర్లలో అన్ని పరీక్షలు, మందులు ఉచితంగా అందిస్తామిన కాంగ్రెస్ తెలిపింది. రెండు పార్టీలు అన్నివర్గాలను ఆకట్టుకునే విధంగా తమ మేనిఫెస్టోలో పథకాలను పొందుపర్చాయి.


రోజుకు రూ.100 కోట్లు

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 16 , 2024 | 11:07 AM