Share News

Breaking News: నేటి తాజా వార్తలు..

ABN , First Publish Date - Jul 18 , 2024 | 11:36 AM

Telugu Latest News Live Updates: ప్రపంచ నలుమూల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్.. ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. మినిట్ టు మినిట్ తాజా వార్తలను ఇక సులభంగా తెలుసుకోవచ్చు. మీకోసమేు ప్రత్యేకంగా లైవ్ అప్‌డేట్స్ ప్లాట్‌ఫామ్.. సమస్త సమాచారం ఇక్కడే చూసేయండి.

Breaking News: నేటి తాజా వార్తలు..
Breaking News

Live News & Update

  • 2024-07-18T18:36:51+05:30

    ఏం టాలెంట్ భయ్యా ఇదీ.. వీడియో చూస్తే నోరెళ్ల బెడతారు..

    చేపలు పట్టాలంటే చాలా ఓర్పు, టాలెంట్ ఉండాలి. అందుకు తగిన సామాగ్రి కూడా ఉండాలి. కానీ, ఓ వ్యక్తి మాత్రం తన వద్ద ఏం లేకుండానే.. కేవలం స్ట్రాని ఉపయోగించి చేతులతో పెద్ద పెద్ద చేపలను ఈజీగా పట్టేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. వీడియోను చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. చేపలు పట్టడంలో పీహెచ్‌డీ చేసినట్లున్నాడంటూ కామెంట్స్ పెడుతున్నారు.

  • 2024-07-18T18:24:31+05:30

    రుణమాఫీపై సంతోషం వ్యక్తం చేసిన సీఎం రేవంత్

    revanth reddy.jpg

    • రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల రైతులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.

    • రుణమాఫీపై సంతోషం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి.

    • రైతు రుణమాఫీ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ పాయింట్స్.

    • గొప్ప కార్యక్రమంలో పాల్గొని దేశానికి ఆదర్శంగా నిలబడే అవకాశం తెలంగాణ ప్రజలు ఇచ్చారు.

    • మంత్రివర్గ సహచరులు, అధికారుల సహకారంతో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం.

    • కాంగ్రెస్ మాట ఇస్తే శిలా శాసనమని మరోసారి నిరూపణ అయింది.

    • నాడు కరీంనగర్ లో సోనియా గాంధీ తెలంగాణ ప్రజల ఆకాంక్ష నాకు తెలుసని మాట ఇచ్చారు.

    • పార్టీకి తీరని నష్టం జరుగుతుందని తెలిసినా మాట తప్పని, మడమ తిప్పని నాయకురాలిగా తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా ఇచ్చారు.

    • తెలంగాణ ప్రజలు శాశ్వతంగా గుర్తుపెట్టుకునేలా సోనియా రాష్ట్రాన్ని  ఇచ్చారు.

    • గత పాలకులు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి రెండు సార్లు మాట తప్పారు.

    • మొదటి ఐదేళ్లలో కేసీఆర్ రూ. 16 వేల కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పి రూ. 12 వేల కోట్లు మాత్రమే ఇచ్చారు.

    • రెండో సారి ప్రభుత్వంలో రూ. 12 వేల కోట్లని కేవలం రూ. 9 వేల కోట్లు మాత్రమే చెల్లించారు.

    • పదేళ్లలో రూ. 21 వేల కోట్ల రూపాయలు కూడా రుణమాఫీకి కేసీఆర్ చెల్లించలేదు.

    • రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉన్నా కేసీఆర్ ప్రజలకిచ్చిన మాటను నెరవేర్చలేదు.

    • మే 6, 2022 న వరంగల్‌లో లక్షలాది మంది రైతుల సమక్షంలో రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ ప్రకటించారు.

    • సెప్టెంబర్ 17, 20023లో తుక్కుగూడాలో సోనియా గాంధీ ఆరు గ్యారెంటీలను ప్రకటించారు.

    • రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఆనాడు సోనియా గాంధీ మాట ఇచ్చారు.

    • సచివాలయంలో కూర్చొని ధైర్యంగా తెలంగాణ రైతులకు రూ. 6,098 కోట్ల రూపాయలను రుణమాఫీ ఖాతాల్లో జమ చేస్తున్నాం.

    • రుణమాఫీకి సహకరించిన మంత్రులు, అధికారులకు రైతాంగం తరుపున ధన్యవాదాలు చెప్తున్న.

    • నా 16 ఏళ్ల రాజకీయ ప్రయాణంలో మరుపురాని రోజు ఇది.

    • రుణమాఫీ చేసే భాగ్యం నాకు కలిగింది.

    • కేసీఆర్ కటాఫ్ పెట్టిన తేదీ మరునాటి నుంచే రుణమాఫీ అమలు చేస్తున్నాం.

    • తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేసిన సోనియా గాంధీ పుట్టిన రోజు డిసెంబర్ 9 వరకు రుణమాఫీ కటాఫ్‌గా పెట్టాం.

    • ఏ అవాంతరాలు లేకుండా రుణమాఫీ పూర్తి చేస్తాం.

    • లక్ష లోపు రుణం ఉన్న రైతులకు ఈ రోజు రుణ విముక్తి కల్పించాం.

    • లక్ష నుంచి లక్షన్నర రుణం ఉన్న రైతులకు త్వరలోనే రుణ విముక్తి కలుగుతుంది.

    • ఆగస్టు నెల పూర్తి కాకముందే రూ.31 వేల కోట్ల రుణమాఫీ చేసి తీరుతం.

    • కొంత మంది రైతు రుణమాఫీకి రేషన్ కార్డు ఉండాలనే అపోహ సృష్టిస్తున్నారు.

    • రైతు రుణమాఫీకి రేషన్ కార్డు ప్రాతిపదిక కాదు.

    • రుణమాఫీకి పాస్ బుక్‌నే కొలబద్ద తప్ప రేషన్ కార్డు కాదు.

    • దొంగలు చెప్పే దొంగ మాటలను నమ్మోద్దు.

    • ప్రతి రైతు రుణమాఫీకి కావాల్సిన చర్యలు చేపడుతున్నాం.

    • సమస్యలు తలెత్తితే బ్యాంక్ అధికారులను సంప్రదించాలి.

    • బ్యాంకు అధికారులు రైతులకు అవగాహన కల్పించాలి.

    • వ్యవసాయ శాఖ అధికారులు రైతు రుణమాఫీకి అన్ని ఏర్పాట్లు చేయాలి.

    • వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల స్వయంగా రైతు.

    • ఆర్థిక మంత్రిగా భట్టి విక్రమార్క రుణమాఫీ కోసం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రయత్నం చేశారు.

    • గత ప్రభుత్వంలో ఉద్యోగులకు జీతాలు కూడా సరిగా ఇవ్వలేదు.

    • మా ప్రభుత్వం ఒకటో తారీఖున జీతాలు ఇస్తోంది.

    • సంక్షేమ కార్యక్రమాలకు ఏడు నెలల్లో రూ. 29 వేల కోట్లు ఖర్చు చేశాం.

    • గత ప్రభుత్వం అప్పులకు మిత్తిగా ప్రతి నెలా ఏడు వేల కోట్లు చెల్లిస్తున్నాం.

    • రైతు రుణమాఫీ దేశానికి తెలంగాణ మోడల్ ఆదర్శంగా ఉండబోతుంది.

    • ఎనిమిది నెలల్లో రుణమాఫీ హామీని నెరవేర్చి దేశంలోనే తలెత్తుకునేలా ఉన్నాం.

    • సవాల్ చేసిన ఆయనను రాజీనామా చేయమని మేం అడగం.

    • ఇప్పటికైనా గాంధీ కుటుంబం మాట ఇస్తే తప్పదని వారు గుర్తుపెట్టుకోవాలి.

    • సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే కి ధన్యవాదాలు తెలుపుతు తీర్మానం చేశాం.

    • రైతు రుణమాఫీ సందర్భంగా రాహుల్ గాంధీని ఆహ్వానించి వరంగల్‌లో బహిరంగ సభ నిర్వహిస్తాం.

    • త్వరలో మంత్రివర్గ సహచరులతో కలిసి ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీని ఆహ్వానిస్తాం.

  • 2024-07-18T18:10:59+05:30

    ఈ చిన్న ట్రిక్ తెలియక ఎంత మంది ఇబ్బంది పడుతున్నారో..!

    ప్రస్తుతం కాలంలో బైక్ లేని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఇంటికి కనీసం ఒక బైక్ అయినా ఖచ్చితంగా ఉంటుంది. అయితే, చాలా మంది బైక్ నడుపుతారు కానీ.. ఒక విషయంలో ఇబ్బంది పడుతారు. అదే డబుల్ స్టాండ్. సింగిల్ స్టాండ్ ఈజీగా వేయొచ్చు. కానీ, డబుల్ స్టాండ్ వేయాలంటే కాస్త తెలివిగా వేయాలి. లేదంగా బలం అంతా ప్రదర్శించి.. బండిని పైకి లేపి మరీ వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అలాంటి రిస్క్ లేకుండా ఉండేందుకు అద్భుతమైన, ఈజీ ట్రిక్‌ను మీ ముందుకు తీసుకువస్తున్నాం. మీ వద్ద బైక్ ఉంటే.. ఆ బైక్‌ డబుల్ స్టాండ్‌ని ఇలా ఈజీగా వేసేయండి. మరెందుకు ఆలస్యం.. వీడియోను చూసేయండి.

  • 2024-07-18T17:08:21+05:30

    రైలు ప్రమాదంలో ఇద్దరు మృతి.. మరికొందరికి గాయాలు..

    ఉత్తరప్రదేశ్‌లో జరిగిన రైలు ప్రమాదంలో ఇద్దరు ప్రయాణికులు చనిపోగా.. కొందరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

  • 2024-07-18T17:05:09+05:30

    వినుకొండ హత్యకు వ్యక్తిగత కక్షలే కారణ: ఐజీ త్రిపాఠి

    • పల్నాడు: వినుకొండలో పర్యటించిన గుంటూరు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠి

    • వినుకొండ ఘటనకు సంబంధించి మృతుడు, నిందితుడు మధ్య వ్యక్తిగత కక్షలు ఉన్నాయి.

    • రషీద్, జిలాని ఇద్దరికీ నేర చరిత్ర ఉంది.

    • ఇద్దరిపై గతంలో కేసులు కూడా ఉన్నాయి.

    • ఈ హత్యకు సంబంధించి నిందితులు ఎవరైనా కఠినంగా శిక్షిస్తాం.

    • ప్రధాన నిందితుడు జిలానిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు.

    • శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరు వ్యవహరించినా కఠిన చర్యలు తప్పవు.

  • 2024-07-18T16:45:13+05:30

    రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

    • ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణ మాఫీ చేస్తున్న సందర్భంగా సెక్రటేరియట్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటోకి పాలాభిషేకం చేసి అక్కడే వేల కిలోల కూరగాయల పంపిన చేపట్టిన తెలంగాణ పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షుడు చింపుల సత్యనారాయణ రెడ్డి, ఇతర సిబ్బంది.

    • నిర్మల్: రుణ మాఫీని స్వాగతిస్తూ ఖానాపూర్ మండల కేంద్రంలో రైతుల సంబురాలు, భారీ ర్యాలీ.

    • రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో రైతుల సంబరాలు.

    • సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న రైతులు.

  • 2024-07-18T16:42:51+05:30

    రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

    • హైదరాబాద్: సచివాలయంలో రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి.

    • రుణమాఫీ పొందిన వివిధ జిల్లాల రైతులతో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి ముఖాముఖి.

    • కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి సలహా దారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహా దారు కె కేశవరావు, సీఎస్ శాంతి కుమారి, ఉన్నతాధికారులు.

  • 2024-07-18T16:30:40+05:30

    కొడిసేల వాగులో కొట్టుకుపోయిన కారు.. ఐదుగురు గల్లంతు..

    Floods.jpg

    • ఏలూరు: వేలేరుపాడు మండలం అల్లూరి నగర్ మాధారం మధ్య కొడిసేలా వాగు ప్రవాహంలో కొట్టుకు పోయిన కారు.

    • కారులో అయిదుగురు ఉన్నట్లు సమాచారం.

    • గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు.

    • ఏలూరు జిల్లాలో వాగులో కారు కొట్టుకుపోయిన ఘటనపై సహాయ చర్యలకు దిగిన ప్రభుత్వం.

    • ముఖ్యమంత్రి సూచన మేరకు జిల్లా కలెక్టర్, ఎన్డీఆర్ఎఫ్ ఉన్నతాధికారులు, ఇతర శాఖల అధికారులతో మాట్లాడిన సీఎం కార్యాలయ అధికారులు.

    • ఘటన జరిగిన ప్రాంతానికి సహాయక బృందాలను తక్షణమే పంపి ప్రమాదంలో చిక్కుకున్న వారిని కాపాడాలని ఆదేశం.

    • హెలికాఫ్టర్ తెప్పించి ప్రమాదంలో ఉన్న కుటుంబాన్ని కాపాడాలని ఆదేశం.

    • గల్లంతయిన వారు.. శింగవరపు జ్యోతి (50), గడ్డం సాయి కుమారి (30), గడ్డం కుందనకుమార్ (11), గడ్డం జగదీష్ కుమార్ (08) రామారావు (డ్రైవర్).

    • రాజమండ్రి నుంచి వేలేరుపాడు వెళుతుండగా ప్రమాదం.

    • గల్లంతయిన వారిలో శింగవరపు జ్యోతి, డ్రైవర్ రామారావుల స్వస్థలం రాజమండ్రి.

    • సాయికుమారి, ఆమె ఇద్ధరు కొడుకులు వేలేరుపాడు మండలం రుద్రంకోటకు చెందిన వారు.

  • 2024-07-18T16:14:01+05:30

    విజయసాయి కుటుంబంపై మంత్రి ఆనం సంచలన కామెంట్స్..

    anam.jpg

    • నెల్లూరు: ఏబీఎన్‌తో ఏపీ దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కామెంట్స్.

    • విజయసాయి‌ కుటుంబమే నేర చరిత్ర కలిగిన కుటుంబం.

    • దేశమంతా స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న రోజుల్లో విజయసాయి తండ్రి, పెద్దనాన్న, చిన్నాన్న ఆస్థికోసం కన్న తండ్రినే హతమార్చారు.

    • ఆ కేసులో విజయసాయి తండ్రి ఏ-2.‌

    • కోర్టు శిక్ష కూడా విధించింది.

    • విజయసాయి నెల్లూరోడినని చెబుతుంటే నెల్లూరోళ్లకి సిగ్గుపోతుంది.

    • ఆయనస్సలు నెల్లూరోడే కాదు.

    • విజయసాయికి పెళ్లికాక ముందే, వారి కుటుంబం చెన్నైకి వలసపోయింది.

    • ఇసుక, గ్రావెల్, క్వార్ట్జ్, సిలికా వంటి సహజవనరులు పెద్ద ఎత్తున దోపిడీ జరిగింది.

    • సీఎం చంద్రబాబు వైసీపీ అక్రమాలపై సమీక్షించారు.

    • విచారణలో బయటపడే అంశాలను బట్టి అక్రమార్కులపై గట్టి చర్యలే ఉంటాయి.

  • 2024-07-18T16:10:48+05:30

    ఉదృతంగా ప్రవహిస్తున్న కొండ వాగు

    • ఏలూరు: కొయ్యలగూడెం మండలం కన్నాపురం వద్ద ఉదృతంగా ప్రవహిస్తున్న కొండ వాగు.

    • జంగారెడ్డిగూడెం మండలం పట్టెన్నపాలె వద్ద ఉదృతంగా ప్రవహిస్తున్న జల్లేరు వాగు.

    • సుమారు 19 గిరిజన గ్రామాలకి నిలిచిన రాకపోకలు.

    • జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం ఎర్ర కాలువ ప్రాజెక్టుకు పెరిగిన వరద నీరు.

    • ప్రాజెక్టు నాలుగు గేట్లలో రెండు గేట్లు ఎత్తి 1500 క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల.

  • 2024-07-18T16:07:40+05:30

    ఆగష్టు 15న అన్న క్యాంటిన్లు ప్రారంభం: మంత్రి నారాయణ

    narayana1.jpg

    • అమరావతి: ఆగస్టు 15 న అన్న క్యాంటీన్లు ప్రారంభించనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు.

    • గతంలో ప్రారంభించిన 183 అన్న క్యాంటీన్లను ఆగస్టు 10 నాటికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

    • మొత్తం 203 క్యాంటీన్ లను తెరుస్తాం.

    • రాష్ట్ర వ్యాప్తంగా అన్ని క్యాంటీన్లు ఒకేవిధంగా ఉండేలా డిజైన్ చేశాం.

    • అన్న క్యాంటీన్‌లో ఫుడ్ విషయంలో ఈ సారి టెండర్లు పిలిచాము.

    • గత ప్రభుత్వం కక్ష సాధింపుతో అన్న క్యాంటీన్లు మూసివేసింది.

    • అన్న క్యాంటీన్లను నిర్వీర్యం చేసింది.

    • ఇటీవల పిడుగురాళ్లలో డయేరియా కేసులు వచ్చాయి.

    • రాష్ట్రంలో ఉన్న 17 మున్సిపల్ కార్పొరేషన్లు మినహా మిగతా 106 ULB లకు రూ. 50 కోట్లు విడుదల చేశాం.

    • డ్రైన్‌లలో పూడిక తీత, కోసం మాత్రమే ఈ నిధులు ఉపయోగించాలి.

    • గత ప్రభుత్వం మున్సిపాలిటీల సాధారణ నిధులను కూడా ఇతర అవసరాలకు వాడేసింది.

    • దీంతో మున్సిపల్ శాఖ ఖజానా ఖాళీ అయిపోయింది.

    • చెత్త పన్నుపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.

  • 2024-07-18T16:03:16+05:30

    కన్నతల్లిపైనే కన్నేశాడు.. చివరకు కాటికి చేరాడు..

    death.jpg

    • కృష్ణా జిల్లా -పామర్రు పమిడిముక్కల పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగిన హత్యకేసును పోలీసులు చేధించారు.

    • ఈ కేసుపై ప్రెస్ మీట్ నిర్వహించిన సిఐ కిషోర్ బాబు, ఎస్ఐ శ్రీనివాస్.

    • 24 గంటల్లో హత్య కేసును చేదించిన పోలీసులు.

    • పమిడిముక్కల(మ) తాడంకి మర్డర్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది.

    • వేధింపులు తాళలేక తనయుడిని పచ్చడి బండతో తలపై మోది హత్య చేసిన తల్లి.

    • తాగిన మత్తులో పలుమార్లు తల్లితో అసభ్యంగా ప్రవర్తించిన కుమారుడు గండికోట రాంబాబు.

    • కొడుకు చేష్టలతో విసిగిపోయిన తల్లి ఆ కీచకుడిని అంతమొందించినట్లు వెల్లడి.

    • మొన్న రాత్రి కూడా పలుమార్లు తల్లిని ఇబ్బంది పెట్టిన రాంబాబు.

    • తల్లి పద్మను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించినట్టు చెప్పిన సీఐ కిషోర్ బాబు.

  • 2024-07-18T15:48:25+05:30

    ఉత్తరప్రదేశ్‌లో రైలు ప్రమాదం..

    • ఉత్తరప్రదేశ్ గొండాలో రైలు ప్రమాదం.

    • పట్టాలు తప్పిన 15904 చండీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్‌.

    • పట్టాలు తప్పిన 12 కోచ్‌లు.

    • ఝిలాహి రైల్వే స్టేషన్‌కు సమీపంలో చోటు చేసుకున్న ప్రమాదం.

    • సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించిన యూపీ సీఎం ఆదిత్యనాథ్.

    • ప్రమాదానికి గల కారణాలపై విచారణకి ఆదేశించిన రైల్వే శాఖ.

  • 2024-07-18T15:45:48+05:30

    కవితకు వైద్య పరీక్షలకు కోర్టు గ్రీన్ సిగ్నల్..

    • లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ట్రయల్ కోర్టు అనుమతించింది.

    • ఎయిమ్స్‌లో కవితకు వైద్య పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశం.

    • పరీక్షలు అనంతరం నివేదికను కోర్టుకు అందించాలి.

    • ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యూడిషల్ కస్టడీ 22 వరకు పొడిగించింది.

    • వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవితను కోర్టుకు హాజరు పరిచిన జైలు అధికారులు.

    • తనకు ఎదురవుతున్న ఆరోగ్య సమస్యలను, పరీక్ష ఫలితాల్లో వ్యత్యాసాలను న్యాయమూర్తి దృష్టికి తెచ్చిన కవిత.

    • అస్వస్థత కారణంగా ఇటీవలే దీన్ దయాళ్ ఆసుపత్రిలో కవితకు పరీక్షలు.

    • ఈరోజు విచారణ సందర్భంగా ప్రైవేట్ ఆస్పత్రిలో చెకప్ కోసం దరఖాస్తు చేసిన కవిత తరపున న్యాయవాదులు.

    • ఎయిమ్స్‌లో పరీక్షలకు కోర్టు ఆదేశం.

  • 2024-07-18T15:38:22+05:30

    జిల్లాల వారీగా రుణమాఫీ వివరాలు..

    9CROP.jpg

    • నల్గొండ - రూ. 454.49 కోట్లు.

    • సిద్దిపేట - రూ. 290.24 కోట్లు.

    • సూర్యాపేట - రూ. 282.98 కోట్లు.

    • సంగారెడ్డి - రూ. 279.62 కోట్లు.

    • నగర్ కర్నూల్ - రూ. 270.05 కోట్లు.

    • ఖమ్మం - రూ. 264.23 కోట్లు.

    • వికారాబాద్ - రూ. 259.33 కోట్లు.

    • రంగారెడ్డి - 258 కోట్ల 19 లక్షలు.

    • మెదక్ - 241.82 కోట్లు.

    • కామారెడ్డి - రూ. 233.41 కోట్లు.

    • నిజామాబాద్ - రూ. 255.62 కోట్లు.

    • మహముబ్ నగర్ - రూ. 211.15 కోట్లు.

    • జగిత్యాల - రూ. 207.93 కోట్లు.

    • యాదాద్రి- భువనగిరి - రూ. 203.82 కోట్లు.

    • కరీంనగర్ - రూ. 174.64 కోట్లు.

    • నిర్మల్ - రూ. 171.77 కోట్లు.

    • నారాయణ పెట్ - రూ. 165.64 కోట్లు.

    • మహబూబాబాద్ - రూ. 159.63 కోట్లు.

    • జనగామ - రూ. 149.69 కోట్లు.

    • పెద్దపల్లి - రూ. 149.43 కోట్లు.

    • హన్మకొండ - రూ. 145 కోట్లు.

    • గద్వాల్ - రూ. 144.09 కోట్లు.

    • సిరిసిల్ల - రూ. 136.36 కోట్లు.

    • వరంగల్ - రూ. 134.21 కోట్లు.

    • భద్రాద్రి కొత్తగూడెం- రూ. 132.07 కోట్లు.

    • ఆసిఫాబాద్ - రూ. 125.20 కోట్లు.

    • ఆదిలాబాద్ - రూ. 120.79 కోట్లు.

    • భూపాలపల్లి - రూ. 94.86 కోట్లు.

    • ములుగు - రూ. 69.97 కోట్లు.

    • మేడ్చల్ - రూ. 12.53 కోట్లు.

  • 2024-07-18T15:27:28+05:30

    వినుకొండకు వైఎస్ జగన్..

    ys-jagan.jpg

    • పల్నాడు: వైసీపీ అధినేత వైఎస్ జగన్ వినుకొండలో పర్యటించనున్నారు.

    • శుక్రవారం ఉదయం వినుకొండకు మాజీ సీఎం జగన్ వెళ్తారు.

    • బాధితుడు రషీద్ కుటుంబాన్ని జగన్ పరామర్శించనున్నారు.

    • వినుకొండలో వైసీపీ నేత రషీద్ హత్య నేపథ్యంలో వైసీపీ నేతలు బాధితుడి కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు.

    • బొల్లా బ్రహ్మ నాయుడు, గోపిరెడ్డి, కాసు మహేష్ రెడ్డి, లేళ్ళ అప్పిరెడ్డి, మర్రి రాజశేఖర్, కావటి మనోహర్ నాయుడు మరికొందరు నాయకులు హత్యకు గురైన రషీద్ మృతదేహానికి నివాళులు అర్పిస్తున్నారు.

  • 2024-07-18T15:12:05+05:30

    వైసీపీ భూతానికి చంద్రబాబు సమాధి కట్టారు: మహాసేన రాజేష్

    • వైసీపీ భూతానికి చంద్రబాబు సమాధి కట్టారు

    • అరుంధతి సినిమాలో పశుపతిలా.. సమాధి నుండి వైసీపీ ఫేక్ ప్రచారాలు చేస్తోంది.

    • కూటమి ప్రభుత్వాన్ని ఇరికించేందుకు కుట్రలు చేస్తున్నారు.

    • హత్యలు, అరాచకాలంటూ అబద్దాలు ఆడుతున్నారు.

    • వైసీపీ నేతలే విషం పెట్టి.. కూటమిపై నెట్టేస్తారు.

    • గత ఐదేళ్లలో వైసీపీ అరాచకాలకు, హత్యలకు అడ్డు అదుపు లేదు.

    • సమాధిలో ఉన్న వైసీపీ భూతాలను బయటికి రానిస్తే ప్రజల రక్తం తాగుతాయి.

    • ఏపీని స్మశానం చేయడానికే వైసీపీ తప్పుడు ప్రచారానికి పూనుకుంది.

    • వైసీపీ హయాంలో 600 మంది ఎస్సీ, బీసీ, మైనార్టీలను చంపారు.

    • నేడు రాష్ట్ర ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నారు.

    • ప్రజల్లో కూటమి వస్తున్న క్రెడిట్ ను చూసి ఓర్వలేకనే విమర్శలు.

    • వైసీపీ ఫేక్ ప్రచారాన్ని ప్రజలే తిప్పి కొట్టాలి.

  • 2024-07-18T13:53:33+05:30

    హనుమకొండ: ప్రభుత్వ ప్రసూతీ ఆస్పత్రిలో గందరగోళం

    • ప్రభుత్వ ప్రసూతి హాస్పిటల్‌లో గందరగోళం

    • తనకు కొడుకు పుడితే, చనిపోయిన ఆడ శిశువును ఇచ్చారని తల్లిదండ్రుల ఆరోపణ.

    • తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యుల డిమాండ్.

    • పెళ్లి అయిన ఏడేళ్ల తరువాత కాన్పు అయ్యిందని.. ప్రభుత్వ హాస్పిటల్‌కు వస్తే ఇలా మోసం చేసారని ఆవేదన వ్యక్తం చేశారు.

    • కుటుంబ సభ్యులకు ముందుగానే సమాచారం ఇచ్చామని వైద్యులు చెబుతున్నారు.

    • బాధితులకు అనుమానం ఉంటే డిఎన్‌ఏ టెస్ట్ కైనా సిద్ధమని సూపరిండెంట్ విజయ్ లక్ష్మి తెలిపారు.

  • 2024-07-18T13:31:14+05:30

    లవర్‌తో భర్త.. అది చూసిన భార్య ఏం చేసిందంటే..

    విశాఖలో ఓ భార్య.. తన భర్త వివేక్‌ మరో మహిళతో ఉండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుంది. వారిద్దరినీ చితక్కొట్టింది. సీతమ్మదారలో ఓ గదిలో తన భర్త, అతని ప్రియురాలు ఉండగా బంధువుల సహాయంతో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ముందు భర్తను, ఆ తరువాత అతని ప్రియురాలిని పొట్టు పొట్టుగా కొట్టింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

  • 2024-07-18T12:58:08+05:30

    'Wagh Nakh': ఛత్రపతి శివాజీ వాడిన ఆయుధం వచ్చేసింది..

    Chhatrapati Shivaji's 'Wagh Nakh': బీజపూర్ సేనాధిపతి అఫ్జల్‌ఖాన్‌ను చంపేందుకు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఉపయోగించిన ఆయుధం ‘వాఘ్‌ నఖ్‌’ ఇండియాకు వచ్చేసింది. పులి గోర్ల మాదిరిగా ఉండే ఈ ఆయుధంతోనే అప్జల్ ఖాన్‌ను హతమార్చాడు ఛత్రపతి శివాజీ. ఈ ఆయుధం ఇంతకాలం లండన్‌లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో ఉండగా.. భారత ప్రభుత్వ చొరవతో ఇది ఇండియాకు వచ్చేసింది. జులై 19వ తేదీ నుంచి ఈ వాఘ్‌ నఖ్‌ను ప్రజల సందర్శన కోసం అందుబాటులో ఉంచనుంది మహారాష్ట్ర ప్రభుత్వం. సతారాలోని శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ మ్యూజియం, నాగ్‌పూర్‌లోని సెంట్రల్ మ్యూజియం, కొల్హాపూర్‌లోని లక్ష్మీ విలాస్ ప్యాలెస్, ముంబైలోని CSMVS నాలుగు మ్యూజియంలలో వాఘ్ నఖ్ ప్రదర్శించనున్నారు.

  • 2024-07-18T12:44:58+05:30

    పూరీ రత్నభండార్ 3వ గదిలో ఏముంది? తాళాలు పగలగొట్టి మరీ..

    • పూరీ: గజపతి మహారాజ్ దివ్యసింగ్ దేవ్ కామెంట్స్..

    • బయట రత్నబండార్ తాళాలు ఉన్నాయి.

    • లోపలి మూడవ గది తాళాలు పగలగొట్టడం జరిగింది.

    • సంపద భద్రపరచిన స్ర్టాంగ్ రూమ్.. సీసీటీవీ నియంత్రణలో ఉంటుంది.

    • సరికొత్త లాక్ ఏర్పాటు చేశాము.

    • శ్రీ జగన్నాథ్ స్వామి అస్తానానికి ఉన్న మాదిరి తాళాలు ఏర్పటు చేస్తాం.

    • పూరీ జగన్నాధ ఆలయ కమిటీ, ప్రభుత్వం ఆధ్వర్యంలో రత్నభండార్ తాళాలు ఉంచడం జరుగుతుంది.

    • నిధికి సంబంధించి డాక్యూమెంట్స్ ఏమీ లేవు.

    • ఈ నిధులు ఎన్ని వందల సంవత్సరాల క్రితం ఇచ్చారన్నది తెలియదు.

    • మూడవ భాండాగారంలో సొరంగం ఉందో లేదో తెలియదు.

    • హై ఎక్యిప్‌మెంట్‌తో భాండాగారం తెరవడం జరుగుతుంది.

    • మూడో తలుపు తాళాలు పగులగొట్టారు.

    • గజపతి మహారాజ్ ఆద్వర్యంలో, హైలెవిల్ కమిటీ పర్యవేక్షణలో ఈ తలుపులు తెరవడం జరిగింది.

  • 2024-07-18T12:36:00+05:30

    కెమెరాకు చిక్కిన అరుదైన ఆటవిక తెగ..

    బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా, ఎవరి కంట పడకుండా పెరూలోని అమెజాన్‌ అడవుల్లో ఒంటరిగా జీవనం సాగిస్తున్న ‘మాష్కో పిరో’ ఆటవిక తెగ ఎట్టకేలకు కెమెరా కంటికి చిక్కింది. ఆ తెగకు సంబంధించిన అరుదైన ఫొటోలు, వీడియోలను ‘సర్వైవల్ ఇంటర్నేషనల్’ అనే సంస్థ విడుదల చేసింది.

    పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

  • 2024-07-18T12:30:11+05:30

    డీజీపీకి మా అసోసియేషన్ ఫిర్యాదు..

    MAA.jpg

    • సోషల్ మీడియాలో నటులపై వస్తున్న ట్రోల్స్‌పై చర్యలు తీసుకోవాలని మా అసోసియేషన్ సభ్యులు డీజీపీకి ఫిర్యాదు చేశారు.

    • మా అసోసియేషన్, నటీనటులపై అసభ్యకరమైన ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి.

    • 5 యూ ట్యూబ్ ఛానళ్ళను నిషేధించాలని డిమాండ్.

    • ఇప్పటికే ఈ ఐదు యూ ట్యూబ్ ఛానళ్ళపై చర్యలు తీసుకోవాలంటూ యూట్యూబ్ ప్రతినిధులకు ఫిర్యాదు చేసిన మా అసోసియేషన్.

    • ఆ ఫిర్యాదుకు సంబంధించిన కాపీలను డీజీపికి అందజేత.

    • యూ ట్యూబ్ లింకులు, స్క్రీన్ షాట్లను డీజీపీకి అందజేసిన రఘుబాబు, శివబాలాజీ.

  • 2024-07-18T12:25:46+05:30

    మీడియాపై విజయసాయి రెడ్డి అసభ్య పదజాలం సిగ్గుచేటు: బుద్దా వెంకన్న

    Buddha-Venkanna.jpg

    • విజయవాడ: నిజాన్ని వెలికి తీయడం తప్పా?

    • మీడియాపై కులముద్ర వేయడం దారుణం.

    • ఇప్పటికైనా విజయ్ సాయి రెడ్డి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి.

    • నిజాన్ని నిర్భయంగా చెబితే వ్యక్తిగతంగా కించపరచడం ఏంటి? మరి గతంలో సాక్షి చేసింది ఏమిటి?

    • ఎంతమందిని విజయ్ సాయి రెడ్డి వ్యక్తిగతంగా దూషించలేదు?

    • కాబట్టి ఇప్పటికైనా జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు విజయసాయిరెడ్డి సమాధానం చెప్పి తానేంటో నిరూపించుకోవాలి.

    • బేషారతుగా మీడియా సంస్థలకు సంస్థ యజమానులకు క్షమాపణ చెప్పాలి.

  • 2024-07-18T11:54:08+05:30

    ప్రజాధనం కొల్లగొట్టడంలో పీహెచ్‌డీ చేసిన జగన్

    Devineni-Uma.jpg

    • అమరావతి: ప్రజాధనం కొల్లగొట్టడంలో జగన్ రెడ్డి పీహెచ్‌డీ చేశారు: దేవినేని ఉమ

    • అధికారం అడ్డుపెట్టుకుని అస్మదీయ కంపెనీలకు వేల ఎకరాల భూసంతర్పణ.

    • ఆ భూములు గంపగుత్తగా అమ్మేసి వచ్చిన సొమ్ములు సొంత ఖజానాకు మళ్లింపు.

    • విదేశీ సంస్థలకు కంపెనీల అమ్మకం ద్వారా.. అవినీతి కేసుల ఉచ్చు నుండి తప్పించుకునే ఎత్తుగడ.

    • ఐదేళ్లలో దోచుకోవడం దాచుకోవడం తప్ప చేసింది శూన్యం.

    • వ్యవస్థలను అపహాస్యం చేసేలా సాగిన వైఎస్ జగన్ దోపిడికి తగిన మూల్యం చెల్లించక తప్పదు.

  • 2024-07-18T11:51:12+05:30

    వివేకా హత్య కేసు అప్‌డేట్స్..

    Ys-Viveka-Case.jpg

    • వివేక హత్య కేసులో నేడు సీబీఐ కోర్టులో విచారణ.

    • కోర్టుకు హాజరైన నిందితులు ఎంపీ అవినాష్ రెడ్డి, వైయస్ భాస్కర్ రెడ్డి, దేవి రెడ్డి శివ శంకర్ రెడ్డి, అప్రూవర్ దస్తగిరి.

    • జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న మిగిలిన నిందితులను మరికొద్దిసేపట్లో కోర్టులో హాజరుపరచునున్న పోలీసులు.

  • 2024-07-18T11:49:06+05:30

    డీఎస్సీ పరీక్షపై హైకోర్టును ఆశ్రయించిన నిరుద్యోగులు

    Telangana-High-Court.jpg

    • తెలంగాణలో డీఎస్సీ పరీక్షపై హైకోర్టు‌ను ఆశ్రయించిన నిరుద్యోగులు.

    • డీఎస్సీ పరీక్షను వాయిదా వేయాలని కోరుతూ 10 మంది నిరుద్యోగుల పిటిషన్.

    • పరీక్షల తేదీలు వాయిదా వేస్తూ ఫ్రెష్ నోటిఫికేషన్ ఇవ్వాలని పిటిషన్.

    • మరోవైపు జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు జరగనున్న డీఎస్సీ పరీక్షలు.

    • పరీక్షలు, నోటిఫికేషన్ రద్దు చేయాలని పిటీషన్‌లో పేర్కొన్న నిరుద్యోగులు.

    • ప్రిపరేషన్‌కు తగిన సమయం ఇవ్వకుండా నోటిఫికేషన్ జారీ చేశారని పిటిషన్.

    • పిటిషన్ పై నేడు హై కోర్టులో జస్టిస్ పుల కార్తీక్ బెంచ్ విచారణ.

  • 2024-07-18T11:26:03+05:30

    సోషల్ మీడియాలో వైఎస్ జగన్ సంచలన పోస్ట్..

    jagan-rims.jpg

    • అమరావతి: సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో వైసీపీ అధినేత జగన్ సంచలన పోస్ట్ చేశారు.

    • రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది.

    • లా అండ్‌ ఆర్డర్‌ అన్నది ఎక్కడా కనిపించడంలేదు.

    • ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది.

    • వైసీపీని అణగదొక్కాలన్న కోణంలో ఈ దారుణాలకు పాల్పడుతున్నారు.

    • కొత్త ప్రభుత్వం వచ్చి నెలన్నర రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్‌ అంటే హత్యలు, అత్యాచారాలు, రాజకీయ కక్షలతో చేస్తున్న దాడులు, విధ్వంసాలకు చిరునామాగా మారిపోయింది.

    • నిన్నటి వినుకొండ హత్య ఘటన దీనికి పరాకాష్ట.

    • నడిరోడ్డుపై జరిగిన ఈ దారుణ కాండ ప్రభుత్వానికి సిగ్గుచేటు.

    • ముఖ్యమంత్రి సహా బాధ్యతతో వ్యవహరించాల్సిన వ్యక్తులు రాజకీయ దురుద్దేశాలతో వెనకుండి ఇలాంటి దారుణాలను ప్రోత్సహిస్తున్నారు.

    • ఎవరి స్థాయిలో వాళ్లు రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ, పోలీసు సహా యంత్రాంగాలన్నింటినీ నిర్వీర్యం చేశారు.

    • దీంతో నేరగాళ్లు, హంతకులు చెలరేగిపోతున్నారు. అధికారం శాశ్వతం కాదని, హింసాత్మక విధానాలు వీడాలని చంద్రబాబును గట్టిగా హెచ్చరిస్తున్నాను.

    • రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో ప్రత్యేక విచారణ జరగాల్సిన అవసరం ఉంది.

    • రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతల పరిస్థితులపై దృష్టిపెట్టాలని ప్రధానమంత్రి మోదీ, హోంమంత్రి మంత్రి అమిత్‌షాకి విజ్క్షప్తి చేస్తున్నాను.

    • వైసీపీ కార్యకర్తలెవ్వరూ అధైర్యపడొద్దని అన్నిరకాలుగా అండగా ఉంటామని భరోసా ఇస్తున్నాను.

    • వినుకొండలో టీడీపీ కార్యకర్తల చేతిలో హత్యకు గురైన రషీద్‌ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను.