Sago Rice: సగ్గుబియ్యం తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఇవే..
ABN , Publish Date - Aug 28 , 2024 | 07:29 AM
ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అలాంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. అయితే కొన్ని సీజనల్ వ్యాధులు అనేవి మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వస్తూనే ఉంటాయి. అయితే దీర్ఘకాలిక వ్యాధులు, ఇతర అనారోగ్య సమస్యలను మన జీవనశైలి, మంచి ఆహారం, వ్యాయామం ద్వారా దరి చేరకుండా చేయవచ్చు. అందుకే ప్రతి ఒక్కరూ పోషకాలు కలిగిన మంచి ఆహారాన్ని తీసుకోవాలి. అలాంటి కోవలోకి వచ్చేదే సగ్గుబియ్యం. సగ్గుబియ్యమే కదా అని తేలికగా తీసిపడేయెుద్దు. వాటిని రెగ్యులర్‌గా తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం..

సగ్గుబియ్యంతో ఇన్ని లాభాలా?
సగ్గుబియ్యంలో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ప్రోటీన్లు, కార్బోహైడ్రేడ్లు, కాల్షియం, విటమిన్ సితోపాటు విటమిన్ బి, జింక్, ప్రోటీన్, ఫోలేట్, ఫైబర్, ఐరన్ వంటి అనేక పోషకాలు సమృద్ధి ఉంటాయి. ఇవి మన శరీరానికి కావలసిన ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయి. వీటిని ఎలా తీసుకున్నా సరే మన శరీరానికి కావాల్సిన ఫుల్ ఎనర్జీ రావడం ఖాయం. సగ్గుబియ్యం తరచూ తీసుకోవడం వల్ల ఊబకాయం సమస్య నుంచి బయటపడొచ్చు. బరువు తగ్గాలనుకునే వారు రెగ్యులర్‌గా వీటిని తీసుకోవడం మంచిది. వీటిలో కొవ్వు పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయి. అందువల్ల శరీరంలో కొవ్వు శాతం అనేది తగ్గుతుంది. దీని ద్వారా ఊబకాయం సమస్య నుంచి బయటపడొచ్చు. అలాగే సగ్గుబియ్యాన్ని జావ చేసుకుని తాగడం వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది. అలాగే జీర్ణవ్యవస్థ పని తీరు మెరుగుపడుతుంది. అనేక జీర్ణక్రియ సమస్యలకు చెక్ పెట్టేందుకు ఇది ఔషధంలా పని చేస్తుంది.
సగ్గుబియ్యం ద్వారా మన శరీరానికి మంచి శక్తి వస్తుంది. వీటిలో ఉండే పోషకాలు కండరాలకు బలాన్ని చేకూరుస్తాయి. వీటిలో కాల్షియం శాతం ఎక్కువగా ఉండడం వల్ల బీపీ కంట్రోల్ అవుతుంది. చాలా మంది గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు గ్యాస్ పట్టినట్లు అనిపించినప్పుడు వీటిని తింటే ఉపశమనం లభిస్తుంది. మరీ ముఖ్యంగా విరేచనాల సమస్యకు ఇది మంచి మందుల పని చేస్తుంది. ఆ సమయంలో వీటిని తింటే తక్షణ ఉపశమనం లభిస్తుంది. జ్వరం వచ్చినప్పుడు ఇంట్లో అమ్మ మనకు సగ్గుబియ్యం జావగా కాచి ఇస్తుంటారు. అలా జావగా తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. సగ్గుబియ్యంలో ఉండే విటమిన్ కే మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. అది చురుకుగా పని చేసేలా చేస్తుంది. వీటిని తరచూ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చని ఆహార నిపుణులు(డైటీషియన్లు) చెప్తున్నారు.