Share News

Fruit Peels: పంగడల వేళ పండ్ల తొక్కలతో ముఖం నిగారింపు.. వివరాలు ఇవే..

ABN , Publish Date - Oct 12 , 2024 | 08:44 PM

దసరా, దీపావళి వంటి పండగలు వస్తున్నాయంటే చాలు.. ఆడవాళ్లు అందంగా రెడీ అయ్యేందుకు సిద్ధం అవుతారు. ఆ క్రమంలో వేల రూపాయలు బ్యూటీ పార్లర్‌కు వెచ్చిస్తుంటారు. అయితే అంత ఖర్చు చేయకుండా ఇంట్లోనే మీ శరీరాన్ని అందంగా మార్చుకోవచ్చు

Fruit Peels: పంగడల వేళ పండ్ల తొక్కలతో ముఖం నిగారింపు.. వివరాలు ఇవే..

ఇంటర్నెట్ డెస్క్: మనం ఆరోగ్యంగా ఉండేందుకు పండ్లు ఎంతో దోహదపడతాయి. వీటిలో అనేక రకాల పోషకాలు ఉండడం వల్ల తరచుగా తినాలని డాక్టర్లు సూచిస్తుంటారు. వీటిలోని విటమిన్లు, ఇతర పోషకాలు శరీరానికి కావాల్సిన పదార్థాలను అందించి ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడతాయి. అయితే పండ్లే కాదు.. వాటి తొక్కల వల్ల కూడా ఎంతో ఉపయోగం ఉంటుందని మీకు తెలుసా. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..


దసరా, దీపావళి వంటి పండగలు వస్తున్నాయంటే చాలు.. ఆడవాళ్లు అందంగా రెడీ అయ్యేందుకు సిద్ధం అవుతారు. ఆ క్రమంలో వేల రూపాయలు బ్యూటీ పార్లర్‌కు వెచ్చిస్తుంటారు. అయితే అంత ఖర్చు చేయకుండా ఇంట్లోనే మీ శరీరాన్ని అందంగా మార్చుకోవచ్చు. కొన్ని రకాల పండ్ల తొక్కలతో శరీర నిగారింపు పెంచుకోవచ్చు. బ్యూటీ పార్లర్‌కి వెళ్లిన దాని కంటే శరీరం మెరుగ్గా కనిపించేందుకు అనేక రకాల పండ్ల తొక్కలు ఉపయోగపడతాయి. వాటితో ప్యాక్ వేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. పండ్ల తొక్కల్లో ఉండే పోషకాలు చర్మానికి మంచి గుణాలు అందించి అందంగా కనిపించేలా చేస్తాయి.


ఇవి ట్రై చేయండి..

  • బొప్పాయి పండు తొక్కలో అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీని తొక్కలో పపైన్ అనే పదార్థం ఉంటుంది. దీన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మం మృదువుగా మారుతుంది. అలాగే చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అనేక గుణాలు దీనిలో ఉంటాయి.

  • ఆరెంజ్ పండ్లు తిన్న తర్వాత వాటి తొక్కలను పడేయకండి. వాటిని బాగా ఎండపెట్టి పొడిగా తయారు చేసుకోండి. అలా చేసిన పొడిని నీరు లేదా పాలలో కలిపి ప్రతి రోజూ ముఖానికి అప్లై చేయండి. అలా చేయడం వల్ల కొలాజిన్ ఉత్పత్తి పెరిగి ముఖం కళకళలాడే మెరుపును సంతరించుకుంటుంది. అలాగే ముఖంపై ఉన్న మృత కణాలు అన్ని తొలగిపోతాయి.

  • ఇక నిమ్మ తొక్క విషయానికి వస్తే ఇందులో సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల చర్మంపై ఉండే జిడ్డు తొలగిపోతుంది. అలాగే మీ చర్మానికి మరింత నిగారింపు ఇస్తుంది.

  • చర్మం పొడిబారకుండా ఉండేందుకు అరటిపండు తొక్క బాగా ఉపయోగపడుతుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. చర్మం పొడి బారకుండా తేమగా ఉండేందుకు, నిగారింపు పెంచేందుకు అరటిపండు తొక్క ఎంతగానో ఉపయోగపడుతుంది.

  • యాపిల్ తొక్కలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. తరచుగా ముఖం లేదా చర్మంపై దీన్ని రాయడం వల్ల ముడతలు తగ్గుతాయి. అలాగే చర్మం నిగారింపు పెరుగుతుంది.

  • నారింజ పండు తొక్కలో చర్మ నిగారింపు కోసం ఉపయోగపడే అనేక పోషకాలు ఉంటాయి. చర్మంలో కొలాజిన్ ఉత్పత్తి చేసే ఎన్నో గుణాలు దీనిలో ఉంటాయి. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరిచే విటమిన్ సి నారింజ పండు తొక్కలో పుష్కలంగా ఉంటుంది.

Updated Date - Oct 13 , 2024 | 03:05 PM