Share News

Bangladesh: బంగ్లాదేశ్‌లో రచ్చ రచ్చ.. భారతీయులకు కీలక సూచనలు జారీ

ABN , Publish Date - Jul 18 , 2024 | 01:39 PM

బంగ్లాదేశ్‌లో ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతోంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా నిరసనకారులు రోడ్లపైకి వచ్చారు. దీంతో పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు కూడా మూతపడ్డాయి. హింసాత్మక ఘటనల నేపథ్యంలో భారత రాయబార కార్యాలయం అప్రమత్తమైంది. బంగ్లాదేశ్‌లో ఉన్న భారతీయులకు రాయబార కార్యాలయం కీలక సూచనలు జారీ చేసింది.

Bangladesh: బంగ్లాదేశ్‌లో రచ్చ రచ్చ.. భారతీయులకు కీలక సూచనలు జారీ
tension alert Bangladesh

ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లను(reservations) రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బంగ్లాదేశ్‌లో(Bangladesh) జరిగిన అల్లర్ల కారణంగా పాఠశాలలు, కళాశాలలు సహా కార్యాలయాలు మూసివేయబడ్డాయి. దీంతో బంగ్లాదేశ్‌ వ్యాప్తంగా అనేక చోట్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌లోని భారత రాయబార కార్యాలయం భారతీయ ప్రజలకు, అక్కడ నివసిస్తున్న భారతీయ విద్యార్థులకు ప్రయాణాలకు దూరంగా ఉండాలని, ఇళ్ల నుంచి బయటకు వెళ్లవద్దని సూచనలు జారీ చేసింది.

అంతేకాదు ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో సహాయం అవసరమైతే, వెంటనే భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని కార్యాలయం ఒక సలహాను జారీ చేసింది. అందుకోసం కొన్ని నంబర్లను కూడా ప్రకటించింది. ఈ నంబర్లు 24 గంటలు పనిచేస్తాయని వెల్లడించింది.


సహాయం కోసం ఈ నంబర్‌లకు కాల్ లేదా మెసేజ్ చేయాలని తెలిపింది

  • ఇండియన్ హైకమిషన్, ఢాకా +880-1937400591 (వాట్సాప్‌ కూడా)

  • అసిస్టెంట్ హైకమిషన్ ఆఫ్ ఇండియా, చిట్టగాంగ్ +880-1814654797 / +880-1814654799 (వాట్సాప్‌ కూడా)

  • అసిస్టెంట్ హైకమిషన్ ఆఫ్ ఇండియా, రాజ్‌షాహి +880-1788148696 (వాట్సాప్‌ కూడా)

  • అసిస్టెంట్ హైకమిషన్ ఆఫ్ ఇండియా, సిల్హెట్ +880-1313076411 (వాట్సాప్‌ కూడా)

  • అసిస్టెంట్ హైకమిషన్ ఆఫ్ ఇండియా, ఖుల్నా +880-1812817799 (వాట్సాప్‌ కూడా)

ఇది కూడా చదవండి:

Budget 2024: బడ్జెట్‌ 2024 నేపథ్యంలో పెరగనున్న స్టాక్స్ ఇవే..!


ఇప్పటికే ఆరుగురు మృతి

వాస్తవానికి రిజర్వేషన్ల విషయంలో గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్‌లో నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ అల్లర్లలో(protest) ఇప్పటివరకు ఆరుగురికి పైగా మరణించారు. అయితే ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లు రద్దు చేయాలంటూ ఈ నిరసనలు జరుగుతున్నాయి. 1971 యుద్ధంలో పోరాడిన సైనికుల పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు రద్దు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఢాకా ట్రిబ్యూన్ నివేదిక ప్రకారం బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు వారం రోజుల క్రితం ఈ రిజర్వేషన్‌ను నిషేధించింది.

కానీ ప్రధాని షేక్ హసీనా దీనిని అమలు చేయడానికి అనుమతించలేదు. దీనిపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బంగ్లాదేశ్‌లో యుద్ధ వీరుల పిల్లలకు 30% ఉద్యోగాలు కేటాయించబడ్డాయి. మెరిట్‌ ఆధారంగానే ఉద్యోగాలు కల్పించాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

Budget 2024: బడ్జెట్‌ 2024 నేపథ్యంలో పెరగనున్న స్టాక్స్ ఇవే..!


ITR Filing 2024: ఐటీఆర్ ఫైలింగ్.. మీ ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఇలా ధృవీకరించుకోండి

Budget 2024: బడ్జెట్‌ 2024లో ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త..!

రియల్టీలోకి పీఈ పెట్టుబడులు రూ.25,000 కోట్లు

Read Latest International News and Telugu News

Updated Date - Jul 18 , 2024 | 01:45 PM