Share News

Revanth Reddy: ఏజ్ లిమిట్ అమలు చేస్తే ఎవరు ప్రధానినో తేల్చుకోండి..

ABN , Publish Date - May 13 , 2024 | 01:33 PM

Telangana: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొడంగల్‌లో కుటుంబసమేతంగా సీఎం రేవంత్ ఓటేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 33.5 శాతం ఓట్లు వచ్చాయని.. ఈ ఎన్నికల్లో అంతకు మించివస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు తమ వందరోజుల పాలనకు రెఫరెండమని తెలిపారు. బీజేపీ కూడా ఈ ఎన్నికలు మోదీ పాలనకు రెఫరెండం అని చెబుతోందన్నారు.

Revanth Reddy: ఏజ్ లిమిట్ అమలు చేస్తే ఎవరు ప్రధానినో తేల్చుకోండి..
CM Revanth Reddy

కొడంగల్, మే 13: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy) తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొడంగల్‌లో కుటుంబసమేతంగా సీఎం రేవంత్ ఓటేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 33.5 శాతం ఓట్లు వచ్చాయని.. ఈ ఎన్నికల్లో (Loksabha Polls 2024) అంతకు మించివస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు తమ వందరోజుల పాలనకు రెఫరెండమని తెలిపారు. బీజేపీ కూడా ఈ ఎన్నికలు మోదీ పాలనకు రెఫరెండం అని చెబుతోందన్నారు. సెప్టెంబర్ 17, 2025తో మోదీ (PM Modi) 75 ఏళ్లు నిండుతాయని.. ఏజ్ లిమిట్ అమలు చేస్తే ఎవరు ప్రధాని అనేది బీజేపీ (BJP) తేల్చుకోవాలని హితవుపలికారు. దేశంలో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని స్పష్టం చేశారు. మ్యాజిక్ ఫిగర్ రాకపోతే బీజేపీ, ఎన్డీఏకు దేశంలో మద్దతు ఇవ్వడానికి ఎవరూ సిద్ధంగా లేరని సీఎం వెల్లడించారు.

Lok Sabha Polls 2024: అయ్యో పాపం.. ఎన్నికల విధుల్లో ఉండగా హార్ట్‌ఎటాక్


400 సీట్లు ఎలా సాధ్యం?

బీజేపీ 336 సీట్లలో మాత్రమే పోటీ చేస్తోందని.. 400 సీట్లు ఎట్లా సాధ్యమని ప్రశ్నించారు. 13 ఏళ్లు సీఎంగా, 10 ఏళ్లు పీఎంగా పని చేసిన మోదీ.. భారత రాజ్యాంగాన్ని పూర్తిగా అర్ధం చేసుకోలేదని విమర్శించారు. దేశంలో మతపరమైన రిజర్వేషన్లు లేవన్నారు. సామాజికంగా వెనుకబడిన వారికి మాత్రమే దేశంలో రిజర్వేషన్లు అమలులో ఉన్నాయని తెలిపారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఏపీలో ఎన్డీఏ కూటమి ఎందుకు చెప్పడంలేదని నిలదీశారు. దేశ ప్రజలకు మోదీ మాయమాటలు చెబుతున్నారని మండిపడ్డారు.

AP Election Polling 2024: తాడిపత్రిలో ఫ్యాక్షన్ సినిమాకు మించిన సీన్.. టెన్షన్ టెన్షన్..


ఇండియా కూటమి పేరుతో తాము ప్రజలను ఓట్లు అడుగుతోంటే... మోదీ పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతోందన్నారు. ఎవరు నామ్ దార్.. ఎవరు కామ్ దార్ దీన్నిబట్టి తెలుస్తోందన్నారు. ఎవరు అట్టడుగు వర్గాల ప్రజల కోసం పని చేస్తున్నారో చర్చకు సిద్ధమని అన్నారు. దేశంలో మోదీ వ్యతిరేక వేవ్ నడుస్తోందని.. మోదీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడినా చర్యలు లేవన్నారు. నవనీత్ కౌర్ 15 సెకన్ల కామెంట్స్‌పై చర్యలు లేవని మండిపడ్డారు. బీజేపీ నేతలపై ఎంహెచ్ఏ కంప్లైంట్ చేయదని ప్రశ్నించారు. కానీ ఒక వీడియో వైరల్ కేసులో తమపై ఎంహెచ్ఏ రంగంలోకి దిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Chandrababu: పల్నాడులో హింసపై చంద్రబాబు సీరియస్..


బీజేపీలో చేరితే అవినీతి మరకలు పోతాయా?

ఏజెన్సీలను బీజేపీ దుర్వినియోగం చేస్తుందనడానికి ఇది నిదర్శనమన్నారు. బీజేపీ వాషింగ్ మెషిన్‌లో చేరగానే కొందరు నాయకుల అవినీతి మరకలు తొలగిపోయా? అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌కు ఆదాని, అంబానీ డబ్బులు ఇస్తున్నారన్న మోదీని ఒక్కటే అడుగుతున్నా.. ఈడీ, సీబీఐ, ఐటీ అధికారులను పంపి ఆదానీ, అంబానీల ఆఫీసులపై, ఇళ్లల్లో సోదాలు నిర్వహించాలన్నారు. మోదీ ఆరోపణలు నిజమైతే ఎందుకు వారిపై చర్యలు తీసుకోవడం లేదని అడిగారు. రైతు బంధు ఎలా ఇచ్చామో.. పంద్రాగస్టులోగా రైతు రుణమాఫీ చేసి తీరుతామని మరోసారి స్పష్టం చేశారు. రుణమాఫీ ఏమీ అసాధ్యమైన టాస్క్ కాదన్నారు. పార్లమెంట్ ఎన్నికలు తమ వంద రోజుల పాలనకు రెఫరెండమన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను దెబ్బతీసి పెట్టుబడులను గుజరాత్‌కు తరలించుకుపోవాలని బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. యూపీ పరిస్థితిని తెలంగాణలో తీసుకురావాలని ప్రయత్నిస్తోందన్నారు.

AP Elections 2024: తిక్క కుదిరింది.. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెంప పగలగొట్టిన ఓటర్..


కేసీఆర్‌ కూడా కేఏపాల్‌ లాగే..

కేసీఆర్‌పై (BRS Chief KCR) తనకు సానుభూతి ఉందన్నారు. మానసిక ఒత్తిడితో, నిరాశతో భావోద్వేగంతో ఆయన ప్రకటనలు చేస్తున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కూడా కేఏపాల్ లాగే మాట్లాడుతున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి సెటైర్ విసిరారు.


ఇవి కూడా చదవండి...

CEO Vikasraj: సరైన సమయానికే పోలింగ్ స్టార్ట్...

Elections 2024: ప్రజాస్వామ్యం అంటే ఇదేరా.. సెలబ్రేటీల మొదలు సాధారణ మనిషి వరకు ఒకటే రూల్..

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 13 , 2024 | 01:36 PM