Share News

Loksabha Elections: సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఈవీఎంల పంపిణీ ప్రారంభం

ABN , Publish Date - May 12 , 2024 | 11:33 AM

Telangana: పోలింగ్‌కు మరికొద్ది గంటల సమయమే ఉంది. దీంతో అధికారులు ఈవీఎంల పంపిణీ ప్రక్రియను మొదలుపెట్టారు. సికింద్రాబాద్ , హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఈవీఎంల పంపిణీ ప్రారంభమైంది. రెండు పార్లమెంట్‌ సెగ్మెంట్ల పరిధిలోని పోలింగ్ బూత్‌లకు ఈవీఎంలను పంపిణీ చేయనున్నారు. సికింద్రాబాద్ వెస్లీ కాలేజ్‌లో ఈవీఎంల పంపిణీని జీహేచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ పరిశీలించారు.

Loksabha Elections: సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఈవీఎంల పంపిణీ ప్రారంభం
Distribution of EVMs

హైదరాబాద్, మే 12: పోలింగ్‌కు (Loksabha polls 2024) మరికొద్ది గంటల సమయమే ఉంది. దీంతో అధికారులు ఈవీఎంల పంపిణీ ప్రక్రియను మొదలుపెట్టారు. సికింద్రాబాద్ , హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఈవీఎంల పంపిణీ ప్రారంభమైంది. రెండు పార్లమెంట్‌ సెగ్మెంట్ల పరిధిలోని పోలింగ్ బూత్‌లకు ఈవీఎంలను పంపిణీ చేయనున్నారు. సికింద్రాబాద్ వెస్లీ కాలేజ్‌లో ఈవీఎంల పంపిణీని జీహేచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ (GHMC Commissioner Ronald Rose) పరిశీలించారు. ఈ సందర్భంగా రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ.. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ల పరిధిలో 3500 పోలింగ్ స్టేషన్‌లు ఉన్నాయని.. ఇందుకోసం పదివేల ఈవీఎంలు, వివిఫ్యాట్‌లు అవసరం కానున్నాయన్నారు.

Lok Sabha Elections: ఓటెయ్యండి.. బంపర్ ఆఫర్స్ కొట్టేయండి.. వివరాలివే..


డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ ప్రారంభం అయిందని తెలిపారు. 45 వేల మంది సిబ్బంది రెండు స్థానాల కోసం పని చేయనున్నారని చెప్పారు. రెండు పార్లమెంట్ స్థానాల్లో 1050 అత్యంత సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించామన్నారు. వీటిపై మైక్రో అబ్సర్వర్లు , స్పెషల్ టీం , సెంట్రల్, స్టేట్ ఫోర్స్‌లతో మానిటరింగ్ ఉంటుందన్నారు. ప్రత్యేకంగా కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంపై స్పెషల్ ఫోకస్ పెట్టామన్నారు. ఈవీఎంలు సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటాయని జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ వెల్లడించారు.


ఇవి కూడా చదవండి..

Election 2024: ఓటు వేసేందుకు సెల్‌ఫోన్ తీసుకెళ్లొచ్చా.. మర్చిపోయి తీసుకెళ్తే ఎలా..?

Hyderabad: ఓట్ల పండుగేమో కానీ.. అక్కడ మాత్రం పెద్ద ఎత్తున ట్రాఫిక్.. బండి కదిలితే ఒట్టు..

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 12 , 2024 | 12:24 PM